శక్తి పీఠం మీద ఆన..15ఏళ్లు తక్కువ కాకుండా ఎన్డీఏతో అలయన్స్ ఉండాలి
తొక్కిసలాట దుర్ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ అన్నారు.;
పిఠాపురం పర్యటలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు ఎంత కాలం వరకు ఉండాలనే దానిపైన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు తక్కువ కాకుండా ఎన్డీఏతో అలయన్స్ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..శక్తి పీఠంపై ఆనేసి చెబుతున్నట్లు ప్రకటించారు. నేను పని చేయడానికి వచ్చాను. నేను వళ్లు వంచి పని చేస్తాను. నా పని తీరు నచ్చితే వచ్చే ఎన్నికల్లో కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. నా పని తీరు నచ్చకుంటే వదిలేయండని అన్నారు. అంత నిక్కచ్చిగా ఉంటానన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకు కాబట్టే తగ్గి మాట్లాడతానన్నారు. గురువారం తిరుపతిలో కూడా అలాగే మాట్లాడానన్నారు. తిరుమల తిరుపతి తొక్కిసలాట దురదృష్టకరం. సంక్రాంతి సందర్భంగా ఇలా జరగడం బాధేసింది. ఈ తప్పు అందరి వల్ల జరిగింది. దీనికి అందరు బాధ్యతగా తీసుకోవాలి. దీనికి మంచి మనసు కావాలి. తప్పు జరిగింది కాబట్టి సనాతన ధర్మం పాటించే హిందువలందరినీ క్షమాపణలు కోరానని చెప్పారు.