ఆంధ్రప్రదేశ్ కి సెమీ కండక్టర్ల ప్రాజెక్ట్ వచ్చినట్టే!

96 మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో ఏపీకి సెమీకండక్టర్ ప్లాంట్;

Update: 2025-08-12 14:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో సెమీ కండక్టర్ల ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రాకతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.

ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నేతృత్వంలో సెమీ కండక్టర్‌ తయారీ ఏపీకి వస్తోందన్నారు. రాష్ట్రానికి సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ‘ఎక్స్‌’లో ట్వీట్ చేశారు.
అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) దక్షిణ కొరియాకు చెందిన APACT కంపెనీ లిమిటెడ్‌తో 96 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిపారు. సెమీకండక్టర్లను మొబైల్‌ ఫోన్లు, సెట్‌ టాప్‌ బాక్సులు, ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్‌ అప్లికేషన్స్‌లో ఉపయోగిస్తారని.. తద్వారా ఆత్మనిర్భర భారత్‌కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని లోకేశ్‌తెలిపారు.
దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్‌ (Union Cabinet) ఆగస్టు 12న జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పంజాబ్‌లో సెమీ కండక్టర్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రూ.4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్‌ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన ఈ నాలుగు కొత్త ప్రాజెక్టులతో వీటి సంఖ్య మొత్తంగా 10కి చేరింది.
2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఎలక్ట్రానిక్‌ తయారీ ఎకోసిస్టమ్‌కు ఉత్ప్రేరకంగా పనిచేయడం ద్వారా ఇవి పరోక్షంగానూ అనేక ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడనున్నాయి.
సెమీకండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఆమోదించిన ఈ నాలుగు కొత్త సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడంలో, ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంది.
Tags:    

Similar News