అక్షయపాత్రకు నూజివీడు ట్రిపుల్ ఐటీ మెస్ నిర్వహణ బాధ్యత
ఆహారం సరిగా ఉండటం లేదని నూజివీడు ట్రిపుల్ ఐటీ విధ్యార్థులు గతంలో ఆందోళనలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెస్ నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో భోజన నాణ్యత సరిగా లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, మంత్రి లోకేష్ తక్షణమే స్పందించి, అక్షయపాత్ర ద్వారా నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాలు అందించాలని నిర్ణయించారు.
అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనాలు అందుతుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యను వేగంగా పరిష్కరించినందుకు మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. అక్షయపాత్ర అందిస్తున్న భోజనాలతో నిజమైన మార్పు కనిపిస్తోందని, ఇది తమ ఆరోగ్యానికి, సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతోందని విద్యార్థులు అభినందనలు తెలిపారు. మంత్రి లోకేష్ తన హామీని నిలబెట్టుకున్నారని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు.