త్వరలో మంత్రుల పని తీరుపై ప్రోగ్రెస్‌ రిపోర్టు

పాలనలో సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చే సీఎంగా ముద్ర పడిన సీఎం చంద్రబాబు తన మార్కును మరో సారి చూపించారు. అమాత్యుల పని తీరుపై ప్రోగ్రెస్‌ రిపోర్టును ఇవ్వనున్నారు.

Update: 2024-08-28 14:01 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేబినెట్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు జరిగిన మంత్రి వర్గం సమావేశంలో ఈ కేబినెట్‌ను అమలు చేయక పోయినా బుధవారం జరిగిన కేబినెట్‌లో మాత్రం ఈ కేబినెట్‌ విధానాన్ని అమలు చేశారు. పేపర్‌ లెస్‌ కేబినెట్‌కు గతంలోనే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2014–19లో అధికారంలో ఉన్న సమయంలో కూడా ఈ విధానానికి కంకణం కట్టుకున్నారు. తిరిగి బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా ఈ విధానానికి నడుం బిగించారు. అజెండా మొదలుకొని, నోట్స్‌ వరకు అన్నీ పేపర్‌లు, పుస్తకాలు, వంటివి అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించడం దీని ప్రత్యేకత.

కేంద్ర కేబినెట్‌ జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం విశేషం. దీని కోసం ముందుగానే ప్లాన్‌ చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సమయం, సందర్భం అన్నీ కలిసి వస్తాయని ఈ రోజు మంత్రి వర్గం సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
మంత్రుల పనితీరుపైన సీఎం చంద్రబాబు చర్చించారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ పనితీరును మెచ్చుకున్న సీఎం చంద్రబాబు ఈ సారి మాత్రం అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదు. పనితీరుకు సంబంధించిన ప్రగతి నివేదికను రూపొందించి దానిరి మంత్రులందరికీ అందజేస్తామని చెప్పారు. పనితీరుకు సంబంధించిన వంద రోజుల ప్రోగ్రెస్‌ రిపోర్టును మంత్రులందరికీ అందజేయనున్నట్లు చెప్పారు. అయితే జనసేన మంత్రుల పనితీరుకు సంబంధించిన నివేదికను, ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణకు అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. కొందరి మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తనలపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కొందరి వివాదాస్పద వ్యవహార తీరు వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దీని వల్ల ప్రభుత్వం చేస్తున్న మంచి కూడా కొట్టుకొని పోతుందని హెచ్చరించారు. నాయకుల తీరే హైలెట్‌ అవుతుందని, దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని సూచించారు. దీంతో పాటుగా కుటుంబ సభ్యుల జోక్యంపైన సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరకుండా చూసుకోవలసిన బాధ్యత మీపైనే ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
Tags:    

Similar News