రెండు రోజులు బయటకు రావొద్దు.. విపత్తుల సంస్థ హెచ్చరిక

ఆంధ్ర ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజులు బయటకురావొద్దంటూ..

Update: 2024-04-22 12:58 GMT

ఆంధ్రలో వేసవి తీవ్రతరం అవుతుంది. ఇటీవల నాలుగు రోజుల పాటు వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తుంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తుల శాఖ ప్రజలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి వరకు వడగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు నీడపట్టున ఉండాలని, తప్పని పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళొద్దని వారు జాగ్రత్తలు చెప్పారు. అనంతరం వడగాలులు వీచే మండలాల వివరాలను వెల్లడించారు.

రేపు వడగాలులు వీచే మండలాలు

మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 43 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. అదే విధంగా 104 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది విపత్తుల నియంత్రణ సంస్థ.

రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు :

శ్రీకాకుళం 9, విజయనగరం 22, పార్వతీపురంమన్యం 11, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు: శ్రీకాకుళం 11, విజయనగరం 4, పార్వతీపురంమన్యం 4, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 4, అనకాపల్లి 15, కాకినాడ 16, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, ఏలూరు 9, ఎన్టీఆర్ 3, గుంటూరు 1, పల్నాడు 2, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి పరిస్థితి ఇలా

అదే విధంగా ఎల్లుండి కూడా 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, దాంతో పాటుగా 100 మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఈరోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే..

సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43-46 సెంటిగ్రేడ్‌ల మధ్య ఉన్నాయి. వాటిలో నంద్యాల జిల్లా గోస్పాడులో 45.3 సెంటిగ్రేడ్‌లు నమోదు కాగా. వైఎస్‌ఆర్ జిల్లా వెదురూరులో 45.2 సెంటిగ్రేడ్‌లు, అనకాపల్లిలో రావికమతంలో 44.8 సెంటిగ్రేడ్‌లు నమోదుకాగా అత్యల్పంగా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా నింద్రలో 44 సెంటిగ్రేడ్‌లుగా నమోదైంది.

ప్రజలు ఈ జాగ్రతలు పాటించాలి

ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని కూర్మనాథ్ వివరించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళుతున్నా ముఖానికి స్కార్ఫ్, కర్చీఫ్ వంటి ధరించాలని, దాంతో పాటుగా ద్రవ పదార్థాలు ఎక్కువగా సేవిస్తూ ఉండాలని తెలిపారాయన. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లో చల్లని వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Tags:    

Similar News