చీఫ్‌ కార్డియాక్‌ సర్జన్‌ ఓపీ యాదవకు ఎన్టీఆర్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌

సెప్టెంబర్‌ 9న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్‌ రాధికారెడ్డిలు వెల్లడించారు.;

Update: 2025-09-06 12:47 GMT

సెప్టెంబర్‌ 9న డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27వ, 28 వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ పీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్‌ రాధికారెడ్డి తెలిపారు. శనివారం డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఇతర అధికారులతో కలిసి వారు మాట్లాడారు. కోవిడ్‌ వల్ల 2021, 2022 బ్యాచ్‌లకు స్నాతకోత్సవం నిర్వహించలేదన్నారు. సెప్టెంబర్‌ 9 వ తేదీ న తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వ విద్యాలయ కులపతి జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్శిటీ ప్రధానం చేసే గౌరవ డాక్టరేట్‌ కోసం ముగ్గురు పేర్లతో గవర్నర్‌ కు పంపించగా డిల్లీలోని నేషనల్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ కు చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ – చీఫ్‌ కార్డియాక్‌ సర్జన్‌ డా. ఓపీ యాదవ కు గౌరవ డాక్టరేట్‌ డిగ్రీ కి ఎంపిక చేసినట్లు చెప్పారు.

27 వ స్నాతకోత్సవానికి 53 మంది విద్యార్ధులకు, 28 వ స్నాతకోత్సవానికి 67 మంది విద్యార్ధులకు గోల్డ్, సిల్వర్‌ మెడల్స్‌ అందించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్‌ గా స్నాతకోత్సవం నిర్వహిస్తామన్నారు. యూనివర్శిటీలో రీసెర్చ్‌ యాక్టివిటీస్‌ కొరకు 75 లక్షల గ్రాంట్‌ మంజూరు చేసినట్లు చెప్పారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ డా. వి. రాధికా రెడ్డి మాట్లాడుతూ రెండు బ్యాచ్‌లకు సంబంధించిన స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 53 మంది విద్యార్ధులకు 72 మెడల్స్, 18 క్యాష్‌ ప్రైజ్‌ లు, 28 వ స్నాతకోత్సవానికి సంబంధించి 67 మంది విద్యార్ధులకు 84 మెడల్స్, 20 క్యాష్‌ ప్రైజ్‌ లు అందించనున్నట్లు చెప్పారు. వీరితో పాటుగా పీహెచ్‌డీ పూర్తి చేసిన 5 మందికి పీహెచ్‌ డీ పట్టాలు, సూపర్‌ స్పెషాలిటీ లో 1 కి డిగ్రీ అందించనున్నట్లు వెల్లడించారు.
Tags:    

Similar News