Political padmas|వీళ్ళు రాజకీయ ‘పద్మా’లేనా ?

పద్మపురస్కారాల కోసం కేంద్రం ఎంపికచేస్తున్న పేర్లలో కొన్నింటిపై జనాలు పెదవి విరుస్తుండటమే.;

Update: 2025-01-26 03:55 GMT

రోజురోజుకు ‘పద్మ’పురస్కారాలు వివాదాస్పదమైపోతున్నాయి. కారణం ఏమిటంటే పద్మపురస్కారాల కోసం కేంద్రం ఎంపికచేస్తున్న పేర్లలో కొన్నింటిపై జనాలు పెదవి విరుస్తుండటమే. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ అనివార్యతలు, అవసరాలను దృష్టిలో పెట్టుకునే పాలకులు పద్మపురస్కారాలకోసం కొందరిని ఎంపికచేస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినబడుతున్నవే. ఇపుడీవిషయం ఎందుకంటే తాజాగా 34 మందికి కేంద్రప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించింది. దేశంలోనే అత్యున్న పౌర పురస్కారమైన ఏడుమందికి పద్మవిభూషణ్(Padma Vibhushan) ప్రకటించింది. 19 మందికి పద్మభూషణ్(Padma Bhushan) ప్రకటించగా మరో 8 మందికి పద్మశ్రీ(Padma Sri)పురస్కారాలకు ఎంపికచేసింది.

వివిధరాష్ట్రాల్లోని పద్మపురస్కారాల విషయం ఎలాగున్నా తెలుగురాష్ట్రాల్లో పరుస్కారాలు అందుకోబోతున్న వారి విషయంలో జనాల్లో మిక్సుడు రెస్పాన్స్ కనబడుతోంది. వీటిల్లో ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వరరావుకు పద్మవిభూషణ్ ప్రకటించటం. నాగేశ్వరరావు(Dr Nageswar Rao) ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)(AIG) ఏర్పాటుద్వారా చాలాపాపులర్. వైద్యరంగంలో చేస్తున్న సేవకు గుర్తింపుగా పద్మవిభూషణ్ ప్రకటించింది. డాక్టర్ విషయంలో జనాల్లోని రెస్పాన్స్ ఏమిటంటే ఏఐజీ ద్వారా జనాలకు చేస్తున్నసేవ ఏమీలేదని. ఎందుకంటే ఏఐజీ ద్వారా డాక్టర్ చేస్తున్నది ఫక్తు వ్యాపారమే. ఇందులో ఉచితంగా ఎవరికీ సేవలందవు. మధ్యతరగతి జనాలు ఇందులోకి అడుగుపెట్టి ఆసుపత్రి ఖర్చలు భరించటం కష్టమే. పైగా ఏఐజీకి వచ్చే రోగుల స్ధాయిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందనే ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. మామూలు రోగులైతే డాక్టర్ అసిస్టెంట్లే చూస్తారని, వచ్చింది ప్రముఖులు అయితే మాత్రమే స్వయంగా డాక్టర్ చూస్తారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. రోగులస్ధాయిని చూడకుండా, డబ్బులు తీసుకోకుండా లేదా అతితక్కవ ఫీజులు తీసుకుంటు సేవలు చేస్తున్న డాక్టర్లు ఎంతోమందున్నారు. కొందరు గ్రామీణప్రజలకు సేవచేస్తుండగా మరికొందరు గిరిజన ప్రాంతాల్లో సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిని వ్యాపారసంస్ధగా నిర్వహిస్తున్న డాక్టర్ కు పద్మవిభూషణ్ ఇవ్వటంలో ఏవో అనివార్యతలు లేదా అవసరాలు మాత్రమే కనబడుతోందని టాక్ వినబడుతోంది.

అలాగే నందమూరిబాలకృష్ణకు(Nandamuri Balakrishna) పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ఈ పురస్కారానికి బాలకృష్ణకు ఉన్న అర్హత ఏమిటో కేంద్రం వివరించలేదు. కళారంగానికి బాలకృష్ణ చేస్తున్నసేవలు కూడా ఏమిటో అర్ధంకావటంలేదు. సోదరి దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) బీజేపీ ఎంపీ కావటం, బావ కమ్ వియ్యంకుడు చంద్రబాబునాయుడు(Chandrababunaidu) సీఎం కావటమే కాకుండా ఎన్డీయే ప్రభుత్వానికి కీలకంగా మారటమే పద్మభూషణ్ పురస్కారానికి అర్హతగా మారినట్లు అనుమానాలు పెరుగుతోంది.


ఇక, మందకృష్ణమాదిగ(Manda Krishna Madiga)కు ప్రజావ్యవహారాల రంగంలో పద్మశ్రీ పురస్కారం దక్కింది. ప్రజావ్యవహారాల రంగంలో కృష్ణమాదిగకు పురస్కారం దక్కటమే ఆశ్చర్యంగా ఉంది. ఈయన అచ్చంగా షెడ్యూల్డ్ కులాల్లోని మాదిగలకు మద్దతుగా మాత్రమే ఆందోళనలు చేస్తున్నారు. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్)ని ఏర్పాటుచేసి ఆందోళనలు చేస్తున్నారు. 2023, 2024లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి బహిరంగంగా మద్దతుప్రకటించి ప్రచారంచేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కృష్ణమాదిగతో మాలలు విభేదిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సమాజంలోని అన్నీవర్గాల ప్రజల సంక్షేమంకోసం కృష్ణమాదిగా ఆందోళనలు చేస్తుంటే ప్రజావ్యవహారాల రంగంలో సేవచేస్తున్నారని అనుకోవచ్చు. పైగా కృష్ణమాదిగ మీద చాలా ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.

ఇక, కళలరంగంలో చేసిన సేవలకు మాడుగుల నాగఫణిశర్మ(Madugula Naphani Sarma)కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమధ్య నాగఫణిశర్మపై మహిళలకు సంబంధించి చాలా ఆరోపణలు వినబడ్డాయి. అమెరికా, సింగపూర్, మలేషియా పర్యటనల్లో కార్యక్రమాల కోసం పర్యటించినపుడు తాను బసచేసిన ఇళ్ళల్లోని మహిళల విషయంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కొందరుమహిళలు బహిరంగంగానే నాగఫణిశర్మపై లైగింక ఆరోపణలు గుప్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆరోపణల కారణంగా చాలాకాలం నాగఫణి జనాల్లోకి కూడా రాలేదు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి కళారంగంలో సేవచేశారని కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించటమే విచిత్రంగా ఉంది.


పద్మపురస్కారాల కోసం కేంద్రం ఎంపికచేసిన వ్యక్తుల్లో కొందరి నేపధ్యం వివాదాస్పదంగా ఉన్నకారణంగానే మొత్తం పురస్కారాలపైనే జనాల్లో అసంతృప్తి కనబడుతోంది. అందుకనే పద్మపురస్కారాలను ఎప్పుడు ప్రకటించినా అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. కేసులున్న వారిని, వివాదాల్లో నలుగుతున్నవారి పేర్లను ఒకపుడు పురస్కరాల కోసం కేంద్రం పరిశీలన కూడా జరిపేదికాదు. కాని ఇపుడు అలాంటివి పట్టించుకోవటంలేదు.

రేవంత్ అసంతృప్తి

పద్మ పురస్కార గ్రహీతలకు అభినందనలు చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth) ఇదేసమయంలో పద్మ పురస్కారాల ప్రధానంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపించినట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటివెంకన్న, జయధీర్ తిరుమలరావు లాంటి ప్రముఖులకు పద్మశ్రీ ప్రధానంచేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవటం తెలంగాణలోని నాలుగుకోట్లమందిని అవమానించటమే అని మండిపడ్డారు. తన అసంతృప్తిని లేఖద్వారా నరేంద్రమోడీకి వివరించబోతున్నట్లు కూడా రేవంత్ చెప్పారు.

Tags:    

Similar News