‘పారిస్‌లో ఏసీలు లేకపోవడంతో నన్ను తిట్టింది ఎవరు?’

ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ప్రధాన మంత్రి ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చారు. గురువారం కూడా క్రీడాకారులు హాజరయ్యారు.

Update: 2024-08-16 11:55 GMT

ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ప్రధాన మంత్రి ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చారు. గురువారం కూడా క్రీడాకారులు హాజరయ్యారు.

పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీలో నాల్గవ స్థానంలో నిలిచిన లక్ష్యతో మోదీ ఇలా అన్నారు.. "నేను లక్ష్యాన్ని మొదటిసారి కలిసినప్పుడు, అతను చాలా చిన్నవాడు. కానీ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. సెలబ్రిటీ కూడా అయ్యాడు. ఇందుకు లక్ష్ ఇలా బదులిచ్చాడు.. "అవును సార్. కానీ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ప్రకాష్ సర్ నా ఫోన్ తీసుకుని మ్యాచ్‌లు పూర్తయ్యే వరకు నీ ఫోన్ ఇవ్వను అని చెప్పారు. ఆ తర్వాత నాకు లభించిన సపోర్ట్ ఏంటో తెలిసింది.’’ అని చెప్పాడు.

వెంటనే నవ్వుతూ మోదీ.. "ప్రకాష్ సర్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. కఠినంగా వ్యవహరిస్తారు. నేను వచ్చేసారి ఆయనను పంపుతాను." అన్నారు.

పారిస్ ఒలింపిక్స్‌ను పర్యావరణ అనుకూల క్రీడలుగా ప్రచారం చేశారు. అయితే క్రీడాకారులుండే గదుల్లో ఏసీలు లేవు. క్రీడాకారులు ఒత్తిడి మేరకు వారి కోసం క్రీడా మంత్రిత్వ శాఖ అత్యవసరంగా 40 పోర్టబుల్ ACలను పంపించవలసి వచ్చింది.

"ఏసీలు లేవు. వేడిగా ఉంది. మోదీ పెద్దగా మాట్లాడతారు కాని గదులలో ఏసీలు లేవు. ఏం చేయాలి' అని మీలో ఎవరు మొదట అరిచారో తెలుసుకోవాలను కుంటున్నాను" అని మోదీ సరదాగా అడిగారు. దానికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. "మీరంతా చాలా కష్టాలు పడ్డారు. కానీ కొన్ని గంటల్లోనే మీకు అత్యుత్తమ సౌకర్యాలను ఎలా అందించడానికి ప్రయత్నించామో చూశారుగా." అని పేర్కొన్నారు. "ఓడిపోయి తిరిగి దేశానికి తిరిగొచ్చామన్న భావనను మీ మనసులోంచి తీసేయండి. మీరు దేశం గర్వించేలా చేశారు. ఏదైనా నేర్చుకుని తిరిగి వచ్చారు" అని మోడీ అన్నారు.

‘మీరు 2036 ఒలింపిక్స్‌కు సైనికులు’

"భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఒలింపిక్స్‌లో ఆడిన చాలా మంది అథ్లెట్ల అనుభవాలు చాలా ముఖ్యం. ఒలింపిక్స్ ప్లానింగ్ నుంచి అన్ని సౌకర్యాల వరకు, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నుంచి ఈవెంట్ మేనేజ్‌మెంట్ వరకు మీరు చాలా విషయాలను గమనించి ఉండవచ్చు. మీ అనుభవాలు గేమ్స్‌కు సన్నద్ధం కావడానికి మాకు సహాయపడతాయి. ఒక విధంగా మీరు 2036 ఒలింపిక్స్‌కు సైనికులు." అని మోదీ అన్నారు

Tags:    

Similar News