హరీష్ ఇంటిపైన దాడి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావు ఇంటిపైన దాడి జరిగింది. శనివారం తెల్లవారిజామున కొందరు క్యాంపు కార్యాలయంపై సడెన్ గా దాడిచేశారు.

Update: 2024-08-17 06:30 GMT

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావు ఇంటిపైన దాడి జరిగింది. శనివారం తెల్లవారిజామున గుర్తు తెలియని కొందరు క్యాంపు కార్యాలయంపై సడెన్ గా దాడిచేశారు. ఇంటిముందున్న హోర్డింగులను, తలుపులు, కిటీలను పగులగొట్టారు. విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్న విషయం తెలియగానే దాడిచేసిన వారంతా అక్కడినుండి పరారయ్యారు.

ఇదే విషయాన్ని హరీష్ మాట్లాడుతు తనింటిపైన దాడిచేసింది కాంగ్రెస్ గూండాలంటు మండిపడ్డారు. తనింటిపైన దాడిచేయాల్సిన అవసరం కాంగ్రెస్ గూండాలకు తప్ప ఇంకోరికి లేదన్నారు. తాను ప్రభుత్వ వైఖరిని నిలదీస్తున్నానన్న కారణంతోనే పార్టీ తనింటిపైకి గూండాలను ఉసిగొల్పిందని ఆరోపించారు. రైతు రుణమాఫీపైన హరీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.



 తనింటిపైన జరిగిన దాడితో రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఏ విధంగా ఉన్నాయో జనాలందరికీ తెలుస్తోందని హరీష్ అన్నారు. తనింటిపైన దాడిచేసిన వాళ్ళని పోలీసులు వెంటనే పట్టుకుని కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఎల్ఏగా ఉన్న తనింటిపైకే గూండాలు దాడిచేస్తే ఇక మామూలు జనాల పరిస్ధితి ఏమిటని ప్రభుత్వాన్ని హరీష్ నిలదీశారు. ఇదే విషయాన్ని డీజీపీకి కూడా హరీష్ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు.

రైతు రుణమాఫీ నేపధ్యంలో వైరా బహిరంగసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతు హరీష్ రాజీనామాను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాము చెప్పినట్లే రుణమాఫీ చేశామని, మరి హరీష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు. దాంతో సిద్దిపేటలో రుణమాఫీ అయిపోయే..హరీష్ రాజీనామా ఎప్పుడంటు పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి. ఆ హోర్డింగులను తీసేయటానికి శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దాంతో చిన్నపాటి గొడవైంది. ఆ తర్వాత రెండువర్గాలు వెళ్ళిపోయాయి. అయితే అర్ధరాత్రి పైన సడెన్ గా హరీష్ ఇంటిమీద డాడి జరగటంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా తయారైంది.

Tags:    

Similar News