ఆంధ్రాలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ

Update: 2024-06-04 02:50 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8.30 కి EVM ల కౌంటింగ్ ప్రారంభించారు . కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. అత్యధికంగా విశాఖ పార్లమెంటు బరిలో 33 మంది అభ్యర్థులు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెల్లడవ్వనుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరిగా ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు చేపట్టారు అధికారులు. ఇక అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గరిష్టంగా 27 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో 13 రౌండ్ల‌లో ఫలితం తేలి పోతుంది. కౌంటింగ్ హాల్‌లో ప్రక్రియ అంతా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. మంగళవారం అన్ని జిల్లాల్లో పూర్తిగా డ్రై డే ఉంటుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రంలో 45 వేల మంది పోలీసులు అన్ని చోట్లా ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. కౌంటింగ్ సెంటర్ ల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ దాటి ఎవరికీ లోపలికి అనుమతి లేదు. రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు,విజయోత్సవాలు నిర్వహణకు అనుమతి లేదు.

Tags:    

Similar News