అరెస్టులతో రోమం కూడా పీక్కోలేరు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక నేతలపై కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు.;

By :  Admin
Update: 2025-02-21 13:30 GMT

విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అతని భార్య పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్నినానిలు శుక్రవారం కలిశారు. వంశీని కలిసేందుకు పంకజశ్రీని లోనికి పంపేందుకు ఒప్పుకున్న పోలీసులు పేర్నినానిని లోనికి అనుమతించేందుకు తొలుత నిరాకరించారు. దీనిపై పోలీసులతో వాగ్వాదం జరిగింది. తర్వాత పేర్ని నానిని కూడా వంశీని కలిసేందుకు జైల్లోకి అనుమతించారు.

అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీని నేలపైనే పడుకోబెడుతున్నారు. ఈ విషయం మీద వంశీతో పాటు భార్య పంకజశ్రీలు జైలు అధికారులను రిక్వెస్ట్‌ చేశారని, జైలు అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. పోలీసు శాఖ, పోలీసు అధికారులు, మరి ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు.
రాజకీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు, మానసికంగా రాజకీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు అధికారులు పని చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ నగరం పటమట పోలీసులు తీరు మరీ దారుణంగా ఉందన్నారు. దారుణంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెతారు. తన చేత తప్పుడు కేసు పెట్టించారని ఈ నెల 10న సత్యవర్థన్‌ జడ్జి ముందు చెప్పుకుంటే మరుసటి రోజు అప్పటికే పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఫణికుమార్‌ అనే టీడీపీ కార్యకర్తతో ఫిర్యాదు తీసుకొని సత్యవర్థన్‌ మీద, వంశీ మీద కేసు నమోదు చేశారని అన్నారు. తర్వాత సత్యవర్థన్‌ సోదరుడు కిరణ్‌తో మరో ఫిర్యాదు ఇప్పంచి ఆ మేకు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఊహా జనితమైన ఫిర్యాదుతో నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌లతో కేసు నమోదు చేశారన్నారు.
కేసులు నమోదవుతున్న తీరు చూస్తోంటే దారుణంగా ఉందన్నారు. వంశీని రిమాండ్‌కు పెట్టేటప్పుడు కూడా తప్పుడు కేసులే పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు తప్పుడు కేసే అని అన్నారు. నమోదైంది ఎస్సీ, ఎస్టీ కేసు అయినప్పుడు రిమాండ్‌ కోసం అదే కోర్టు ముందు హాజరు పరచాలి, కానీ వేరే కోర్టుకు తీసుకెళ్లి హాజరు పరిచారని, ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గానే చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల మేరకు కాకుండా కావాలనే జైల్లో పెట్టే విధంగా పోలీసులు వ్యవహరించారని ధ్వజమెత్తారు.
గుంటూరు మిర్చి యార్డుకు జగన్‌ వెళ్లిన నాడు తాను మచిలీపట్నంలో ఉన్నానని, ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లానని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారో వారిపైనే కూటమి ప్రభుత్వం కేసులు బనాయిస్తుందని పేర్ని నాని ధ్వజమెత్తారు. గుంటూరులో తాను లేక పోయినా ఉన్నట్లు పోలీసులే ఓ చిట్టా రాసి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు చేశారని, అంటే కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణని అన్నారు.
దీనిపై డీజీపీకి మెయిల్‌ చేశానని, పోలీసులు అత్యంత కిరాతంగా వ్యవహరిస్తున్నారని తెలిపానన్నారు. ఈ లేఖను త్వరలో మీడియాకు రిలీజ్‌ చేస్తానన్నారు. ఎన్నికల కోడ్‌పై నమోదు చేసిన కేసు మీద కోర్టులో ఫిర్యాదు చేస్తానన్నారు. మచిలీపట్నంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు సేకరిస్తున్నారని, వారిని బెదిరించేందుకు పోలీసులు ఈ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఫోన్లు రికార్డు చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు పనికి రాని మంత్రి కొల్లు రవీంద్ర అని, మంత్రి లోకేష్‌ వద్ద రాలిన గింజలను ఏరుకునే నాయకుడని ఎద్దేవా చేశారు. వంశీ తర్వాత కొడాలి నాని, పేర్ని నానిల అరెస్టు తప్పవన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. నవంబరు, డిసెంబరు నుంచి తాము రోడ్లపైనే తిరుగుతున్నామని, తన అరెస్టుతో కానీ కొడాలి నాని అరెస్టుతో కానీ తన రోమం కూడా పీక్కోలేరని బదులిచ్చారు.
వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్యం సరిగా లేదన్నారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీని నేలపైనే పడుకోబెడుతున్నారని, దీనిని మార్చాలని కోరామన్నారు. జైలు వద్ద కొడాలి నానికి, తనకు రక్షణ కల్పించలేమని కల్పిత కథలతో తమను లోపలకు వెళ్లనివ్వ లేదని పేర్ని నాని అన్నారు.
Tags:    

Similar News