అపూర్వ విజయం, రోహిత్ సేనకు అభినందల వెల్లువ

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్‌ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.;

Update: 2025-03-10 00:40 GMT
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో 25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ తో తలపడిన భారత జట్టు 2025 సంవత్సరానికి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మార్చి 9న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు సంబరాలు మిన్నంటాయి. మైదానంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జట్టు ఇతర సభ్యలు ఆనందంతో గంతులేశారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తర్వాత దుబాయ్ లోని గ్రౌండ్ అంతా కేరింతలతో హోరెత్తింది. అటు భారత్ లోనూ క్రికెట్ సంబరాలు హోరెత్తాయి. టపాకాయాలు కాల్చారు. మిఠాయిలు పంచారు. వీధుల్లో కుర్రకారు టీమ్ ఇండియా కు జేజేలు పలికారు.
మరోపక్క టీమ్ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు ఎందరెందరో శుభాకాంక్షలు తెలిపారు. టీమ్ ఇండియా కృషిని ప్రశంసించారు.
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy)ని భారత్ కైవసం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్‌ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. టీమ్‌ఇండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ‘‘అసాధారణ మ్యాచ్‌.. అపూర్వ విజయం’’ అంటూ పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్‌ చేశారు. టోర్నమెంటు సాంతం అద్భుతంగా ఆడారంటూ జట్టు సభ్యులను ప్రశంసించారు. మరోవైపు, ‘వన్‌ టీమ్‌.. వన్‌ డ్రీమ్‌.. వన్‌ ఎమోషన్‌’ అని పేర్కొంటూ బీసీసీఐ మ్యాచ్‌ ఫొటోలను షేర్‌ చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మూడు సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్‌ నిలిచింది. టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
అన్నారు. ‘స్మాషింగ్‌ విక్టరీ’ అని పేర్కొన్నారు. భారత జట్టులోని ప్రతి ఒక్కరూ కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారు అని ఆమె ప్రశంసించారు.
చరిత్ర సృష్టించిన విజయమిదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కొనియాడారు. భారత క్రీడాకారుల అద్భుతమైన సామర్థ్యం, మైదానంలో తిరుగులేని ఆధిపత్యం దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు.
టీమ్ఇండియా తన అత్యుత్తమ ప్రదర్శనతో మరోసారి మనల్ని గర్వపడేలా చేసింది. కృషి, అంకితభావంతో అద్భుతమైన విజయం సాధించిన జట్టుకు అభినందనలు అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
మ్యాచ్‌ చివరివరకు పోరాట స్ఫూర్తి కనబర్చే న్యూజిలాండ్‌ జట్టుపై భారత్‌ అద్భుతమైన ఆటతో విజయం సాధించింది. టీమ్‌ఇండియాకు వరుసగా ఐసీసీ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు అభినందనలు అన్నారు ఐసీసీ ఛైర్మన్‌ జైషా.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ గెలవడం ఆనందంగా ఉంది. అద్భుత ఆట తీరుతో మన జట్టు మరోసారి సత్తా చాటిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ను ఓడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి కప్ ను గెలుచుకుంది.
Tags:    

Similar News