వాకింగ్ చేసుకుంటాం అనుమతించండి..వాకర్స్ ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ నగరంలో వాకింగ్ చేసుకునేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. వృద్ధులు నానావస్థలు పడుతున్నారు.;
ఆరోగ్యం కోసం వాకింగ్ చేసుకుంటాం. వాకింగ్ చేసుకునేందుకు నగరంలో ఎక్కడా అవకాశం లేదు. గత 25 ఏళ్లుగా ఇక్కడే వాకింగ్ చేసుకుంటున్నాం. దాదాపు 3వేలకు పైగా రోజు వాకింగ్ చేసుకుంటున్నారు. అలాంటిది వాకింగ్ రావద్దని గేట్లు కోజ్ చేస్తున్నారు. ఇది అన్యాయం. అందరం అరవేళ్లు దాటిన వాళ్లం. ఈ వయసులో ఆరోగ్యం కోసం మాకు నడక చేయడం చాలా అవసరం. కానీ నిర్థాక్షణ్యంగా గేట్లు మూసేసి రావద్దంటున్నారు. ఇది అన్యాయం. అని వాకర్స్ మరో సారి విజయవాడ లయోలా కళాశాల ముందు ఆందోళనలకు దిగారు. గేట్లు ముందు భైటాయించి నిరసనలు తెలిపారు. లయోలా కళాశాల యాజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది వరకు కూడా ఇలానే నిరసనలు చేపట్టారు. కోవిడ్ కాలం నుంచి వాకర్స్‌ను కళాశాల ఆవరణలో వాకింగ్‌కు రాకుండా యాజమన్యాం నిలిపి వేసింది. అప్పటి నుంచి అది అలానే కొనసాగుతోంది.
అయితే తమకు వాకింగ్ చేసుకునేందుకు అనువైన గ్రౌండ్ ఎక్కడా లేదు. దీంతో వాకింగ్ చేసుకునేందుకు నానావస్థలు పడుతున్నాం. గ్రౌండ్‌లోకి వెళ్లేందుకు అనుమతించాలి. అని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించ లేదు. దీంతో ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల వద్దకు తీసుకెళ్లారు. వారు పట్టించుకో లేదు. అయితే వాకర్స్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కళాశాల యాజమాన్యం ఆదివారం వాకింగ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో వాకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే సోమవారం వాకింగ్ వెళ్లిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆదివారం అనుమతించిన యాజమన్యాం సోమవారం గేట్లను క్లోజ్ చేసింది. దీంతో సోమవారం ఉదయం లయోలా కళాశాల ముందు వాకర్స్ మరో సారి ఆందోళనలకు దిగారు.