వన్డే జట్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్

ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్, విరాట్, వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, భారత పర్యటనకు భారత జట్టు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ

Update: 2025-10-04 11:57 GMT
శుభ్ మన్ గిల్

గత కొద్ది రోజులుగా వన్ డే ఫార్మాట్ కు కూడా కెప్టెన్ గా గిల్ కే బాధ్యతలు అప్పగిస్తారనే ఊహగానాలు నిజం అయ్యాయి. భారత వన్డే జట్టు కెప్టెన్ గా రోహిత్ స్థానంలో శుభ్ గిల్ ను సెలక్షన్ కమిటీ ప్రకటించింది.

అక్టోబర్ లోనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. శ్రేయస్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. రోహిత్, విరాట్ కోహ్లీ జట్టులో చోటు నిలుపుకున్నారు. 26 ఏళ్ల గిల్ 2019 లో జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ అరంగ్రేటం చేశారు. ఇప్పటి వరకూ 55 వన్డేలు ఆడాడు. అందులో ఎనిమిది సెంచరీలు, 15 అర్థ సెంచరీలు ఉన్నాయి. 59.04 సగటుతో 2,775 పరుగులు సాధించాడు.

రోహిత్ కెప్టెన్సీ రికార్డు..
38 ఏళ్ల రోహిత్ 2021 నుంచి భారత వన్డే కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సంవత్సరం మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫిని గెలుచుకోవడంతో రోహిత్ కెప్టెన్సీ శకం ముగిసింది. అతని నాయకత్వంలో భారత్ 2023 ఆసియా కప్ ను కూడా గెలుచుకుంది. 2023 లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. అలాగ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా రోహిత్ భారత్ 2018 లో ఆసియా కప్ టైటిల్ సాధించి పెట్టాడు.
రోహిత్ 56 వన్డేలకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో 42 గెలవగా, 12 మ్యాచులలో ఓడిపోయాడు. మిగిలిన రెండు మ్యాచ్ లు టైగా ముగిశాయి. ఈ ఏడాది మే నెలలో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి రిటైర్ అయిన తరువాత గిల్ కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు గిల్ రెండు ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం టీ20 లలో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.
బుమ్రాకు విశ్రాంతి..
శనివారం అహ్మదాబాద్ లో సమావేశం సెలక్షన్ కమిటీ 2027 లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం జట్టును నిర్మించాలని చూస్తున్నందున కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
పని భారాన్ని నియంత్రించే వ్యూహంలో భాగంగా బుమ్రాకు ఆసీస్ లో జరిగే వన్డే స్క్వాడ్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. టీ20 సిరీస్ లకు యశస్వీ జైస్వాల్ కు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.
రోహిత్, కోహ్లీ ఇద్దరు టీ20 లు, టెస్ట్ ల నుంచి రిటైర్ అయ్యారు. ఏడు నెలల విరామం తరువాత ఇద్దరు లెజెండ్ లు తిరిగి మైదానంలో కనిపించబోతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆయనుంది. టీ20లు అక్టోబర్ 29 నుంచి ప్రారంభం అవుతాయి.


 


భారత వన్డే జట్టు: శుభ్ మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), యశస్వీ జైస్వాల్
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్


Tags:    

Similar News