War in the Alliance | మైనారిటీ నేత కోసం ధర్మవరం కూటమిలో యుద్ధం
మైనారిటీ నేత పార్టీ మారే వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడులకు దిగడంతో పట్టణంలో అదనపు బలగాలు మోహరించాయి.;
ధర్మవరం పట్టణంలో ప్రముఖ ముస్లిం మైనారిటీ నేత జమీన్. ఆయన బీజేపీలో చేరాలనుకు నిర్ణయం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీలోని ఓ వర్గం దాడిలో ఆయనతో పాటు అనుచరులు కూగా గాయపడ్డారు. జమీర్ ఇంటిపై కూడా టీడీపీ మద్దతుదారులు దాడులకు ప్రయత్నించారు. ధర్మవరంలో టీడీపీలోని ఓ వర్గం బీజేపీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో కొందరు గాయపడంతో పాటు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. అధికార పార్టీలోని రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగిన నేపథ్యంలో సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు. పట్టణంలో అదనపు బలగాలను మోహరించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే...
ధర్మవరం పట్టణంలో ముస్లిం మైనారిటీ నేత జమీర్ కు రాజకీయంగా మంచి పట్టు ఉంది. గతంలో టీడీపీలోనే ఓ వర్గం నేతల వేధింపులు భరించలేని స్థితిలో ఆయన గతంలో వైసీపీలో చేరారు. అందులో ప్రధానంగా గతంలో ఓ టీడీపీ నేత తన భూమిని ఆక్రమించాలనే యత్నంతో జమీర్ రాజకీయ రక్షణ కోసం వైసీపీలో చేరినట్లు చెబుతున్నారు. తాజాగా వైసీపీలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ నేతలే కాకుండా, మాజీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు బయటికి వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కరిది ఒకో కారణమైనా, ధర్మవరంలో జమీర్ టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితుల్లో బీజేపీలో చేరడానికి మంత్రి సత్యకుమార్ తో మాట్లాడుకున్నారు. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు.