చంద్రబాబు మాటలు బిగ్ జోక్ ఆఫ్ ద డికేడ్
అదాని విద్యుత్ ఒప్పందాలపై వైఎస్ షర్మిల మరో సారి ధ్వజమెత్తారు.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అదాని చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అదానీపై చర్యలకు చంద్రబాబు గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. చంద్రబాబు ఈ మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని నాడు ఎందుకు విమర్శలు చేశారు? అదానీ పవర్ ఎక్కువ రేటు వెచ్చించి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని నాడు ఎందుకు చెప్పారు? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు? అంటూ సీఎం చంద్రబాబు మీద ప్రశ్నల వర్షం కురిపించారు.