ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 138 విమాన సర్వీసులు రద్దు..

గగనతల పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం..;

Update: 2025-05-09 12:43 GMT
ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు

భారత్-పాకిస్తాన్ (India - Pakistan) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో..శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌(Delhi airport)కు సంబంధించిన మొత్తం 138 విమాన సర్వీసులను రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు బయలు దేరాల్సిన 66 విమానాలు, వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి రావాల్సిన 63, విదేశాలకు బయలుదేరాల్సిన 5 ఇంటర్నెషనల్ సర్వీసు విమానాలు, అలాగే విదేశాల నుంచి రావాల్సిన 4 విమాన సర్వీసులను రద్దు చేశారు.

ఢిల్లీ(Delhi) ఎయిర్‌పోర్ట్‌లో కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నా.. గగనతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) శుక్రవారం ఎక్స్‌లో పేర్కొంది.

గత నెలలో పహల్గామ్‌(Pahalgam)లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట భారత్ ప్రతీకార దాడి మొదలుపెట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో సుమారు 100 మంది ఉగ్రమూకలు చనిపోయారు. 

Tags:    

Similar News