‘‘ఏ జవాన్ అయిన చలిగా ఉందని ఫిర్యాదు చేస్తున్నారా’’: గవాస్కర్

పనిభారం నిర్వహణపై లిటిల్ మాస్టర్ అసంతృప్తి;

Update: 2025-08-05 12:58 GMT
మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన తరువాత సునీల్ గవాస్కర్ జట్టు కూర్పు పై ప్రశ్నలు సంధించాడు. బౌలర్లకు పనిభారం కల్పించే నిర్వహణ ఏంటని అన్నారు.

కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో దేశ సరిహద్దులో కాపలా కాస్తున్న ఆర్మీ జవాన్లను ఆయన ఉదహరించారు. ఎప్పుడైన ఏ సైనికుడైన ఎండగా ఉంది, చలిగా ఉందని ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు.

భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు పనిభారం నిర్వహణ కారణంగా జస్ ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు.
గవాస్కర్ ఏం అన్నాడంటే..
లండన్ లోని ఓవల్ లో జరిగిన అండర్సన్- టెండూల్కర్ ట్రోఫి సిరీస్ 2-2 తో ముగిసింది. బుమ్రా ఆడని రెండు టెస్ట్ లను భారత్ గెలుచుకుంది. అతని గైర్హజరీలో సిరాజ్ సవాల్ ను స్వీకరించి 23 వికెట్లతో సిరస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
సిరాజ్ ఈ పనిభారాన్ని శాశ్వతంగా తొలగించాడని గవాస్కర్ అన్నారు. దేశం కోసం ఆడటం బాధలను మర్చిపోవడానికి సరిపోతుందని అన్నారు. సిరాజ్ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్ట్ లోనూ దాదాపు 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
అయితే తన విమర్శల్లో బుమ్రాను లక్ష్యంగా చేసుకోలేదని గవాస్కర్ వివరణ ఇచ్చారు. టీమ్ మేనేజ్ మెంట్ అనుసరిస్తున్న గాయాల నిర్వహణ గురించే అన్నారు.
‘‘మీరు మీ దేశం తరఫున ఆడుతున్నప్పుడూ, నొప్పులు, బాధలను మరిచిపోండి. సరిహద్దులో జవాన్లు చలి, ఎండ గురించి ఫిర్యాదు చేస్తున్నారా? రిషబ్ పంత్ మీకు ఏం మెసేజ్ ఇచ్చారు? అతను ఫ్రాక్చర్ తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అభిమానులు ఆటగాళ్ల నుంచి ఆశించేది ఇదే. భారత్ తరఫున క్రికెట్ ఆడటం గౌరవం’’ అని గవాస్కర్ ఇండియా టుడేతో అన్నారు.
సిరాజ్ తన గుండెను తాకాడు..
‘‘మీరు 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేము మహ్మద్ సిరాజ్ లో చూశాము. సిరాజ్ తన హృదయాన్ని ఆటతో నింపుకున్నాడని నేను అనుకుంటున్నాను. అతను ఈ పనిభార వ్యాపారాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు’’ అని లిటిల్ మాస్టర్ అన్నారు.
పనిభారం గురించి ఆలోచిస్తే అత్యుత్తమ ఆటగాళ్లు మైదానంలో కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు. భారత క్రికెట్ నిఘంటువు నుంచి పనిభారం అనే పదం తొలగించాలని అన్నారు. ఇది కేవలం మానసికమేగానీ, శారీరక విషయం కాదన్నారు.


Tags:    

Similar News