మూసీ కూల్చివేతలపై క్లారిటి

కూల్చివేతలపై జనాలంతా ప్రతిపక్షాల దగ్గరకు వెళుతుంటే బాధితులకు మద్దతుగా ప్రతిపక్షాలు రంగంలోకి దిగుతున్న సమయంలో ప్రభుత్వం కళ్ళు తెరిచినట్లుంది.

Update: 2024-09-28 12:10 GMT

కూల్చివేతలపై జనాలంతా ప్రతిపక్షాల దగ్గరకు వెళుతుంటే బాధితులకు మద్దతుగా ప్రతిపక్షాలు రంగంలోకి దిగుతున్న సమయంలో ప్రభుత్వం కళ్ళు తెరిచినట్లుంది. అందుకనే అర్జంటుగా మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిషోర్, హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ ను రంగంలోకి దింపింది. మూసీనది పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఖాళీ ఎందుకు చేయిస్తున్నారనే విషయమై క్లారిటి ఇచ్చారు. వీళ్ళిద్దరు మీడియాతో మాట్లాడుతు ఇళ్ళవాళ్ళని ఖాళీ చేయిస్తున్నది మూసీ సుందరీకరణ కోసం కాదని జనాల భద్రత కోసమే అని చెప్పారు. మూసీనదికి వరదలు వచ్చినపుడల్లా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో కూడా మూసీకి వరదలు వచ్చినపుడు భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.

భారీ వర్షాలు పడినపుడు గతంలో కూడా ముందుజాగ్రత్తగా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. భారీ వర్షం కురిసి మూసీనది పోటెత్తితే ఎవరూ ఏమీ చేయలేమన్నారు. ఈమధ్య హైదరాబాద్ లో 20 నిముషాల్లో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందన్నారు. 20 నిముషాల వర్షానికే నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటిలో ముణిగిపోతే ఇంకాసేపు భారీవర్షం పడితే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవాలన్నారు. పేద ప్రజలు వరదనీటిలో ఉండి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం నివాసితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు. ప్రపంచలో అభివృద్ధిచెందిన నగరాల పర్యటనకు నగరంలోని ఎంఎల్ఏలు, కార్పొరేటర్లు అక్టోబర్లో వెళ్ళబోతున్నట్లు చెప్పారు.

మూసీనదిని మంచినీటిగా మార్చేందుకు 3800 సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. 10 వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను టేకప్ చేయబోతున్నట్లు చెప్పారు. మూసీ పరివాహక ప్రజలు డబుల్ బెడ్ రూము ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు దాన కిషోర్ చెప్పారు. 10 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తే ఇక్కడినుండి వెళిపోతామని చాలామంది తమతో చెప్పినట్లుగా దాన చెప్పారు. అయితే అందరికీ ఒకేచోట ఇళ్ళు కేటాయించటం సాధ్యంకాదన్నారు. మూసీ బాధితులందరికీ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందన్నారు. బాధితులను నగరంలోని 14 ప్రాంతాలకు తరలించబోతున్నట్లు కూడా చెప్పారు. పిల్లల చదువల విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదని అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కిషోర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50 కుటుంబాలను తరలించినట్లు చెప్పారు. నష్టపరిహారం కింద బాధితులకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందని దానకిషోర్ చెప్పారు.

Tags:    

Similar News