ఉమెన్స్ ఛాంపియన్ ఎవరో? నేడే మహిళా ప్రపంచకప్ ఫైనల్

దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్

Update: 2025-11-02 05:24 GMT
ప్రపంచకప్ తో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా

లీగ్ దశలలో వరుస ఓటములు, గెలవాల్సిన మ్యాచ్ లోనూ చేజేతులారా ఓటమి తెచ్చుకున్నారు. చివరికి ఎలాగో అలా సెమీ ఫైనల్ వరకూ వచ్చారు. ఇక్కడ ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఏడు సార్లు వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలిచింది. లీగ్ దశలో ఆ జట్టు చేతిలో ఓటమి, అంతకుముందు స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ లోనూ భారత్ చిత్తుగా ఓడింది. ఏం గెలుస్తారు లే అని అంతా అనుకున్నారు.

ఇందుకు తగ్గట్టే మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 338 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఛేజింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే హంసపాదులా షెఫాలీ వర్మ పెవిలియన్ చేరింది. ఫామ్ లో ఉన్న మరో ఒపెనర్ స్మృతి మంధాన కూడా డగౌట్ కు చేరింది.

ఈ స్థితిలో భారత్ అసమాన పోరాటం చేసింది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులను ఛేజింగ్ చేసి సగర్వంగా ఫైనల్ చేరింది. మరో వైపు దక్షిణాఫ్రికాది అదే కథ. తొలి మ్యాచ్ లో చిత్తు చిత్తుగా ఓడిన ఆ జట్టు తరువాత చిచ్చర పిడుగులా చెలరేగింది.

ప్రతి ప్రత్యర్థిని చావకొట్టి చెవులు మూస్తూ ఫైనల్ చేరింది. ఈ రెండు జట్లు ఈ రోజు నవీముంబాయిల్ జరిగే ఫైనల్ తలపడబోతున్నారు. ఈ ప్రపంచకప్ 13 ఎడిషన్. ఇందులో ఒక క్రికెట్ ప్రపంచం మరో కొత్త విజేతను చూడబోతోంది.

ఆసీస్, ఇంగ్లాండ్ ఆధిపత్యానికి చెల్లు...
మహిళల క్రికెట్ అనగానే మనకు రెండు దేశాలే కనిపిస్తాయి. గత 12 ఎడిషన్ లలో 11 సార్లు ఈ జట్లే విజేతగా నిలిచాయి. కానీ తాజా ఎడిషన్ లో వాళ్ల ఆధిపత్యానికి గండిపడింది. దక్షిణాఫ్రికా, భారత్ ఇంతకుముందు కూడా ఫైనల్ కు చేరుకున్నాయి. కానీ విజేతగా నిలవలేకపోయాయి.
2017 లో ఓటమి..
దశాబ్ధం క్రితం భారత జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది. కానీ చివరి మెట్టుపై బోల్తాపడింది. కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ అసాధారణంగా బ్యాటింగ్ చేసింది. తరువాత 2023 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2022 కామన్ వెల్త్ గేమ్స్ లోనే ఆసీస్ చేతిలో పరాజయం ఎదురైంది.
ఈ ప్రపంచకప్ లోనూ భారత్ వరుసగా మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. అయితే తరువాత కివీస్, ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు చేరింది.
జెమీమా..
సెమీ ఫైనల్ లో వన్ డౌన్ బ్యాట్స్ మెన్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి రెండు వందల పరుగులు జత చేసింది. ఫైనల్ మ్యాచ్ కు అతిథ్యం ఇస్తున్న డీవై పాటిల్ స్టేడియం మరోసారి ప్లాట్ పిచ్ పై పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.
సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ అనేక పొరపాట్లు చేసింది. మన బౌలర్లు క్రాంతి గౌడ్, రేణుకాసింగ్, ఠాకూర్ లు లయ దొరకకగా ఇబ్బంది పడ్డారు. అలాగే కొన్ని క్యాచ్ లను నేలపాలు చేశారు. ఈ టోర్నమెంట్ లలో దీప్తి శర్మ 17 వికెట్లు తీసి ముందు వరుసలో నిలిచారు.
69 పరుగులకే ఆలౌట్..
దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నమెంట్ లో విజయవంతంగా ఆడుతోంది. తొలి మ్యాచ్ లో కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయి అవమానకరరీతిలో ఓడిపోయింది. తరువాత అజేయంగా ఫుంజుకుని ఫైనల్ వరకూ చేరుకుంది.
ఆ జట్టులో మారిజాన్ కాప్ ఆల్ రౌండ్ ప్రతిభతో అదరగొడుతోంది. ఇప్పటి వరకూ ఈ సీమర్ 204 పరుగులు, 12 వికెట్లు పడగొట్టింది. నాడిన్ డి క్లెర్క్ 190 పరుగులు 8 వికెట్లు, టాజ్మిన్ బ్రిట్స్ 212 పరుగులు, క్లోయ్ ట్రయాన్ 167 పరుగులు, 5 వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రదర్శన చేస్తున్నారు.
అందరికంటే ముఖ్యంగా కెప్టెన్ లారా వొల్వార్డ్ 470 పరుగులు సాధించి టోర్నిలోనే టాప్ స్కోరర్ గా నిలిచింది. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో ఆ జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సారి ఎలాగైన గెలుపొందాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది.
భారత్ ఫైనల్ కు ఎలా చేరుకుందంటే..
శ్రీలంక పై డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 59 పరుగుల తేడాతో విజయం
పాకిస్తాన్ పై 88 పరుగుల తేడాతో విజయం
దక్షిణాఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి
ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో ఓటమి
ఇంగ్లాండ్ తో 4 పరుగుల తేడాతో ఓటమి
న్యూజిలాండ్ పై 53 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్ పై మ్యాచ్ రద్దు
సెమీఫైనల్: ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలుపు
దక్షిణాఫ్రికా...
ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి
న్యూజిలాండ్ పై 6 వికెట్ల తేడాతో విజయం
భారత్ పై మూడు వికెట్ల తేడాతో విజయం
బంగ్లాదేశ్ పై 3 వికెట్ల తేడాతో విజయం
శ్రీలంక పై పది వికెట్ల తేడాతో విజయం
పాకిస్తాన్ పై 150 పరుగుల తేడాతో విజయం
ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి
సెమీ ఫైనల్: ఇంగ్లాండ్ పై 125 పరుగుల తేడాతో విజయం
జట్లు అంచనా..
భారత్: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్) రిచా ఘోష్ ( వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్) జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, షఫాలీ వర్మ, అమంజీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ సింగ్ థాక్, రే క్రాంతి గౌడ్, ఎస్. రాధా యాదవ్
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సినాలో జాప్తా(వికెట్ కీపర్), కరాబో మెసో(వికెట్ కీపర్), అన్నేకే బాష్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్ సెన్, మారిజాన్ కాప్, సునే లూయస్, నొండు మిసో షాంగసే, అయాసాబా ట్రైయాన్, మ్లాబా, తుమీ సెఖుకునే
మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది


Tags:    

Similar News