ముక్కులను మండిస్తున్న ఢిల్లీ గాలి

దిగజారిన గాలి పార్లమెంటులో చర్చించాలని లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్..

Update: 2025-11-29 10:09 GMT
Click the Play button to listen to article

ఢిల్లీలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. AQI (Air Quality Index) 332గా నమోదయ్యింది. శుక్రవారం (AQI 369) కంటే ఇది కాస్త మెరుగని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) పేర్కొంది.


గాలి నాణ్యత తెలిపే సూచికలు..

CPCB ప్రకారం.. 0 - 50 మధ్య ఉంటే గాలి నాణ్యత "మెరుగ్గా" ఉందని, 51-100 మధ్య ఉంటే "సంతృప్తికరం", 101-200 మధ్య ఉంటే"మధ్యస్థం", 201-300 మధ్య ఉంటే "పేలవం", 301-400 మధ్య ఉంటే"చాలా పేలవం", 401-500 మధ్య ఉంటే గాలి నాణ్యత పూర్తిగా పడిపోయిందని అర్థం చేసుకోవాలి.

ఇక ఈ రోజు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


‘జాగ్రత్తలు తప్పనిసరి’

గాలి నాణ్యత పడిపోవడంతో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు తరుచుగా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని అంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.


‘కళ్ల మంటలు’

కర్తవ్యపథ్ దగ్గర సైక్లింగ్‌కు వెళ్లిన అతుల్ మాట్లాడుతూ.. ‘‘విసిబిలిటీ చాలా తక్కువగా ఉంది. నేను మాస్క్ లేకుండా బయటకు వచ్చా. కానీ బయటకు వచ్చిన క్షణం నుంచి కళ్ళు మండడం ప్రారంభించాయి. ఇక్కడ నివసించడం చాలా కష్టం," అని పేర్కొన్నారు. కాగా వాతావరణ మార్పులు, గాలి కాలుష్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, మార్పులను అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా శుక్రవారం చెప్పారు.


పార్లమెంటులో చర్చకు డిమాండ్..

గాలి కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు తరుచుగా అనారోగ్యం బారిన పడుతుండడంతో.. రోజురోజుకు ఢిల్లీలో పెరిగిపోతోన్న వాయు కాలుష్యంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు చర్చ జరపాలని లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లల తల్లులు నిన్న ఆయనను తన నివాసంలో కలిశారు. ఎయిర్ పొల్యూషన్‌(Air Pollution)తో పడుతున్న ఇబ్బందులను వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. మోదీ జీ, ఈ సమస్య పరిష్కారానికి మీ వద్ద కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా? ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ ఉందా? అని రాహుల్ గాంధీ ప్రధానిని ప్రశ్నించారు కూడా.  

Tags:    

Similar News