'ట్రాన్స్ ఉమన్' ను మహిళ గా పరిగణించాల్సిందే...

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు;

Update: 2025-06-25 06:36 GMT

సాధారణ వివాహంలో వరకట్న సంబంధిత వేధింపులు హింస ఎదు రైనపుడు ట్రాన్స్‌జెండర్ మహిళ కూడా తన భర్త, అత్తమామలపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498A కింద ఫిర్యాదు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆమె హక్కులను హరించడానికి  వీల్లేదని, హక్కుల, రక్షణ విషయంలో జెండర్ వివక్షకు రాజ్యంగంలో చోటు లేదని జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం పేర్కొంది.

ఒక ట్రాన్స్ జెండర్ మహిళ, సాధారణ మహిళలాగా వివాహం చేసుకుని భర్తతో జీవించినపుడు వరకట్న సంబంధ వేధింపులనుంచి చట్ట ప్రకారం మహిళలకు ఉండే రక్షణే ఉంటుందని కోర్టు పేర్కొంది. 

" హెటిరో సెక్సువల్  సంబంధంలో ఉన్న ఒక ట్రాన్స్ ఉమెన్, తన భర్తపై లేదా తన భర్త బంధువులపై ఫిర్యాదు చేసే హక్కును కోల్పోకూడదు " అని ఆమె తీర్పు పేర్కొంది. తమ మీద ఆమె చేసిన ఫిర్యాదును కొట్టి వేయాలిన భర్త వేసిన పిటిషన్ మీద కోర్టు  విచారణ జరిపింది.

ఐపీసీ సెక్షన్ 498-ఎ, వరకట్న నిషేధ చట్టం, 1961లోని సెక్షన్ 4 కింద తనపై, తన తల్లిదండ్రులపై ట్రాన్స్‌ఉమెన్ అయిన భార్య దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ దాఖలు చేశారు. దాని మీద జస్టిస్ ప్రతాప విచారణ జరిపారు.

తాను ట్రాన్స్ ఉమన్ అని భర్తకు పూర్తిగా తెలుసని, హిందూ ఆచారాల ప్రకారం తనను వివాహం ఆయన వివాహంచేసుకున్నారని చెబుతూ తన కుటుంబం తనకు 1,00,000 రూపాయల కట్నాన్ని, 25 సావరిన్ల బంగారం, 500 గ్రాముల వెండి, 2,00,000 రూపాయల విలువైన గృహోపకరణాలను కూడా తన తల్లితండ్రులు అందించారని అమె పేర్కొన్నారు.

పెళ్లైన కొంత కాలం తర్వాత భర్త తనను వదిలేశాడని, ఆ తర్వాత ఫోన్ నుంచి బెదిరించడమే కాకుండా, అశ్లీల సందేశాలు పంపుతున్నాడని ఆమె ఆరోపించింది. ఈ చర్యలకు తన అత్తమామలే కారణమని ఆమె ఆరోపించింది.

పిటిషనర్ న్యాయవాది తాండవ యోగేష్ తరపున వాదిస్తూ ఐపీసీ సెక్షన్ 498-ఎ కింద ట్రాన్స్‌ ఉమన్  'మహిళ'గా వర్గీకరించలేమని అన్నారు. కుటుంబ రక్షణ చట్టాలు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు విస్తరించవని వాదించడానికి ఆయన (Supriyo @ Supriya Chankraborty & another v. Union of India (2023) కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు.

అయితే కోర్టు (National Legal Services Authority v. Union of India)కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ , లింగ గుర్తింపు అనేది పుట్టుకతో కేటాయించబడిన గుర్తింపునకు భిన్నంగా ఉంటుందని ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు తమ జెండర్ ఏమిటో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని కోర్టు చెప్పింది.

" ఐపీసీ సెక్షన్ 498-ఎ కింద చట్టపరమైన రక్షణ కోసం ట్రాన్స్ ఉమన్  కు 'మహిళ' హోదాను నిరాకరించడం అంటే వివక్షను కొనసాగించడమే. అంతే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 12, 21లను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, అటువంటి వాదనను ప్రారంభంలోనే తిరస్కరించాలి " అని కోర్టు పేర్కొంది.

"To deny a trans woman the status of a 'woman' for the purpose of legal protection under Section 498-A IPC solely on the ground of her reproductive capacity is to perpetuate discrimination and to violate Articles 14, 15, and 21 of the Constitution. Such a contention, therefore, deserves to be rejected at the outset"

వైద్య లేదా శస్త్రచికిత్స జోక్యం అవసరం లేకుండానే తమ జెండర్ ఏమిటో ప్రకటించుకునే హక్కును ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) గుర్తించిందని కోర్టు పేర్కొంది.

హిందూ వివాహ చట్టం కింద 'వధువు' అనే పదంలో ట్రాన్స్‌జెండర్ మహిళలు కూడా ఉన్నారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ప్రస్తావించింది.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు గృహ హింస చట్టం కింద ఉపశమనం పొందవచ్చని కూడా ధర్మాసనం పునరుద్ఘాటించింది.

ప్రస్తుత కేసులో, భార్యను ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తించిన వైద్య ధృవీకరణ పత్రాన్ని కోర్టు అంగీకరించింది .ట్రాన్స్‌జెండర్ వ్యక్తి కి 'స్త్రీ' హోదా ఇవ్వడానికి సంబంధించి భర్త చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది.

రాజ్యాంగం ప్రకారం గౌరవం, గుర్తింపు, సమానత్వం హక్కు వారి జెండర్ గుర్తింపుతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని కోర్టు పునరుద్ఘాటించింది.

" ఈ కేసులో రెండో ప్రతివాది ట్రాన్స్ ఉమెన్ అయినందునా, ఆమె సంతానోత్పత్తి శక్తి లేనందున ఆమెను 'స్త్రీ'గా పరిగణించలేమని పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదన చాలా లోపభూయిష్టమైనది దానిని న్యాయపరంగా అనుమతించలేము. చట్ట వ్యతిరేకమయినది. సంతానోత్పత్తి సామర్థ్యం ఆధారం చేసుకుని మహిళల పట్ట అంత అలాంటి సంకుచిత దృక్పథం తీసుకుంటే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీస్తుంది.రాజ్యాంగం జెండర్ తో నిమిత్తం లేకుండా లేకుండా వ్యక్తులందరికి సమాన గుర్తింపుని సమర్థిస్తుంది, "అని కోర్టు పేర్కొంది. హిందూవివాహ చట్టం ప్రకారం, వధువు అనే పదం టాన్స్ ఉమన కు కూడా వర్తిస్తుంది. అందుల్ల ట్రాన్స్ జండర్ వ్యక్తులు కూడా గృహి హింస చట్టం ప్రకారం న్యాయం కోరవచ్చని కోర్టు పేర్కొంది.

ఫిర్యాదులోని సారాంశాన్ని పరిశీలించిన తరువాత, పిటిషనర్లపై హింస వరకట్నం డిమాండ్లకు సంబంధించిన నిర్దిష్ట ఆరోపణ లేదని చెబుతూ కేసును కోర్టు కొట్టి వేసింది.

Tags:    

Similar News