ఇప్పటి వరకు 30 క్యాబినెట్‌ సమావేశాలు..300లకుపైగా నిర్ణయాలు

సీఎం చంద్రబాబు నాయకత్వంలో అక్టోబరు 3 శుక్రవారం మరో సారి మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Update: 2025-10-03 06:32 GMT

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుని 16 నెలలకు పైగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. జూన్‌ 4న ఫలితాలు ప్రకటించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం సాధించి, నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్‌ 12, 2024న గన్నవరంకు సమీపంలోని కేసరపల్లెలో ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం తేదీ నుంచి అక్టోబర్‌ 3, 2025 వరకు మంత్రివర్గ సమావేశాలు 30సార్లు జరిగాయి. ఈ సమావేశాలు ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో (ఈ–క్యాబినెట్‌) నిర్వహించారు. పేపర్‌లెస్‌ పద్ధతిలో తీర్మానాలు తీసుకున్నారు. మొదటి సమావేశం జూన్‌ 24, 2024న జరిగింది. పెన్షన్‌ పెంపు, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దు, డీఎస్‌సీ నోటిఫికేషన్‌ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి నుంచి క్యాబినెట్‌ సమావేశాలు వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి జరుగుతూ వస్తున్నాయి.
ముఖ్యమైన మంత్రివర్గ సమావేశాల నిర్ణయాలు:
జూన్ 24 , 2024   న జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో పెన్షన్‌లు ₹3,000 నుంచి ₹4,000కి పెంపు; ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు నిర్ణయాలు తీసుకునా్నరు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  జూలై 2, 2024   న జరిగిన రెండో సమావేశంలో డీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ; రైతులకు మినహాయింపులు పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 23, 2024  న జరిగిన మరో సమావేశంలో  పర్యావరణ సంరక్షణకు 10+ ప్రతిపాదనలు, వ్యవసాయ సబ్సిడీలు పెంచడం, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులుపై నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 6, 2024   న జరిగిన మరో క్యాబినెట్ సమావేశంలో  ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ బిల్; స్పోర్ట్స్ పాలసీ, డ్రోన్ పాలసీ, సెమీకండక్టర్ పార్కులు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.  డిసెంబర్ 3, 2025  న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఐటీ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0; టెక్స్‌టైల్, గార్మెంట్స్ పరిశ్రమల ప్రోత్సాహంపై నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 12, 2025  న జరిగిన ౧౫వ సమావేశంలో   ఆరోగ్య శాఖలో 50,000 పోస్టుల భర్తీ; క్వాంటమ్ టెక్నాలజీ సమ్మిట్ 2025 ఆహ్వానం నిర్ణయం తీసుకున్నారు. జూన్ 4, 2025  న జరిగిన 25 వ సమావేశంలో 17 లైఫ్ కన్విక్టుల విడుదల; స్టాంప్ డ్యూటీ మాఫి; విద్యా సంస్కరణలకు రూ. 5,000 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై 24, 2025  న జరిగిన మరో సమావేశంలో  40+ అజెండా ఐటమ్స్ మీద చర్చించి విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల్లో మౌలిక నిర్ణయాలు, రోడ్లు, విమానాశ్రయాలలో కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 21, 2025  న జరిగిన 28వ  సమావేశంలో  విద్య, ఆరోగ్య, వ్యవసాయ శాఖల్లో 15+ ప్రతిపాదనలు  పై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 4, 2025  న జరిగిన క్యాబినెట్ లో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల ఆరోగ్య పాలసీ, GST సంస్కరణలు,  MSMEలకు రుణాలు వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 19, 2025  న జరిగిన క్యాబినెట్ లో  అసెంబ్లీలో ప్రవేశపెట్టే 13 ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 
ఈ సమావేశాల్లో మొత్తం 30 కాబినెట్‌ సమావేశాల్లో 300కి పైగా తీర్మానాలు తీసుకుని, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల్లో వేగవంతమైన సంస్కరణలు అమలు చేశారు. అత్యధిక సంఖ్యలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పాలన సాగించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శైలి.
వచ్చే మూడున్నర ఏళ్ల ప్రణాళిక: 125 సమావేశాల లక్ష్యం
ప్రభుత్వ ప్రారంభం నుంచి 5 ఏళ్ల పాలనా కాలంలో మొత్తం 125 మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే, సంవత్సరానికి సగటున 25 సమావేశాలు. ఇప్పటివరకు (సెప్టెంబర్‌ 2025 వరకు) 25+ సమావేశాలు జరిగినప్పటికీ, మిగిలిన మూడున్నర ఏళ్లల్లో (అక్టోబర్‌ 2025 నుంచి 2029 ఎన్నికల వరకు) సుమారు 90–100 సమావేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యం ’వేగవంతమైన పాలన, జవాబుదారీతనం’ అనే పద్దతిలో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తూ ముందడుగు వేస్తున్నారు.
Tags:    

Similar News