రంజీ ట్రోఫి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన కేరళ

ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేయడంతో తొలిసారి ఫైనల్ ఆడే అవకాశం;

By :  122
Update: 2025-02-21 11:33 GMT

కేరళ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే క్షణం ఈ రోజు సిద్దించిందని చెప్పవచ్చు. తన సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి రాష్ట్ర జట్టు రంజీ ట్రోఫి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ ప్రయాణం వారి నైపుణ్యం, దృఢ సంకల్పానికి నిదర్శనం మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రతిభను జట్టుగా మారడంతోనే సాధ్యమైంది.

అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్డేడియంలో జరిగిన సెమీస్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ ను కేరళ డ్రాగా ముగించింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో కేరళకు 2 పరుగుల ఆధిక్యం సాధించింది. దీని ఆధారంగా జట్టు ఫైనల్ చేరింది. ఇది కేరళ క్రికెట్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించిన అద్బుతమైన సీజన్ కు పరాకాష్ట.
అద్బుతమైన ఆటతీరు ప్రదర్శించిన అజారుద్దీన్..
ఆతిథ్య గుజరాత్ తో జరిగే సెమీ ఫైనల్ కోసం ఆటగాళ్లు మైదానంలోకి ప్రవేశించారు. వారికి తెలుసు తమ ప్రత్యర్థి బలమైన వాళ్లు అని, అయినా జట్టుగా కలిసి ఆడారు.
తమలోని అద్భుతమైన నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలని అనుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేరళ, 457 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని స్టార్ బ్యాట్స్ మెన్ మహ్మద్ అజారుద్దీన్ 177 పరుగులతో అజేయంగా నిలిచారు. కేరళ కెప్టెన్ సచిన్ బేబీ 69 పరుగులు చేయగా, కీలక వికెట్లు పడిన తరువాత సల్మాన్ నిజార్ (52) కలిసి కీలక ఇన్సింగ్స్ లు నిర్మించారు.
వీరి ఇన్సింగ్స్ తో కేరళ మంచి స్కోర్ ను బోర్డుపై ఉంచగలిగింది. అజార్ దూకుడుకు, నిజార్ ప్రశాంతత తోడవడంతోనే ఇది సాధ్యమైంది. వారి ప్రయత్నాలు జట్టుకు మంచి ప్రొత్సహాన్ని అందించి గట్టిగా పునాదిగా మారాయి.
నిజార్ టోర్నీ మొత్తం కూడా నిలకడగా రాణించారు. జె అండ్ కేతో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో అతను సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ చాలా కీలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతి స్వల్ప తేడాతో వారు గెలిచారు. కీలకమైన సమయాల్లో అత్యంత కీలకమైన ఇన్సింగ్స్ లు ఆడి, జట్టులో విశ్వసనీయమైన ఆటగాడిగా ఎదిగాడు. అలాగే ఒత్తిడిలో కూడా మంచి నాణ్యమైన ప్రదర్శన చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు.
ఒక పరుగు ఆధిక్యం..
జమ్ముకాశ్మీర్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో కేరళ ఉత్కంఠభరితంగా విజయం సాధించింది. ఇది జట్టుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. జే అండ్ కే జట్టు మొదటి బ్యాటింగ్ చేసి 280 పరుగులు సాధించగా, కేరళ జట్టు 281 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో నిజార్ అజేయంగా 112 పరుగులు సాధించాడు. కేరళకు స్పల్ప ఆధిక్యం దక్కడానికి అతని ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది.
ఆ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ 6 వికెట్ల నష్టానికి కేవలం 180 పరుగులు మాత్రమే చేసి క్లిష్ట పరిస్థితులో చిక్కుకుంది. అయితే నిజార్, అజారుద్దీన్ ఏడో వికెట్ కు 115 పరుగులు భాగస్వామ్యం సాధించి మ్యాచ్ మలుపుతిప్పారు.
రెండో ఇన్సింగ్స్ లో కూడా ఆరు వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచారు. ఇది వారి విజయానికి దోహదపడింది. తద్వారా సెమీ ఫైనల్ లో చోటు సంపాదించారు.
ఐసీసీ నియామవళి మార్పు.. కేరళకు సాయం
కేరళ ఫైనల్ కు చేరడంలో ఐసీసీ కూడా సాయం చేసిందనే చెప్పాలి. ఇటీవల హెల్మెట్ క్యాచ్ లకు సంబంధించి కొన్ని రూల్స్ ను సవరించడం జట్టుకు కలిసొచ్చింది. 

గుజరాత్ తో జరిగిన సెమీఫైనల్ లో చివరి వికెట్ ఊహించని రీతిలో పడింది. అర్జాన్ నాగవాసల్లా వేసిన హర్డ్ పుల్ షాట్ నిజార్ హెల్మ్ ట్ కు తాకి కెప్టెన్ సచిన్ బేబీ చేతికి చేరింది.
2017 నాటి నిబంధనల ప్రకారం.. హెల్మ్ ట్ కు తాకిన బంతి నేరుగా ఫీల్డర్ చేతికి వెళితే అది అవుట్ కిందే పరిగణిస్తారు. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మైదానంలో మరణించిన తరువాత ప్రవేశపెట్టిన భద్రతా చర్యల్లో దీనిని ప్రవేశపెట్టారు. ఇది కేరళకు లాభించింది.
విదర్భ లేదా ముంబైతో తుదిపోరు..
కేరళ ఫైనల్ లో ముంబై లేదా విదర్భతో తలపడే అవకాశం ఉంది. ఇప్పుడు తన తొలి రంజీ ట్రోఫి ఫైనల్ కు చేరిన సందర్భంలో కేరళ జట్టు మైదానంలో అడుగుపెట్టినప్పుడూ క్రికెట్ అభిమానుల ఆశలు, కలలను కూడా తీసుకెళతారు.
రంజీ ట్రోఫి ఫైనల్ కు కేరళ జట్టు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. అయితే సంజూ సామ్సన్ లాంటి కీలక ఆటగాడి సహకారం లేకుండానే ఈ విధంగా జరిగింది. ముంబై లో ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టీ20లో శాంసన్ వేలికి గాయం కావడంతో ఆయన ఈ టోర్నికి దూరమయ్యారు. తరువాత అతని వేలికి శస్త్రచికిత్స జరిగింది.
రంజీ ట్రోఫి ఫైనల్ కు కేరళ సాధించిన చారిత్రాత్మక ప్రయాణం కేవలం క్రికెట్ కథ మాత్రమే కాదు. ఇది పట్టుదల, జట్టు కృషి ఆశయాల స్పూర్తిదాయకమైన కథ. ఇది కేరళ క్రికెట్ లో ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తుంది. 


Tags:    

Similar News