మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న అమిత్ షా

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్ర పర్యటన వాయిదా వేసుకున్నారు.

Update: 2024-11-17 09:53 GMT

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్ర పర్యటన వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి ఆయన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన రద్దు చేసుకుని దేశ రాజధానికి తిరిగి ఢిల్లీకి బయలుదేరినట్లు సమాచారం. దేశరాజధానికి చేరుకోగానే ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

శనివారం రాత్రి ఇంఫాల్ లోయలోని వివిధ జిల్లాల్లో మరో ముగ్గురు బీజేపీ శాసనసభ్యుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఇందులో సీనియర్ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసం కూడా ఉంది. మంత్రి ఎన్ బీరెన్ సింగ్ నివాసాన్ని కూడా ముట్టడించేందుకు ప్రయత్నించగా వారి ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.

కేంద్ర భద్రతా అధికారుల బృందం త్వరలో మణిపూర్‌లో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తుందని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుందని అధికారులు తెలిపారు.

జిరిబామ్ జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు మహిళలు, పిల్లలను చంపేశారు. దీందో ఆందోళన చెందిన ప్రజలు ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. తర్వాత శనివారం రాత్రి నిరవధిక కర్ఫ్యూను విధించినా తాజాగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారు. నింగ్‌తౌఖోంగ్‌లో పీడబ్ల్యూడీ మంత్రి గోవిందాస్ కొంతౌజం, లాంగ్‌మీడాంగ్ బజార్‌లో హియాంగ్లామ్ బీజేపీ ఎమ్మెల్యే వై రాధేశ్యామ్, తౌబల్ జిల్లాలో వాంగ్‌జింగ్ టెన్థా బీజేపీ ఎమ్మెల్యే పవోనమ్ బ్రోజెన్, తూర్పు జిల్లా ఖుంద్రాక్‌పామ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే థోక్‌చామ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే థోక్‌చోమ ఇళ్లపై దాడికి తెగబడ్డారు.

ఆదివారం ఉదయం ఇంఫాల్ లోయలోని మొత్తం ఐదు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిరిబామ్‌లో మిలిటెంట్లు కిడ్నాప్ చేసి చంపేసిన ఆరుగురి మృతదేహాలను కనుగొన్న తరువాత హింసాత్మక ఘటనల నిరోధానికి కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను స్థంబింపజేశారు.

Tags:    

Similar News