‘ఆ మాట వైసీపీ చెప్పగలదా’.. జగన్‌కు బుద్దా వెంకన్న ఛాలెంజ్..

ఏపీలో కొంతకాలంగా జరుగుతున్న ఫైళ్ల దగ్దం అంశంపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో ఉన్నవారంతా దండు పాళ్యం బ్యాచ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-20 10:05 GMT

ఏపీలో కొంత కాలంగా జరుగుతున్న ఫైళ్ల దగ్దం అంశంపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో ఉన్నవారంతా దండు పాళ్యం బ్యాచ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019-2024 మధ్య రాష్ట్రంలోని అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని అన్నారు. అప్పుడు జరిగిన అవినీతికి కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఫైళ్లు తగలబడుతున్నారని ఆరోపించారు. ఆ శాఖలో అవినీతి జరిగింది.. ఈ శాఖలో అవినీతి జరగలేదు అని చెప్పడానికి లేదన్నారు. ఏదైనా శాఖలో అవినీతి జరగలేదని, చేయలేదని జగన్ చెప్పగలరా? అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అంచనాలకు మించిన అవినీతి చేయబడ్డే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు తగలబెడుతున్నారని విమర్శించారు. కొందరు అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై కలిసి కట్టుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని, దమ్ముంటే పట్టుకోండంటూ వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రారంభించాయని, జగన్‌ను చూసి భయపడే ఒక్క సంస్థ కూడా ఏపీకి వచ్చే ధైర్యం చేయలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం మారాక పరిశ్రమలు

ఇప్పుడు ప్రభుత్వం మారింది. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, తమ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రపంచ సంస్థలు పోటీ పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ‘‘చంద్రబాబును చూసి పరిశ్రమలు ఏపీకి వస్తుంటే గతంలో తాము చేసిన ప్రయత్నాలే ఈ పెట్టుబడులకు కారణమని చెప్పుకోవడానికి వైసీపీకి సిగ్గు ఉండాలి. జోగి రమేష్ భూ బాగోతం చూశాం. అటాచ్‌లో ఉన్న ఆస్తులను కూడా స్వాహా చేశారు. వైసీపీ పాలనలో అన్నీ కూడా అక్రమాలు, అరాచకాలే జరిగాయి. జగన్.. పెద్దపెద్ద దోపిడీలు చేశారు. ఆయన అడుగు జాడల్లోనే పార్టీ నేతలు నడిచారు. అందినకాడికి దోచుకున్నారు. అదుగో ఆ శాఖలో అవినీతి జరగలేదు. మేము దోచుకోలేదు అని చెప్పే దమ్ము ధైర్యం వాళ్లకి ఉందా? వాళ్లు ఏశాఖ చెప్పినా అందులో జరిగిన అవినీతిపై చర్చించడానికి నేను రెడీ’’ అని వైసీపీకి బుద్దా వెంకన్న ఛాలెంజ్ చేశారు.

ఫైళ్లు తగలబడం ఏంటో..!

‘‘అసలు ప్రభుత్వ శాఖల్లోని కీలక ఫైళ్లు రోజుల వ్యవధిలోనే తగలబడం ఏంటో అర్థం కావడం లేదు. చాలా వింతగా ఉంది. ఈ ఫైళ్ల దగ్దం అనేది ఎవరికీ అర్థం కాని జగన్ ఆర్ట్. ఎవరికీ దొరక్కుండా తగలబెడుతున్నారు. చేసిన అవినీతి బయటపడకూడదనే ఈ తగలబెట్టే పననులు చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళలారు. ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి భారీ సంఖ్యలో అధికారులు క్యూ కట్టబోతున్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు, వారికి సహకరించిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు శిక్ష తప్పదు. నేను చేసిన ఛాలెంజ్‌ను ఎవరైనా దమ్ముంటే ముందుకు వచ్చి స్వీకరించండి’’ అని మరో ఛాలెంజ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్లో మార్పు మొదలైందని, ఐదేళ్ల పాటు అంధకారంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడిప్పుడే మళ్ళీ వెలుగు చూస్తోందని, అభివృద్ధిని ఆస్వాదిస్తుందంటూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News