పిల్లలను ఎర్రటి ఎండలో మోకాళ్లపై నిలబెట్టిన స్కూల్

తిరుపతిలో సమీపంలోని రేణిగుంటలో జరిగిన సంఘటన;

By :  Admin
Update: 2024-08-04 07:08 GMT
పిల్లలను ఎర్రటి ఎండలో మోకాళ్లపై నిలబెట్టిన స్కూల్
  • whatsapp icon

రేణిగుంట లోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ యాజమాన్యం పసిపిల్లలను ఎర్రటి ఎండలో మోకాళ్లపై నిలుచోపెట్టిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, తక్షణం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.



పసిపిల్లలన్న కనికరం లేకుండా ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబెట్టిన వైనం బాధాకరమని వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను జిల్లా కలెక్టర్ కు, జిల్లా విద్యాశాఖాధికారికి పంపామని దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కందారపు మురళి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News