'కలంకారీ'కి దక్కిన గౌరవం ప్యారిస్ లో శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం!
సంప్రదాయ కళారూపాలు ప్యారిస్ లో అలరించనున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుడే కాకుండా, అయోధ్య బలరాముడు కూడా విదేశీయులకు కనువిందు చేయనున్నాడు. శ్రీకాళహస్తి కలంకారీకి అరుదైన గౌరవం దక్కింది.
By : SSV Bhaskar Rao
Update: 2024-08-24 09:00 GMT
కలంకారీ కళకు అరుదైన గౌరవం లభించింది. దేశ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే కళల్లో వివిధ ప్రాంతాల నుంచి ఐదుగురు కళాకారులు ఎంపికయ్యారు. వారిలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుడు కూడా ఉన్నారు. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఎజాజ్ అహ్మద్ జో శాలువలు, కర్ణాటక రాష్ట్రం నుంచిశివకుమార పరశురామయ్య శ్రీంగంధం (Sandel Wood)తో తయారు చేసిన బొమ్మ వస్తువులు, రాజస్థాన్లోని జైపూర్ నుంచి గజేంద్రసోని బిత్రీ వర్కు, ఢిల్లీ నుంచి రాజేంద్రప్రసాద్ బొండ్వాల్ లేస్ వర్క్ కళారూపాలు ఎంపికయ్యాయి.
శ్రీకాళహస్తి కలంకారీ కళపై కళాకారుడు పట్టు సాధించాడు. సంప్రదాయ కళలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. పురాణాలు, ఇతిహాసాలను చిత్రీకరించి బొమ్మలకు ప్రాణం పోశాడు. అవార్డులు సాధించిన వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి దేశం మెచ్చిన ఐదుగురిలో ఒకరిగా నిలిచాడు. శ్రీకాళహస్తీశ్వరుడి చరిత్ర, అయోధ్య బాలరాముడు, శ్రీకచక్రంలో అష్టలక్ష్మీదేవతా మూర్తులు, అష్టదిక్పాలకులు, దశావతారాలు, పరివార దేవతలు, నవగ్రహాలు, మహివిష్ణువు, ఈశ్వరుడిని ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈ బొమ్మలతో రూపుదిద్దుకున్న కలంకారీ కళాఖండాలు ప్యారిస్ లో అలరించాయనున్నాయి. ఇవన్నీ ఎందుకంటే..
ప్యారిస్ లో పారా ఒలంపిక్స్ సంబరాలు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు అనేక దేశాల నుంచి కళాకారులు కూడా తమ కళలతో పాటు హస్తకళలను కూడా ప్రదర్శించడానికి పారా ఒలంపిక్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దేశ, విదేశాల కళలు సంస్కృతీ సంప్రదాయాలు పరస్పరం అవగాహన కలిగించుకోవడానికి వీలుగా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా ఒలంపిక్ అసోసియేషియన్ నిర్ణయించింది. ఇందుకోసం
ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు, శిల్పగురు అవార్డు గ్రహీత గురు శ్రీనివాసులుకు భారత ప్రభుత్వం నుంచి ప్యారిస్ ఒలంపిక్ అసోసియేషన్ వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. కలంకారీ చిత్రకళకు ఊపిరి పోస్తున్న వారిలో శ్రీకాళహస్తి కళాకారులు మేటిగా ఉంటారు. అందుకు ప్రధాన కారణం శ్రీకాళహస్తిలోని కలంకారీ అద్దక పరిశ్రమ పేరుప్రఖ్యాతులు సాధించింది. ఇక్కడ కేవలం సహజ, హానికారకాలు లేని రంగులతో చిత్రాలు వేయడంలో సిద్ధహస్తులు. కూరగాయలె, మొక్కల నుంచి తయారు చేసిస రంగులను అద్దకానికి వినియోగించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ రంగులు వాతావరణానికి అనుకూలంగా ఉండడమే కాకుండా, అందమైన బొమ్మలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో వారికి వారే సాటి. కలంకారీ చిత్రకళకు రెండు ప్రధాన కేంద్రాలు ఉంటే, అందులో శ్రీకాళహస్తి మొదటిది. రెండోది మచిలీపట్నం సమీపంలోని పెడనలో తయారయ్యే కలంకారీకి ద్వితీయ స్థానం దక్కింది.
"ఇప్పటివరకు తాను రామాయణం, భాగవతం, పురాణాలతో పాటు ఇతిహాసాలు, సీతారామకల్యాణంతో పాటు దేవతామూర్తులను వస్త్రంపై చిత్రీకరించాను" అని శ్రీనివాసులు చెప్పారు.
"శ్రీచక్రంలో అష్టదిక్పాలకులు, అష్టలక్ష్ములు, దశావతారాలు చిత్రీకరించా" అని ఆయన చెబుతున్నారు. " నా మదిలో మెదిలిన దేవతలకు ఓ రూపం ఇచ్చా" దేవుడిని చేసే భాగ్యం నాకు దక్కడం నా సపూర్వజన్మ సుకృతం అంటున్నారు.
ప్యారిస్ లో కలంకారీ కళారూపాలు ప్రదర్శించే భాగ్యం దక్కించుకున్న వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో శనివారం మాట్లాడారు.
"ప్రాచీనకళకు నిలయం శ్రీకాళహస్తి. ఇక్కడ పుట్టడం నా అదృష్టం. చిన్ననాటి నుంచి చిత్రకళపై నాకు ఇష్టం" అని శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఈ కళ ఎలా నేర్చుకున్నది ఆయన మాటల్లోనే విందాం..
" నా ఐదో ఏటే నా నాయన చనిపోయాడు. మా అమ్మ నన్ను కష్టపడి సాకింది. పదో తరగతి చదువుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలు వేయడం ఇష్టం. మారు (శ్రీకాళహస్తి) అగ్రహారంలో వస్త్రంపై బొమ్మలు వేస్తుండడం ఆసక్తి కలిగించింది. స్వతహాగా నాకు బొమ్మలు వేయడం ఇష్టం. అలా కలంకారీ విద్యను జాతీయ అవార్డు గ్రహీత ఎల్. కృష్ణయ్య వద్ద నేర్చకున్నా. ఆయన సలహాతో డీఆర్డీఏ నిర్వహించిన శిక్షణ ద్వారా 1984లో డిప్లమో చేశాను" అని శ్రీనివాసులురెడ్డి వివరించారు.
"నేర్చుకున్న విద్యలో నా ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకున్నా. ఆ విధంగా చేసిన ప్రయత్నం వల్ల నాకు తమిళనాడు ప్రభుత్వం నుంచి 1994లో అవార్డు లభించింది. 2010లో లేపాక్షి సంస్థ నిర్వహించిన ప్రదర్శనలో టీటీడీ నుంచి కూడా అవార్డు దక్కింది" అని తాను సాధించిన ఫలితాలను తెలిపారు.
"కేంద్ర ప్రభుత్వం కళాకారులకు మూడు అవార్డులు అందిస్తుంది. అందులో నాకు ప్రధానమైనది శిల్పగురు అవార్డుతో సత్కరించడం" మరువలేని జ్నాపకమే కాదు. మరింత పట్టుదల కల్పించింది. అని చచెప్పారు.
నాకంటే ప్రత్యేకత ఉండాలని సంకల్పంతో ప్యారిస్ లో ప్రదర్శంచడానికి వస్త్రంపై శ్రీకాళహస్తి చరిత్రను చిత్రీకరించానని శ్రీనివాసులు రెడ్డి వివరించారు. కలంకారీ కళకు పుట్టినిల్లు లాంటి శ్రీకాళహస్తి చరిత్రను వస్త్రంపై వేసిన బొమ్మలతో విదేశీయులకు కూడా వివరిస్తానని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా..
"విదేశీయులు అయోధ్యకు రాకుండానే బలరాముడిని దర్శించుకోవచ్చన్నారు. ఆంతశక్తి యుక్తి, నాకు దేవుడే వరంగా ప్రసాదించారు" అని ఆయన చెబుతున్నారు. ఆ మేరకు అయోధ్య, బాలరాముడిని వస్ర్తంపై చిత్రీకరించడంలో నా శ్రమ ఫలించింది" అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో అష్టదిక్పాలకులతో పాటు నవగ్రహాలు, పరివార దేవతులు, మహావిష్ణువు, ఈశ్వరుడు, దత్తాత్రేయుడు కూడా దర్శనం ఇస్తారు" అని ఆయన వివరించారు.
జ్యోతిర్లంగాలలో ఒకటైన శ్రీ ('సాలీడు)- కాళ (పాము)- హస్త్రి (ఏనుగు) కలిసి పూజిచండం వల్ల ఈ ఊరికి శ్రీకాళహస్తి అని పేరు. ఇది ఆధ్యాత్మక క్షేత్రమే కాదు. కలంకారీ అద్దకానికి కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఖ్యాతి పొందింది. కలం (పెన్ను) కారీ (కళాకారుడు). పురాణాలు, ఇతిహాసాలు రామాయణ, భాగవతాన్ని వస్త్రంపై ఆవిష్కరించిన ఇక్కడి కళాకారులు మారుతున్న కాలానాకి అనుగుణం గా డిజైన్లలో మార్పులతో ఈ కళకు జీవం పోస్తున్నారు. దశాబ్దాల కిందటి వరకు వేల్లపై లెక్కించే స్థాయిలో ఉన్న ఈ కళాకారుల సంఖ్య రెండు వేల మంది వరకు యూనిట్లు నిర్వహిస్తున్నారు. వారు జీవించడమే కాకుండా, కళకు జీనం పోస్తూ, కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్నశ్రీవేంకటేశ్వర ఇన్సిట్యూట్ ట్రెడిషనల్ స్ల్కప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థలో కూడా కలంకారీ డిప్లమో కోర్సు అందుబాటులో ఉంది.
"సంప్రదాయ కళలు సజీవంగా ఉం చడానికే టీటీడీ కూడా భాగస్వామి అయింది" అని శిల్పగురు శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఈ కళ ద్వారా మేము జీవిస్తూ, ఇంకొందరికి కూడా జీవితం ఇస్తున్నాం" అని చెబుతున్నారు. "వస్త్రంపై ఓ కళాఖండం తీర్చిదిద్దడానికి నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుంది. ఓ కళారూపం సుమారు రూ. 2.50 లక్షల వరకు ఉంటుంది" అని వివరించారు. "ప్యారిస్ లో జరిగే పారా ఒలంపిక్ సంబరాలకు వచ్చే విదేశీ క్రీడాకారులు, ప్రముఖులకు రాష్ట్రంలోని కళలపై మరింత అభిరుచి కల్పించడానికి కృషి చేస్త" అని ఆయన అంటున్నారు.