దేశంలో చంద్రబాబే అత్యంత శక్తివంతమైన సీఎం
సీఎం చంద్రబాబు రికార్డు సృష్టించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. దేశంలోనే తనకు తిరుగులేదని చూపించారు.
దేశంలోనే అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఆయన తర్వాతే తక్కిన సీఎంలు అన్నట్టుగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. చంద్రబాబు తర్వాతే తక్కిన సీఎంలకు స్థానాలు దక్కాయి. దేశ వ్యాప్తంగా శక్తివంతమైన నాయకుల్లో కూడా చంద్రబాబు స్థానం సంసాదించుకున్నారు. దేశంలో టాప్ టెన్ నేతల్లో సీఎం చంద్రబాబు ఐదో స్థానంలో నిలిచారు. చంద్రబాబు కంటే ముందు ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే వెలువరించిన ఒక కథనంలో ఈ విషయాలను వెల్లడించింది. దేశంలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్, యుపీ సీఎం ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ మమతాబెనర్జీ వంటి ముఖ్యమంత్రులను, యుపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కాదని ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత శక్తివంతమైన సీఎంగా నిలిచారు. సీఎం చంద్రబాబు తర్వాత వీరు వరుస స్థానాల్లో నిలిచారు. అయితే సీఎం చంద్రబాబు ఎందుకు అంత శక్తివంతమైన సీఎంగా ఆవిర్భవించారనే అంశాలను వివరించే ప్రయత్నం చేసింది.
చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ద్వారా రాజకీయ అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్ పిక్షిలా పునర్జన్మం ఎత్తి, అధికారం చేజిక్కించుకున్నారని వెల్లడించింది. ఈ పర్వాన్ని హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చింది. అలాంటి సినిమాల్లో మాత్రమే చారిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని పేర్కొంటూనే, చంద్రబాబు దీనిని వాస్తవంగా చేసి చూపించడంతో పాటు దేశ రాజకీయాల్లో కీలక నేతగా అవతరించారని వెల్లడించింది. తెలుగుదేశం పార్టీని పతనావస్థ నుంచి పునరుజ్జీవంప చేశారని, జనసేన, బీజేపీలతో కూటమిగా ఏర్పడి విజయ తీరానికి చేర్చారని, చంద్రబాబు నాయుడే భారతదేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ సీఎం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా మారి చక్రం తిప్పుతున్నారని పేర్కొంది.