బెజవాడ లాయర్లకు రాజస్థాన్‌లో ప్రమాదం:సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య మృతి

స్టడీ టూర్‌కెళ్లిన న్యాయవాదులకు రాజస్థానలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృత్తి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.

Update: 2024-10-08 03:56 GMT

విజయవాడ న్యాయవాదులకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్‌కు వెళ్లిన న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించారు. మరో 11 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

విజయవాడకు చెందిన న్యాయవాదులు స్టడీ టూర్‌కు వెళ్లారు. విజయవాడ బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు రెండు బస్సుల్లో రాజస్థాన్‌కు స్టడీ టూర్‌కు వెళ్లారు. 10వ తేదీని వీరు తిరిగి విజయవాడకు రావలసి ఉంది. జోద్‌పూర్‌ వద్ద టోల్గేట్‌ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. న్యాయవాదులు ప్రయాణిస్తున్న ఒక బస్సు రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రముఖ సీనియర్‌ న్యాయవాది, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ సతీమణి జ్యోత్స ్న అక్కడిక్కడే మృతి చెందారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న రాజేంద్రప్రసాద్‌తో సహా మరో 11 మంది న్యాయవాదులకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News