తిరుమల లడ్డు: 'సుప్రీం' చురక వేసిందిగా.. ఇకనైనా క్షమాపణ చెప్పు బాబూ..

చేసిన తప్పుకు ప్రాయశ్ఛిత్తంగా భక్తులకు సీఎం క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. తిరుమల లడ్డూపై శ్రీవారే సుప్రీం కోర్టు ద్వారా పలికించారని అభివర్ణించారు.

Update: 2024-09-30 13:03 GMT

శ్రీవారి లడ్డు ప్రసాదంపై సుప్రీం కోర్టు స్పందించిన విధానాన్ని వైసీపీ స్వాగతించింది. చేసిన తప్పు ఒప్పుకుని సీఎం చంద్రబాబు శ్రీవేంకటేశ్వరుడి భక్తులకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని వైసీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.


తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం లో కల్తీ జరిగిందననే ఆరోపణలతో సీఎం చంద్రబాబు నాయుడు భక్తుల మనోభావాలను రెచ్చగొట్టారు. ఈనెల 18వ తేదీ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇప్పటివరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై రాజ్యసభ మాజీసభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై చేసిన ప్రచారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుని రాజకీయంలోకి లాగదంటూ చురకలు అంటించింది. సీఎం చంద్రబాబు, టీటీడీ చేసిన ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని కూడా ఆదేశించింది. "లడ్డూలను పరీక్షించారా? లడ్డూ తయారీకి వాడిన నెయ్యిని పరీక్షించారు? కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత నెయ్యిని వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు. విచారణ జరగకుండానే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం ద్వారా భక్తులు మనోభావాలన దెబ్బతీస్తోంది" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకరరెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. "పదవి ఉంది కదా అని పెదవి జారినా.. అబద్దాన్ని నిజం చేయాలని చూసిన శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి" అని హెచ్చరించారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించిన తీరును ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన గురయ్యారు. ఆయన మాటలు చాలా బాధించిందని కూడా కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో జై శ్యామలరావు చెప్పిన మాటలకు భిన్నంగా.. రెండు నెలల తర్వాత సీఎం చంద్రబాబు నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిసిందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో జరిగిన వ్యవహారాలను టీడీపీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అందులో భాగంగానే తిరుమల శ్రీవారినివివాదాల్లోకి తీసుకురావద్దని తాము ఎంత చెప్పినా చెవికి వేసుకోలేదు" అని కరుణాకర్ రెడ్డి నిరసించారు. ఈ వ్యవహారంపై మొదటి నుంచి తాము "కేసులు పెట్టండి. విచారణ జరపండి" డిమాండ్ చేస్తున్న పట్టించుకోలేదన్నారు. సీఎం హోదాలో చంద్రబాబు అసత్యాలు మాట్లాడారు. మహా ప్రసాదం కలుషితమైందని మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు అని ఆయన తన ఆరోపణలను పునరుద్ఘాటించారు.
తిరుమల శ్రీవారి సుప్రీం కోర్టు ద్వారా మాటలు పలికించాలని కరుణాకర్ రెడ్డి అభివర్ణించారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. తమ పదవీకాలంలో తిరుమల వ్యవహారాల్లో ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఇప్పటికీ ధైర్యంగా విచారణ కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా సరే తిరుమల ఆలయ వ్యవహారాల్లో తమపై చేస్తున్న ఆరోపణలకు సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:    

Similar News