నగ్నవీడియోలలో దొరికిన ఈ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు?

ఏపీ రాజకీయ ప్రముఖులు నగ్న వీడియో వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కొందరు వైసీపీ నేతలపై వచ్చిన ఆరోపణల లాంటివే ఇప్పుడు బీజేపీ నేతలపై వచ్చాయి.

Update: 2024-10-10 10:35 GMT

బీజేపీ నాయకులిద్దరి నగ్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీళ్లలో ఒకరు గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కాగా మరొకరు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే వదంతులు బయటికి వచ్చాయి. తమ పార్టీకి చెందిన ఓ మహిళతో రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు వీడియోకాల్‌లో మాట్లాడుతూ నగ్నంగా కనిపించారు. ఇప్పుడీ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. బీజేపీ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే నేత ఒకరు దీనిపై విచారణ చేసి.. పార్టీ పెద్దలకు నివేదికను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుకు ఇచ్చారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు వీరిద్దరిపైనా చర్యలు తీసుకోనున్నారు. పార్టీ చర్య తీసుకోవడానికి ముందే వీళ్లిద్దరితో రాజీనామా చేయించనున్నట్టు తెలిసింది.


గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఓ మహిళకు సంబంధించిన వీడియో కాల్ బుధవారం వైరల్‌ అవుతోంది. "రేపు నాతో వస్తావా?" అని ఆయన ఆమెను అడగడం వినబడుతుంది. "పోయనసారి మాదిరే రేపు తాగుదాం..." అని చెప్పడం కూడా వినపడింది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రముఖులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022లో వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్న వీడియో కాల్ చేసినట్టు ఓ వీడియో వైరల్ అయింది. అయితే ఆ వీడియో ఫేక్ అని మాధవ్ పేర్కొన్నారు.
2022లో తన డ్రైవర్‌ను హత్య చేసినందుకు ఇప్పటికే విచారణలో ఉన్న వైసీపీ ఎంఎల్సీ ఒకరు కూడా అసభ్యకరమైన వీడియోలో పట్టుబడ్డారు. అందులో ఆయన కూడా నగ్నంగా కనిపించారు. వైసీపీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వాసి ఒకరు కూడా ఫోన్ లో హస్కీ సంభాషణ చేసిన వార్త వైరల్ అయింది.
ఇప్పుడు బీజేపీ నాయకుల వంతు వచ్చినట్టుంది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా ముఖ్యనాయకుడు, పార్టీ అధిష్టానంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఈ రెండో నాయకుడి వ్యవహారంతో పార్టీ ఉలిక్కిపడింది. బుధవారం రాత్రి నుంచి బయటకు వచ్చిన నగ్న వీడియోతో పార్టీ నాయకత్వం చిక్కుల్లో పడింది. ఆ ఇద్దరు నేతల వీడియోలు బయటకు రావడం వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయమున్నట్లు సమాచారం.
గతంలో వేరే పార్టీలో ఉండి ఇటీవల బీజేపీలో చేరిన మహిళతో ఈ నేతలు సరసాలు నెరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆమె డబ్బు కోసం పట్టుబట్టడం, ఆమె అడిగినంత డబ్బు ఇవ్వలేక పోవడం కూడా ఈ వీడియోలు బయటకు రావడానికి కారణమైనట్టు చెబుతున్నారు. గతంలో కూడా ఆ మహిళ ఇటువంటి పని చేసినట్టు చెబుతున్నారు. ఏమైనా ఈ నగ్నవీడియోల వ్యవహారం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది.



Tags:    

Similar News