బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారు

దళితుడనే మండలి ఛైర్మన్‌ను కూటమి సభ్యులు అవమానిస్తున్నారని బొత్స మండిపడ్డారు.

Update: 2025-09-26 13:11 GMT

అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖలు వినడానికే సిగ్గుగా ఉందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారు.. ఏం చూసి మీ అహంభావాం అని బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎంను, చిత్ర పరిశ్రమలోని ముఖ్యమైన నటుడుని అసెంబ్లీ వేదికగా అవమానించడం బాధాకరమన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మొత్తం రికార్డుల్లో ఉన్నాయని అన్నారు. చట్ట సభల్లో బాలకృష్ణ ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.

మండలి వాయిదా అనంతరం వైసీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బొత్స మాట్లాడారు. మమ్మల్ని ఎవరేం పీకుతారని మంత్రి నారా లోకేష్‌ సభలో వ్యాఖ్యానించారని, మామా బాలకృష్ణ, అల్లుడు లోకేష్‌ వ్యవహార శైలి అలానే ఉందని మండిపడ్డారు. మాజీ సీఎం అన్నా, మాజీ కేంద్ర మంత్రి అన్నా వాళ్లకు గౌరవ లేదన్నారు. టీడీపీ పార్టీ నుంచి ఇంత వివరణ కూడా లేదని మండిపడ్డారు. స్పీకర్‌ చాలా పెద్ద మాటలు మాట్లాడుతారు.. ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒక మాజీ సీఎంను, ఒక మాజీ కేంద్ర మంత్రిని సభలో అవమానిస్తే స్పీకర్‌ పట్టించుకోరా అని నిలదీశారు. చిరంజీవిని అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించ లేదనేది మాకు అనవసరం.. ఇక్కడ కేవలం మేము సభా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజును దళితుడు కాబట్టి కూటమి సభ్యులు అవమానిస్తున్నారని వైసీపీ నేత, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్‌ భవనం ప్రారంభోత్సవంలో ఆయన పేరు ఆహ్వాన పత్రికలో చేర్చకపోవడమే ఇందుకు నిదర్శనం,‘ అని ఆరోపించారు. తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు కూడా ఛైర్మన్‌కు ఆహ్వానం అందలేదని, ఈ చర్యలు ఛైర్మన్‌ స్థానానికి, దళిత సమాజానికి అవమానకరమని ఆయన అన్నారు.
Tags:    

Similar News