టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే 7వేల కోట్లు కావాలి
విశాఖ మెట్రో పనులు అక్టోబరులో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.;
ఆంధ్రప్రదేశ్‌లోని టిక్కో ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేయాలంటే రూ. 7వేల కోట్లు కావాలని మంత్రి నారాయణ అన్నారు. అంత నిధులు లేక పోతే టిడ్కో ఇళ్ల నిణ్మాలు పూర్తి చేయలేమని అన్నారు. విశాఖలో మంత్రి నారాయణ బుధవారం మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల ప్రస్తావన చేశారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం అప్పులు చేశారని, అయితే వాటి ద్వారా ఆ ఇళ్లను పూర్తి చేయలేదని, వాటి కోసం తెచ్చిన నిధులను పక్కదారి పట్టించారని మంత్రి నారాయణ వెల్లడించారు.
2014–19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడ్కో ఇళ్ల ప్రతిపాదనలను తెచ్చామని, 7లక్షల ఇళ్లను ప్రతిపాదించామని, కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం రెండు లక్షలను కూడా పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. ఈ సారి మాత్రం టిడ్కో ఇళ్లను పూర్తి చేసి తీరుతామని, వాటి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని నారాయణ స్పష్టం చేశారు. ఈ దసరాకి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు.