సేద్యానికి ప్రభుత్వం అంత సాయంచేస్తున్నా ధరలు తగ్గడం లేదెందుకు?

రైతుబంధు, రుణ మాఫీ వల్ల మేలు జరగడం లేదు. రైతుబంధు రుణ మాఫీ వల్ల ధరలు తగ్గాల్సింది పోయి బాగా పెరుగుతున్నాయి. ఇంత చేసినా బియ్యం 70 రూపాలకు కిలో అయింది. ఎందుకు?

Update: 2024-07-05 02:40 GMT

రైతు పథకాలలో సమూల మార్పులు అవసరం. అవి కనీసం మూడు కోణాల్లో ఆలోచించి రూపొందించాలి. స్వయంగా వ్యవసాయం చేసే రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కూలీలు అందరు బాగుండాలి. వారి పిల్లలు బాుండాలి. వారు ఉన్నత చదువులు ఉద్యోగాలు అందుకోవాలి. రైతులు, కౌలుదారులు, వ్యవసాయకూలీలకు ఆధార్ కార్డు ప్రాతిపదికతో ప్రావిడెండ్ ఫండ్ ఖాతా తప్పనిసరి చేయాలి. వారి పిల్లల చదువులకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలి. వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడి బతికేవిధంగా, వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా అధిక దగుబడుల నైపుణ్యాలు ప్రోత్సహించాలి. గిట్టుబాటుధరలకన్నా పదిశాతం ఎక్కువ ఇచ్చి కొనాలి. ఆ సరుకులు అమ్మే షాపులను వ్యవసాయ కూలీ మహిళలకు అప్పగించాలి. ఒక కేంద్ర సంస్థతో చేనేత సహకార సంఘం టిస్కోవలె వ్యసాయ ఉత్పత్తులు సేకరించడం అమ్మడం జరగాలి.

ఆహార ధాన్యాలకే ప్రాధాన్యత, సబ్సిడీలు

ఆహార ధాన్యాలకు ప్రాధాన్యత నీయాలి. నూనె దినుసులు, పప్ప ధాన్యాలు, పంటలు తగ్గి దిగుమతులు పెరిగాయి. అందువల్ల ఆ పంటలకు ప్రత్యేక ప్రోతాహం ఇవ్వాలి. పత్తి, పొగాకు, చెరుకు వంటి పంటలను తగ్గించాలి. వరి పంట స్థానంలో ఇతర ఆహార ధాన్యాలు ప్రోత్సహించాలి. రైతుబంధు, రుణ మాఫీ కోసం కెటాయిస్తున్న బడ్జెట్ ను 50 వేల కోట్ల మూల నిధిగా ఏర్పరచాలి. ఐదెకరాలకన్న తక్కువ వున్నవారికి భూమి కొనుగోలుకు అప్పు ఇవ్వాలి. భూమి లేని వ్యవసాయకూలీలకు తొలి దశలో రెండకరాలు కొనుక్కోవడాని లోన్ ఇవ్వాలి. సన్నకారు రైతులు పండించిన దాంట్లో అమ్మకానికి వచ్చేది తక్కువ. కనక గిట్టుబాటు ధరల వల్ల వారికి కలిగే ప్రయోజనం తక్కువ కనక వారికి విత్తనాలు ఎరువులు సబ్సిడీ పై ఇవ్వాలి. వచ్చిన పైసలు పెళ్లిళ్ల్లు , ఆర్భాటాలకు ఖర్చుచేయకుండా సంస్కృతిక చైతన్యం కలిగించాలి.

ఇప్పటి పద్దతి వల్ల మేలు జరగడం లేదు

ఇప్పటి రైతుబంధు, రుణ మాఫీ వల్ల మేలు జరగడం లేదు. ఇంత చేసినా ధరలు పెరిగాయి. బియ్యం 70 రూపాలకు కిలో అయ్యాయి. రైతుబంధు రుణ మాఫీ వల్ల ధరలు తగ్గాల్సింది పోయి బాగా పెరుగుతున్నాయి. అనగా ఇవి నిజమైన. వ్యవసాయదారులకు అందడం లేదు. నిజమైన వ్యవసాయదారులకు ఈ పెట్టుబడి సాయం రుణ సౌకర్యం , రుణ మాఫీ అందితే ధరలు తప్పక తగ్గేవి. ధరలు అదుపులో వుండాలి. రైతులు బతకాలి. ప్రజలు సంతోషించా ి. ప్రజల సొమ్ము 50 వేల కోట్లదాకా వ్యవసాయం కోసం ఇస్తున్నపుడు అంత ేరకు ప్రజలకు లాభం జరగాలి. ధరలు తగ్గాలి. ఇది జరగడం లేదంటే ఆ సొమ్ము వ్యవసాయంలోకి చేరడం లేదు. అసలైన వ్యవసాయదారులకు బదులుగా వేరెవరో తింటున్నారు. దీన్ని అరికడితేనే ధరలు తగ్గుతాయి. ఎవరికి ఎంత సాయం చేసామో అంత మేరకు వారు పంట మన సంస్థకు అందించాలి. రైసు మిల్లర్ల పై ఆధారపడి సేకరించడం పూర్తిగా మానేయాలి.

ఉచిత బియ్యం పైసలు ప్రావిడెండ్ ఖాతాలో జమ

ఉచిత బియ్యం, రూపాయికి కిలో బియ్యం వగైరా సబ్సిడీలను పునర్ నిర్వచించాలి. సుమారుగా లాభం నష్టం లేని పద్దతిలో ధరలునిర్ణయించాలి. ప్రజలు ధర ఇచ్చి కొనాలి. వారికి రావలసిన సబ్సిడీ పైసలు వారి ప్రవిడెండ్ ఫండ్ ఖాతా జమ చేయాలి. ఆ ఫండ్ పై80 శాతం లోన్ కు అనమతించాలి. అలా వారికిపొదుపు తెలుస్తుంది. బియ్యం పదిరూపాయలకు కిలో అమ్ముకనే వ్యవహారం, వాటిని తరిగి రైసు మిల్లర్లు కొత్తగా స్ప్లయి చేసినట్టు సాగుతున్న గొలుసుకట్టు వ్యవహారం ఆగిపోతుంది. పైసలు పెట్టి కొంటారు కనక బియ్యం క్వాలిటీ వుండాలని నిలదీస్తారు. ఆధార్కార్డు లింకుతో అన్ని పనులు నిర్వహించడం వల్ల ఒక మేలు జరుగుతుంది. ఏదైనా ఉద్యోగం చేసేవారు, ఇన్ కమ్ టాక్సు కట్టే వారు కాకుండా వారినుంచి కౌలుకు తీసుకున్నవారికే సబ్సిడీలు, రుమాఫీ, రైతుబంధు అందుతుంది. అలా అందే విధంగా రూప కల్పన చేయాలి.

ఇపుడున్న పద్దతిలో అవినీతి

ఇపుడున్న పద్దతిలో అవినీతి స్వేచ్చా విహారం చేస్తున్నది. పేద వ్యవసాయదారులకు కౌలుదారులకు బ్యాంకుల్లో రుణం పుట్టదు. పుట్టినా దంచి వసూలు చేస్తారు. రుణ మాఫీ చెయ్యాలె అని ఎదురు చూసేవారే రుణాలు తీసుకోగలుగుతున్నారు. కౌలుదారులకివ్వక పోవడం వల్ల ఆ డబ్బు ఇతర రంగాలకు తరలిపోతున్నది. అందువల్ల ధరలు తగ్గడం లేదు. ప్రస్తుతం రైతుబందు, రుణ మాఫీ కొన్ని ఆధిపత్య కులాలకు వర్గాలకు ప్రజల సొ ్ము తేరగా దోచుకొని తినే వ్యవహారంగా, ఎన్నికల్లో ఓట్ బ్యాంకుకు పెట్టే పెట్టుబడిగా మారిపోయాయని అంటున్నారు.

నిజంగా ఇరు పక్షాలక మేలు జరగాలంటే

పంట తెచ్చిన వారికే గిట్టుబాటు ధర రూపంలో, రుణ మంజూరీ రూపంలో ఇచ్చినపుడే నిజమైన వ్యవసాయదారులకు చేరుతాయి. తద్వారా వారి కుటుంబం పిల్లలు జీవన ప్రమాణాలు పెరగతాి. వీటికి పంటల బీమా రక్షణ అదనంగా ఉన్నపుడు నిజమైన వ్యవసాయం చేసే ప్రజలు హర్శిస్తారు. అలా 50 వేల కోట్లు నిజమైన పంటపండించే వారికి చేరుతాయి. క్రమంగా పొదుపు చేసుకొని ఆ కౌలు భూమిని స్వం చేసుకుంటారు. ఏటా ముప్పవేల కోట్లు భూమి కొనిఇస్తే కౌలు భూములన్నీ వారి సొంతమవుతాయి. ఇల్లు కొంటే 25 ఏళ్లకు వాయిదాలు కట్టే విధంగా లోన్లు ఇస్తున్నారు. ానవుల అత్వసరమైన ఆహార ధాన్యా ఉత్పత్తి కోసం కౌలుదారులు భూమిని సొంతం చేసుకోవడానికి ప్రభుత్యం :, బ్యాంకులు ఎందుకు సహకరించూడదు? డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఇలా భూములు శాంతియుతంగా కౌలుదారులకు, వ్యవసాయకూలీలకు ఎలా బదిలీ చేయవలెనో 1918 లోనే వివరంగా సూచించారు. దానిని ఆచరిస్తే వ్యసాయం మనుషుల ఒత్తిడి తగ్గి వారంతా పారిశ్రామిక రంగంగా ఎదిగి దేశం చైనాను మించి ఎపుడో అభివృద్ది చెంది వుండేది. వ్యవసాయదారులకు ఇంతంత సాయం చేస్తున్నపుడు వివిధ వృత్తులు ఉత్పత్తులతో సేవలతో సమాజాన్ని సుసంపన్నం చేస్తున్న చేతివృత్తుల వారికి కూడా ఇదే దామాషాలో చేయూతనిస్తే ఆకలి చావులు ఆత్మహత్యలు, అప్పుల పాలు కావడం, వలసలు పోవడం అనేవి ఉండవు. వారి పిల్లలకు కూడా ఉన్నత విద్య స్కాలర్ షిప్లు, ఉపాధి ఉద్యోగం పట్ల ప్రణాళికలు ఎందుకు వేయకూడదు. ఓటు హక్కును ఈ రాజకీయ సామాజిక చైతన్యంతో వాల్లకు అంత ఇచ్చారు మాకెంత ఇచ్చారు? ప్రశ్నిస్తే అందరు కొండదిగిరాక తప్పదు.

Tags:    

Similar News