9 మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది.

Update: 2024-09-10 11:20 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. బిజెపి నుంచి ఆప్‌లో చేరిన మాజీ మంత్రి ఛతర్ పాల్ సింగ్‌ను బర్వాలా నుంచి పోటీకి దింపింది.

తాజా జాబితా ప్రకారం.. సధౌరా నుంచి రీటా బమానియా, థానేసర్ నుంచి కిషన్ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్ పోటీ చేయనున్నారు. అలాగే రాటియా నుంచి ముఖ్తియార్ సింగ్ బాజిగర్, అడంపూర్ నుంచి భూపేంద్ర బెనివాల్, బర్వాలా నుంచి ఛతర్ పాల్ సింగ్‌ బరిలో నిలిచారు. బవాల్‌ నుంచి జవహర్‌లాల్‌ , ఫరీదాబాద్‌ నుంచి ప్రవేశ్‌ మెహతా, తిగావ్‌ నుంచి అబాష్‌ చండేలా పోటీ చేయనున్నారు.

సీట్ల పంపకపై కాంగ్రెస్‌తో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్, కాంగ్రెస్ ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల చేసింది.

నామినేషన్ ప్రక్రియ సెప్టెంబరు 12తో ముగుస్తుంది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది.

కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై ఆప్ హర్యానా అధ్యక్షుడు సుశీల్ గుప్తా సోమవారం మాట్లాడుతూ..“నేను మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా మొత్తం 90 సీట్లకు సిద్ధమవుతున్నామని. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12." హర్యానా ఎన్నికల్లో తమ పార్టీ గట్టిగా పోరాడుతోందని మరో ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ 10 సీట్లు డిమాండ్ చేయగా, కాంగ్రెస్ ఐదు మాత్రమే ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేశాయి. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో ఆప్‌కి కాంగ్రెస్‌ ఒక సీటు ఇచ్చినా విజయం సాధించలేదు. 

Tags:    

Similar News