కుప్పంలో భువనేశ్వరి వాడవాడల పర్యటన, మహిళలతో మాటామంతీ

కుప్పం నియోజవర్గ మహిళలతో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

Update: 2024-07-23 17:27 GMT


ఏపీలోని కుప్పం నియోజకవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి సారీ గెలుస్తున్న నియోజకవర్గం. అక్కడి ప్రజలు చంద్రబాబును ఎంతగానో అభిమానిస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి చంద్రబాబును అసెంబ్లీకి పంపిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో పేదరికంలో ఉన్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంతో ఏదో ఎడతెగని సంబంధం చంద్రబాబుకు ఉంది. 2014లో గెలిచి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని మహిళలను బస్సుల ద్వారా పిలిపించి అమరావతిలోని తాత్కాలిక సచివాలయాన్ని చూపించారు. ముఖ్యమంత్రి చాంబర్‌ను, ఆయన కార్యాలయం ఉండే సచివాలయంలోని ఒకటో బ్లాక్‌ను వారికి చూపించారు. వారు కోరిన కోర్కెలు తీర్చారు. ఒకటో బ్లాక్‌లో ఉన్న కాన్ఫరెన్స్‌ హాలులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. సచివాలయం ఎలా ఉంటుంది, మంత్రులు, అధికారులు ఎక్కడి నుంచి పాలన ఎలా సాగిస్తారనే వివరాలు అధికారులు వారికి వివరించి సచివాలయ ప్రాంగణమంతా చూపించారు. ప్రస్తుతం కుప్పం నుంచి వారిని సచివాలయానికి పిలిపించి మాట్లాడే తీరిక లేకపోవడంతో చంద్రబాబునాయుడు నేరుగా తన సతీమణిని అక్కడికి పంపించారు. ప్రధానంగా తనను ఆదరించిన వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకోవాలని భార్యకు సూచించారు. చంద్రబాబునాయుడు సూచన మేరకు నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో మంగళవారం నుంచి పర్యటిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి అక్కడి మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు.

మీకు ఏదో ఒకటి చేయాలి

మీరు 40 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మీకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో నేను మీ ముందుకు వచ్చానని భువనేశ్వరి అక్కడి మహిళలతో అన్నారు. సోమవారం సాయంత్రం గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. గ్రామంలోని మహిళలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో మహిళలు వచ్చారు. వంద ఏళ్లకు పైబడిన రావిచెట్టు కింద అహ్లాదకరమైన వాతావరణంలో ముఖాముఖి నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ఓటర్లకు భువనేశ్వరి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు.

సమస్యలు తెలుసుకుంటూ...

Delete Edit

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎక్కువగా కమ్యునిటీ సమస్యలు చెప్పడం విశేషం. చెప్పిన ప్రతి సమస్యను పిఎస్‌ నోట్‌ చేసుకున్నారు. కొందరు అర్జీలు ఇచ్చారు. ఇలా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహిస్తారో వెల్లడించలేదు. సమయాన్ని బట్టి ఎన్ని రోజులైనా కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ప్రతి సమస్యను క్షుణ్ణంగా వింటున్నారు. తన పరిధిలో పరిష్కారం అయ్యేవి అయితే అక్కడి అధికారులకు తెలిపి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున చేయాల్సిన అంశాలు తన దృష్టికి వస్తే వాటిని ముఖ్యమంత్రికి తెలిపేందుకు నిర్ణయించారు. నిదానంగా మాట్లాడుతూ అక్కడి మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

కుప్పం నియోజకవర్గంలో ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం విశేషం. ఇక్కడి వారు నాగరికతకు కొంతవరకు దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. తమిళం, తెలుగు, కన్నడ మిక్స్‌చేసి మాట్లాడుతుంటారు. అక్షరాస్యత శాతం కూడా అనుకున్నంతగా లేదు. ఇక్కడి నుంచి ప్రతిసారీ చంద్రబాబునాయుడు గెలుస్తున్నాడు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిని గెలిపించిన కుప్పం ప్రజలకు దక్కింది. వరుసగా ఆరు సార్లు చంద్రబాబునాయుడు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి చంద్రబాబునాయుడు గెలుస్తూ వస్తున్నారు. తిరుగులేని వ్యక్తిగా చంద్రబాబు గెలుస్తుండటంతో నియోజకవర్గానికి ఉన్న సమస్యలు తెలుసుకుని తీర్చాలంటే గ్రామాల్లో తిరిగి తెలుసుకోవడమే మార్గమని ముఖ్యమంత్రి సతీమణి పర్యటన చేపట్టారు.

Tags:    

Similar News