ఉపఎన్నికలో కూటమి తన అభ్యర్థిని ఎందుకు నిలబెడుతోంది.. ప్రశ్నించిన బొత్స

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-08-12 10:24 GMT

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఈ ఉపఎన్నికలో కూటమి తన అభ్యర్థిని ఎందుకు నిలబెడుతుందని ప్రశ్నించారు. కూటమి తన అభ్యర్థిని పోటీకి నెలబెట్టడం అనైతికమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి విజయం తమదేనని సంకేతాలిచ్చారు. వైసీపీ క్యాడర్ అంతా కలిసి కట్టుగా పనిచేసి తన విజయానికి సహకరించాలని కోరారు. అయితే విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో తమ సత్తా చాటాలని అధికార, విపక్ష వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 13 వరకు కొనసాగనుంది. 14 నుంచి 16 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 30 ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ జరిగిన ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ సందర్బంగా ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాట్లాడుతూ.. వైసీపీకి సంఖ్యా బలం ఉందని అన్నారు.

బరిలో కూటమి అభ్యర్థి ఎందుకు?

‘‘జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. మాకు సంఖ్యా బలం భారీగా ఉంది. ఈ ఉపఎన్నికలో విజయం వైసీపీనే వరిస్తుంది. అందులో సందేహం లేదు. మాకు 530 మందికిపైగా ప్రజాప్రతినిధుల బలం ఉంది. ఇలాంటప్పుడు ఉపఎన్నిక బరిలో కూటమి తమ అభ్యర్థిని ఎందుకు నిలబెడుతోంది? వైసీపీ బలంగా ఉన్నప్పుడు అభ్యర్థిని నిలబెట్టడం అనైతికం. ఇలాంటి చర్యలకు కూటమి సర్కార్ ఎందుకు దిగజారుతోంది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఒకవేళ ఉపఎన్నికలో టీడీనీ తరపున అభ్యర్థి నిలబడితే అది దుశ్చర్యే అవుతుంది. ఇదేమీ వ్యాపారం కాదు. మెజార్టీ ఉంది కాబట్టే వైసీపీ పోటీ చేయాలని నిశ్చయించుకుంది. మాకు వివాదం అక్కర్లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవట్లేదు’’ అని అన్నారు.

Tags:    

Similar News