సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ
రెండు దశల్లో చేపట్టే అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి 4వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు.;
అమరావతిలో అందుబాటులోకి తీసుకొని రానున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుపైన సీఎం చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అతి తక్కువ కాలంలోనే దీనిని నిర్మించి అందుబాటులోకి తేవాలని ప్రత్యేక దృష్టి సారించారు. సిలికాన్ వ్యాలీ మాదిరిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు రాబట్టుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ మీద సమీక్ష నిర్వహించారు. ఐటీ రంగ నిపుణులతో పాటు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
క్వాంటమ్ మిషన్‌కు సంబంధించిన అనేక అంశాల మీద ఐటీ రంగ నిపుణులతో చర్చించారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్న సందర్భంగా దానికి సంబంధించిన ఎకో సిస్టం ఏర్పాటు మీద అధికారులు, ఐటీ రంగ నిపుణుల నుంచి, అధికారుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్వాంటమ్ మిషన్‌ను అమరావతిలో రెండు దశల్లో పూర్తి చేయాలని భావిస్తున్న సందర్భంలో దీనినికి రూ. 4వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. జూన్ నెలాఖరులో 30న విజయవాడలో క్వాంటమ్ మిషన్‌కు సంబంధించి ఒక వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.