మహిళా ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం ఏర్పాట్లు
సెప్టెంబరు 18 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.;
తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగే మహిళా ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యే మహిళా ఎమ్మెల్యేలకు తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరులో భారత దేశంలోని మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాలు తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సెప్టెంబరు 14, 15వ తేదీల్లో ఈ ప్రత్యేక సమావేశాలను జరుగుతాయని ఆయన వెల్లడించారు. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ కార్యక్రమాలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ముఖ్య అతి«థులుగా హాజరు అవుతారని తెలిపారు. తొలి రోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరై ఈ సమావేశాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశాల గురించి ఇప్పటికే 175 ఎమ్మెల్యేలకు సమాచారం పంపినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.