బాబు పారదర్శక పాలన: టీటీడీలో అంతా రివర్స్?
రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పాలనకు అడుగులు వేసింది. టీటీడీలో ముగిసిన సమీక్షల్లో ఏమి నిర్దారించారు. సామాన్య యాత్రికులకు ఎలాంటి మేలు చేయబోతున్నారు?
By : SSV Bhaskar Rao
Update: 2024-08-14 12:54 GMT
సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడితే, పారదర్శక విధానాలు అనుసరిస్తుంటారు. తాజాగా కూడా ఆయన శ్వేతపత్రాలు విడుదలతో వాస్తవ పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. చిన్న రాష్ట్రానికి సరిపడ బడ్జెట్ ఉన్న టీటీడీలో అంతా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఏమి చేస్తారు? ఎలా? అనేది మాత్రం వారు చెబితేనే వినాలి. ఏదైనా సమాచారం కావాలన్నా దొరకదు. ఈ క్షేత్రంలో...
"సామాన్య భక్తుడే తిరుమల శ్రీవారికి ప్రధాన ఆదాయ వనరు.
కానుకల రూపంలో తలనీలాల సమర్పణలో కూడా"
దర్శనాలు, వసతిలో మాత్రం పెద్దలకే ప్రాధాన్యం"
దశాబ్దాలుగా టీటీడీలో సాగుతున్న తీరు ఇది. కానీ...
"సామాన్య భక్తులకే పెద్దపీట" అని అధికారులు పలుకుతుంటారు. ఈ పరిస్థితుల్లో...
టీటీడీలో ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. అందులో లడ్డూ ప్రసాదం తీయారీ, అన్నదానసత్రంలో నాణ్యత పెంపుదల కోసం చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు హోటళ్లపై కొరడా ఝుళిపించారు. మినహా, వివిధ శాఖల్లో మాత్రం అధికారులు ఆ స్థానాల నుంచి కదిలించే ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. ఇదిలావుంటే,
గతంలో సాగిన పాలనపై విజిలెన్స్ విచారణ ఏమైందనేది తెలియదు. అడిగినా ఎవరూ నోరు మెదపరు. ఇందులో అధికారులే బలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థలో సమూల సంస్కరణలు నేతిబీరలో నేయి చందమే అన్నట్లు కనిపిస్తోంది. దీంతో బాధ్యతలు చేపట్టే పాలక మండలికి అనేక సవాళ్లు స్వాగతిస్తున్నాయి. టీటీడీలో సామాన్య యాత్రికుల దర్శనం కష్టాలు, ప్రైవేటు అతిథి పీఆర్ఓల వల్ల ఆదాయానికి గండి పడుతున్న తీరు ఎలా ఉందనేది ప్రత్యేక కథనాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఇది ప్రారంభం.
"తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తా" అని సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ప్రకటన చేయడమే కాదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువయ్యాక టీటీడీకి సీనియర్ ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును ఈఓగా, తిరుమల అదనపు ఈవోగా ఉన్నత స్ధాయి అధికారిని కూడా నియమించారు. మిగిలింది ఇక చైర్మన్, పాలక మండలి నియామకం మాత్రమే.
టీటీడీలో ఈఓ శ్యామలరావు చేపట్టిన ప్రక్షాళన కోసం సమీక్షలు పూర్తయ్యాయి. యాత్రికులతో ముడిపడి ఉన్న విభాగాల్లో మాత్రం సవాళ్లు అలాగే ఉన్నాయి. టీటీడీలో కింది స్థాయి ఉద్యోగులు మినహా సూపరింటెండెంట్ నుంచి ఈఓ వరకు వినియోగించే సెల్ ఫోన్లు యాత్రికులు సమర్పించే కానుకలతోనే బిల్లులు చెల్లిస్తారు. వారి నంబర్లు తెలుసుకునే మీడియా, ఇతర ఏ వర్గానికి చెందిన వారు ఎవరైనా కాల్ చేస్తే మాత్రం స్పందన ఉండదు. రాజకీయ నేతలు, విఐపీ, వీవీఐపీ, దర్శన దళారులు, మఠాల వారికి మాత్రం ఠక్కున సమాధానం దొరుతుంది. టికెట్ల మంజూరులో ప్రజాప్రతినిధుల కంటే, తిరుమలలో కొందరు జర్నలిస్టుల సిఫారసులకు విలువ, వసతి, దర్శన టికెట్ల కోటా ఎక్కువ.
"టీటీడీలో ఉన్న సమస్య ఒక్కటే... అధికారులు దొరకరు. దొరికినా మాట్లాడారు" అని
తిరుపతిలోని వెటరన్ జర్నలిస్ట్ రామచంద్రారెడ్డి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో వ్యాఖ్యానించారు.
ఈ ధార్మిక సంస్థలో ఈఓలుగా పనిచేసిన డాక్టర్ కేవీ. రమణాచారి, కే. కృష్ణయ్య, అంతకుముందు పీవీఆర్కే. ప్రసాద్ చేసిన మంచి పనులు చాలి ఉన్నాయి" అని గుర్తు చేసిన రమణాచారి, వారి హయాంలో యాత్రికులు, సిబ్బందితో ఎలా మెలిగేవారు. మీడియాకు ఎంతదగ్గరగా ఉండే వారనే విషయం ప్రస్తుత అధికారులు తెలుసుకోవాలి" అని ఆయన గుర్తు చేశారు. దానివల్ల ధార్మిక సంస్థపై అనవసర వార్తలు రాసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
సామాన్యుల కానుకలే కీలకం
చిన్న రాష్ట్రానికి ధీటుగా పాలన సాగే టీటీడీలో మొదటి దేవుళ్లు యాత్రికులే. వారు హుండీ ద్వారా సమర్పించే కానుకలు రోజూ రూ. 3.50 కోట్ల నుంచి, రద్దీ పెరిగితే రూ. నాలుగు కోట్ల వరకు ఆదాయం ఉంటుంది. దాతలు రూ. లక్షల్లో సమర్పించే విరాళాలు, తలనీలాల వేలంతో ఏటా రూ. 120 నుంచి 140 కోట్ల వరకు ఉంటుంది.
ప్రస్తుత ఈఓ శ్యామలరావు వచ్చిన తరువాత ఓ విషయం బయటపడింది.
"శ్రీవారి దర్శనానికి సామాన్య యాత్రకులకు రోజూ 2,500 వేల టోకెన్లు జారీ చేయాలి. ఆ లెక్కన వారానికి 1.75 లక్షలు ఇవ్వాలి. గత ఐదేళ్లలో అందులో 40 వేల టోకెన్లు తగ్గించారు" అని ఈవో శ్యామలరావు చెప్పడమే కాదు. వాటిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నారు.
సామాన్య యాత్రికుల ఆధారంగా లభించే ఆదాయంతో టీటీడీ యంత్రాంగం యాత్రికులకు వసతి, ఉచిత అన్నదానం వంటి కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు శ్రీవారి వైభవాన్నిచాటి చెప్పేందుకు ధార్మిక ప్రచార కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యరంగంలో సేవలు అందిస్తున్నారు. దాదాపు 1600 మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 6,700కు తగ్గింది. మిగతా ఖాళీలను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందితో పనిచేయిస్తున్నారు. టీటీడీ పరిపాలన వ్యవహారాల్లో 17 శాఖల్లో ఇంజినీరింగ్, విద్య, సాధారణ పరిపాలన, ఆస్పత్రులు, సెక్యూరిటీ, అటవీశాఖ, ఉద్యానవన శాఖలు కీలకమైనవి. వీరందరి సంక్షేమానికి యాత్రికులు, దాతలు అందించే కానుకలు, విరాళాలే ప్రధాన ఆదాయ వనరు.
"యాత్రికులు సేవలు అందించడానికి సిబ్బంది కొతర ఉంది" అనే మాటను ఈవో శ్యామలరావు ప్రస్తావించారు. ఉద్యోగ విరమణతో ఖాళీ పోస్టల భర్తీ ప్రక్రియ సాగడం లేదు.
శ్రీవారి నిజపాద దర్శనం రోజు టీడీలో పనిచేసే దిగువ స్ధాయి ఉద్యోగులు సైతం అత్యంత జాగ్రత్తగా మసలుకుంటారు. ఆ రోజు స్వామివారికి మూలవిరాట్టుకు తలరుమాలు, నుదిటిన తిరునామాలు మాత్రమే ఉంటాయి. అందువల్ల శ్రీవారి ఆగ్రహానికి గురికాకుడదు. అని సెంటిమెంట్ ఉంది. ఇది వాస్తవం అని కూడా చెబుతారు. గత ఐదేళ్లలో ఈ సెంటిమెంట్ కూడా కొందరిపై పనిచేయలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
టీటీడీ ఆదాయానికి గండి
ఇంజినీరింగ్ విభాగంలో పనుల మంజూరు. సేవా టికెట్ల జారీలో పెద్దలకే ప్రాధాన్యం. మఠాల వెనుక చేరిన ముఠాలు. ప్రైవేటు అతిథి గృహాల్లో మకాం వేసిన ప్రైవేటు పీఆర్ఓలకే టికెట్ల మంజూరు. సర్వదర్శనం క్యూలైన్ల వద్ద సెక్యూరిటీ చేతివాటం. దుకాణాల మంజూరు, అద్దె వసూళ్లలో తిరకాసు. నిద్రావస్థలో విజిలెన్స్ విభాగం. అదే స్థితిలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇలా అనేక శాఖల తీరు గడచిన కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా మారింది. అందుకు ప్రధానంగా, కొన్ని శాఖల నిద్రావస్థ, నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో భక్తులు తిరుమల శ్రీవారికి సమర్పించిన రూ. కోట్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వాటిని నిగ్గుతేల్చడానికి బలంగా ఉన్న ఐపీఎస్ స్ధాయి అధికారి సారధ్యంలోని టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని పక్కకు ఉంచిన రాష్ర్ట ప్రభుత్వ విజిలెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. రెండు నెలలపాటు సాగించిన విచారణ అనంతరం ఇంజీనిరింగ్ శాఖలో మత్రమే 51 మందికి షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిని ఇంజినీర్స్ వేల్ఫేర్ అసోసియేషియన్ ప్రతినిధులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ఫోన్లు పనిచేయవు
టీటీడీలో వినియోగించే సెల్ ఫోన్ నంబర్లు అత్యంత రహస్యం. ఒక వేళ తెలిసినా, వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పేరెన్నికగన్న మాజీ ప్రజాప్రతినిధులకు మాత్రమే అధికారుల నంబర్ల నుంచి సమాధానం వస్తుంది. అది కూడా కాల్ చేసిన వారి నంబర్ అధికారుల ఫోన్ లో ఫీడ్ అయ్యి ఉంటేమాత్రమే. టీటీడీలో ఏదైనా సంఘటన జరిగినా, లేదా ఆరోపణలు వచ్చినా సరే. అధికారుల వివరణ తీసుకునేందుకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. కారణం, స్థానిక మీడియా ప్రతినిధులు కాల్ చేసినా, స్వీకరించరు. దీంతో టీటీడీ ప్రతిష్ఠకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ వ్యవహారం టీటీడీలో సర్వసాధారణంగా మారింది. కొత్తగా వచ్చిన ఈఓ శ్యామలరావు ఎలా వ్యవహరిస్తారనేది వేచిచూడాలి.
టీటీడీ ఈవో శ్యామలరావు నిత్యం సమీక్షలతో మునిగిపోతున్నారు. "ఆయన అపాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టం" అనే రీతిలో పరిస్థితి మారింది.
ఏదైనా ఆరోపణ, వివరణ కోసం ప్రయత్నిస్తే, "మేము ఉన్నతాధికారల అనుమతి లేనిదే మాట్టాడేందుకు వీలులేదు" అనే సమాధానం వస్తోంది. పీఆర్ఓ విభాగం జారీ చేసే ప్రకటనలు మాత్రమే ఇక్కడ ప్రామాణికంగా మారింది.
పీఆర్ఓలే దిక్కు..
అధికారులు స్పందించని స్థితిలో టీటీడీలో పీఆర్ఓలే దిక్కు. వారిలో చీఫ్ పీఆర్ఓ తలారి రవి, పీఆర్ఓ నీలిమ టీటీడీ అధికార ప్రతినిధులుగా ప్రకటనలు జారీ చేస్తుంటారు. మినహా బాధ్యతాయుతమైన అధికారులు మాత్రం స్పందించారు. వారికి కూడా పనిభారం కూడా తక్కువేమి కాదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారిసేవ బృందాలను ఎంపిక చేయడం ఒక పెద్ద ప్రక్రియ. అలాగే వారి కార్యక్రమాలు పర్యవేక్షణ, ప్రచురణల విభాగంతో పాటు మీడియాతో సమన్వయం వారి విధుల్లో భాగమైంది. వీటికి తోడు నిత్యం ఈఓ లేదా జేఈఓల సమీక్షలకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా తిరుమలతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలోని అనుబంధ ఆలయాలు, కడప జిల్లా ఒంటిమిట్ట, గండి క్షేత్రం, దేశంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన కవరేజీ బాధ్యతలు కూడా వారివే.
భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించడానికే అధికారులు ఇప్పటివరకు పరిమితమయ్యారు. మినహా, యాత్రికులతో మమేకమైన దాఖలాలు తక్కువ.
ముక్తయింపు: సామాన్య యాత్రికులతో లభిస్తున్న ఆదాయంతో కలాపాలు సాగించే టీటీడీలో వారి కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి.