చంద్రబాబు పాలనలో రాయలసీమ : 5 నెలలు 10 అన్యాయాలు
‘చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నుంచి ఎపుడూ వల్లించే మాట వికేంద్రీకరణ, చేసేదంతా అమరావతి కేంద్రీకరణ’
-డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
ముఖ్య మంత్రి చంద్రబాబు సాగుతున్న ఎన్ డిఎ పరిపాలన 5 నెలల కాలంలో రాయలసీమకు10 అన్యాయాలు,మోసాలు, ద్రోహాలు జరిగాయి.
అవి:
1.సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రం తరలింపు. 2023 డిసెంబర్ 4 న కేంద్ర ప్రభుత్వం రు 250 కోట్లతో కడప జిల్లాలో,కొప్పర్తి పారిశ్రామిక వాడలో MSME సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని మంజూరు చేసింది.చంద్ర బాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 24 న ఈ కేంద్రాన్ని జీవో 56 ద్వారా అమరావతికి తరలించింది.
2.కడప జిల్లాలోని పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల కు నేషనల్ మెడికల్ కమీషన్ 2024 ఆగష్టు 16 న 50 MBBS సీట్లు మంజూరు చేసింది.ఈ సీట్లు వద్దని 2024 సెప్టెంబర్ 10 న చంద్ర బాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసింది.దీనితో వచ్చిన 50 సీట్లు కొల్పాయాం.
3.విభజన చట్టం లో షెడ్యూల్ 13 ప్రకారం కడప జిల్లాలో SAIL ఆధ్వర్యం లో ఉక్కు కర్మాగారం నిర్మించాలి.ప్రస్తుతం దీని ఊసే లేదు.
4.విభజన చట్టం లో సేక్షన్ 46 ప్రకారం రాయల సీమకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి అమలు చేయాలి.ఆ ప్రస్తావనే లేదు.
5.ప్రస్తుతం కర్నూల్ లో వున్న లోకాయుక్త కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ప్రయత్నం .
6.ప్రస్తుతం కర్నూల్ వున్న జాతీయ మానవ హక్కుల కమీషన్ కార్యాలయాన్ని అమరావతికి మారుస్తూ ప్రయత్నం.
7.ప్రస్తుతం కర్నూల్ వున్న సీబీఐ కోర్టును అమరావతికి తరలించాలని ప్రయత్నం.
8.ప్రస్తుతం కర్నూల్ లో ఉన్న APERC కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ప్రయత్నం.
9.ప్రస్తుతం కర్నూల్ లో వున్న వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ప్రయత్నం.
10. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమ లో కాకుండా విజయవాడ లో పెట్టాలని ప్రయత్నం.
ఒక వైపు అధికార,అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మరొక వైపు పూర్తి కేంద్రీకరణ వైపు పయనించడం విడ్డూరం. ఒక వైపు రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెబుతూ మరొక వైపు తీరని అన్యాయం చేయడం గర్హనీయం. రాయలసీమ లో వున్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్ధని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాయలసీమ పొలిమేరల నుండి కూటమి పార్టీలను ప్రజలు తరిమి కొట్టేస్తారు. చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా మసలుకోవాలి.
(డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి)చ