వీర జవాన్ మురళీ నాయక్‌కు చంద్రబాబు నివాళి
అనంతపురం జిల్లా పర్యటనలో వీర జవాన్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు.;
By : The Federal
Update: 2025-05-09 15:29 GMT
ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ ముళీ నాయక్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు మురళీ నాయక్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు.