చంద్రబాబు కోసం అధునాతన హెలికాప్టర్
ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని సీఎం చంద్రబాబు దీనివైపు మొగ్గు చూపారు.;
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోసం అదునాతన హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా పాత హెలికాప్టర్‌కు స్వస్తి పలికి కొత్త అధునాత హెలికాప్టర్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటి వరకు ఉపయోగించిన హెలికాప్టర్ పాతది అయిపోయింది. దీని వల్ల ఎయిర్ బస్ హెచ్–160 మోడల్ హెలికాప్టర్‌కు సీఎం చంద్రబాబు మారారు. ఇప్పటి వరకు బెల్ తయారీ చేసిన హెలికాప్టర్‌ను ఉపయోగించే వారు. ఇది పాతది అయిపోయింది. దీని వల్ల ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యం అయ్యేది కాదు. జిల్లాల పర్యటనలకు సీఎం చంద్రబాబు వెళ్లాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడేది కాదు. కేవలం ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు, అక్కడ నుంచి తిరిగి ఉండవల్లి నివాసానికి రావడానికే పాత హెలికాప్టర్‌ను ఉపయోగించే వారు.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో జిల్లా పర్యటనలకు వెళ్లేవారు. మళ్లీ అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సభా వేదిక వద్దకు చేరుకునే వారు. దీని వల్ల సీఎం చంద్రబాబుకు ఉన్న విలువైన సమయం వృధా అయ్యేది. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో పాత హెలికాప్టర్‌ను పక్కన పెట్టి కొత్త దానికి మారారు. ఈ కొత్త ఎయిర్‌బస్ హెచ్–160 మోడల్ హెలికాప్టర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దీనిలో సురక్షితంగా ప్రయాణాలు సాగించొచ్చు. దీనికి తోడు ముఖ్యమంత్రి నివాసం నుంచే నేరుగా జిల్లాల పర్యటనలకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. దీని వల్ల సీఎంకు సమయం కూడా ఆదా అవుతుంది. ఈ కొత్త ఎయిర్‌బస్ హెచ్–160 మోడల్ హెలికాప్టర్‌లో పైలట్లు కాకుండా ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. రక్షణ పరంగాను ఎక్కువ సదుపాయాలు దీనిలో ఉన్నాయి. దీని వల్ల గత రెండు వారాలుగా ఈ అధునాతన హెలికాప్టర్‌లోనే సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలు సాగిస్తున్నారు.