తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..

పల్టీలు కొట్టిన కారు. నలుగురు తమిళ యాత్రికులకు గాయాలు

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-24 07:09 GMT

తిరుమల హాట్ రోడ్డు లో పెను ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తమిళనాడు ప్రాంతానికి చెందిన యాత్రికులు కారులో తిరుపతికి బయలుదేరారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో పిట్టగోడను ఢీకొట్టడం వల్ల సినిమా సన్నివేశాన్ని తలపించే రీతిలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగే సమయానికి సమీపంలో ఇతర వాహనాలు లేకపోవడం వల్ల భారీ నష్టం తప్పింది.

తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్లలో వాహనాల ప్రయాణానికి టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్రత్యేక సమయం నిర్దేశించింది. వేగాన్ని నియంత్రంచడం ద్వారా ప్రమాదాల నివారణ కోసం ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, వాహనాలు నడిపే డ్రైవర్లు ఈ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఘాట్ రోడ్డులో ఎక్కడా నిఘా లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది.
ప్రకృతిని ఆస్వాదిస్తూ..
పచ్చదనం పరచుకున్న అటవీ మార్గంలోనే ఘాట్ రోడ్డులో ప్రకృతిని ఆస్వాదిస్తూ సొంత వాహనాల్లో వెళ్లే వారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారనే విషయం మరోసారి స్పష్టమైంది.
తమిళనాడు ప్రాంతానికి చెందిన నలుగురు యాత్రికులు తమ సొంత కారులో తిరుమల నుంచి బయలుదేరారు. మొదటి ఘాట్ రోడ్డులోని రెండవ కిలోమీటర్ దాటిన తర్వాత కారు బ్రేకులు ఫెయిల్ అయినట్టు తెలిసింది. మంచి వేగంతో ఉన్న కారును అదుపు చేయలేని స్థితిలో అదుపుతప్పి, పల్టీ కొట్టింది. కారు తలకిందులుగా పడిన తీరును గమనిస్తే ప్రమాదం తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ కారులో ప్రయాణిస్తున్న వారందరూ అదృష్టవాసాలతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ట్రాఫిక్ జామ్

తిరుమల మొదటి ఘాటు రోడ్డులో తమిళనాడు యాత్రికులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన కారు పక్క నుంచి అనేక వాహనాలు నెమ్మదిగా వెళుతూ కనిపించాయి. ఈ ప్రమాదం జరిగే సమయానికి ముందు వెనక వాహనాలు సమీపంలో లేకపోవడం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తిరుమల, తిరుపతి చెందిన టిటిడి రెస్క్యూ సిబ్బంది స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి పోయిన కారణం కూడా టీటీడీ రిసీవ్ వ్యాన్ తో తిరుపతికి తీసుకువచ్చారు.
Tags:    

Similar News