వివాదాలను పరిష్కారకర్తగా చైనా మారడంలో వ్యూహం తైవానేనా?
అమెరికాను చిన్నబుచ్చే ప్రయత్నమేనా?;
By : 553
Update: 2025-06-02 11:42 GMT
చైనా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్య తప్పదని ప్రపంచం భావిస్తున్న నేపథ్యంలో ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, సౌత్ చైనా సముద్రంలో ఇతర దేశాల వాదనలను తోసిపుచ్చడానికి బీజింగ్ కొత్త ఎత్తువేసింది.
అందులో భాగంగానే తనను ప్రపంచానికి నమ్మకమైన మధ్యవర్తిత్వంగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధ్వంసక ఎజెండాను ఆసరాగా చేసుకుని చైనా చాలాకాలంగా ప్రపంచ వ్యవస్థకు నమ్మకమైన ప్రధాన స్తంభంగా తనను తాను చూపించుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. ఇది దాని స్నేహితులు, శత్రువులను కలవరపెడుతోంది.
మే నెల చివరిలో ఇందుకోసం మొదటి అడుగు వేసింది. ప్రపంచంలో రక్తపాత సంఘర్షణ, అలా జరగడానికి వీలు ఉన్న వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వాన్ని ప్రొత్సహించే ప్రపంచ వేదికను చైనా ఆధ్వర్యంలో నిర్మించడానికి పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.
హంకాంగ్ లో ప్రధాన కార్యాలయంతో ఉనికిలోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మీడియేషన్(ఐఓఎంఈడీ), అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించేందుకు అంకితమైన ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్ ప్రభుత్వ అంతర్జాతీయ చట్టపరమైన సంస్థ ఇది.
మే 30న జరిగిన ఐఓఎంఈడీ స్థాపనపై ఒప్పందం పై సంతకం చేసే కార్యక్రమాన్ని వీక్షించడానికి 80 కి పైగా దేశాలు, ఐరాసతో సహ దాదాపు 20 అంతర్జాతీయ సంస్థలు సీనియర్ ప్రతినిధులను హాంకాంగ్ కు పంపాయి.
చైనా మొదటి సంతకం..
ఈ సదస్సుపై 33 దేశాలతో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తొలి సంతకం చేశారు. ఈ పరిణామంతో ఐఓఎంఈడీ వ్యవస్థాపక సభ్యులుగా నిలిచారు. అయితే ఈ సదస్సుకు హాజరైన 80 దేశాలలో47 దేశాలు ఐఓఎంఈడీలో చేరడానికి సైన్ అప్ చేయకపోవడంతో చైనా ఇప్పటికి దాని ప్రపంచ ప్రభావం గురించి ఆశ్చర్యపోవచ్చు.
ఐఓఎంఈడీ ను అంతర్జాతీయ చట్టపాలనలో ఒక వినూత్న అడుగు అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని చైనా మంత్రి వ్యాఖ్యానించారు.
ఇది కొత్త చట్టాలను ముఖ్యంగా భద్రతకు సంబంధించిన చట్టాలను అమలు చేయడం ద్వారా హంకాంగ్ ను చైనా జాతీయ రాజకీయాల్లో విలీనం చేయాలనే ఒత్తిడిని విస్మరించింది. చైనా తన లక్ష్యాలను అనుగుణంగా హాంకాంగ్ ను ఉపయోగించుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
హాంకాంగ్ ను ముందుకు తెస్తున్నారు..
హాంకాంగ్ కు గట్టి మద్దతు ఇచ్చినందుకు చైనా కేంద్రం ప్రభుత్వానికి నగరంపై నమ్మకం, విశ్వాసం ఉంచినందుకు అంతర్జాతీయ సమాజానికి హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కృతజ్ఞతలు తెలిపారు.
‘‘సంస్కృతి, భాష, న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పరస్పర గౌరవం, అవగాహాన ఆధారంగా అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడానికి ఐఓఎంఈడీ దేశాలకు ఒక మార్గాన్ని అందిస్తుంది.’’ అని లీ అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇది చాలా ముఖ్యమైనది’’ అన్నారు.
ఐక్యరాజ్య సమితి చార్టర్ లో నిర్దేశించినట్లుగా అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడుకోవడానికి శాంతియుత మార్గంగా మధ్యవర్తిత్వంపై ఐఓఎంఈడీ ఉమ్మడి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని లీ నొక్కి చెప్పారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ హాంకాంగ్ ప్రయోజనాలను సూపర్ కనెక్టర్, సూపర్ వాల్యూయాడర్ కూడా వివరించారు. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడంలో ఐఓఎంఈడీ మా నగరం చురుకుగా ప్రొత్సహిస్తుందని అన్నారు.
గోడలు కాదు.. వంతెనలు నిర్మించాలి..
భౌగోళిక రాజకీయా అల్లకల్లోలం ఉన్నప్పటికీ, హాంకాంగ్ గోడలు కాదు, వంతనలు నిర్మిస్తుందని లీ అన్నారు.
బలమైన, సమర్థవంతమైన, గౌరవనీయమైన న్యాయవ్యవస్థతో పాటు ప్రపంచ స్థాయి చట్టపరమైన, వివాద పరిష్కార సేవల నిపుణులు హాంకాంగ్ లో ఉన్నారని లీ చెప్పారు.
దీనితో ఆసియా- ఫసిఫిక్ ప్రాంతంలో మధ్యవర్తిత్వానికి అత్యంత ప్రాధాన్యత గల ప్రదేశంగా చైనా హాంకాంగ్ ను ఒక గమ్యస్థానంగా చూపుతోంది. ఈ సమావేశంలో సంతకం చేసిన అనేక అభివృద్ది చెందుతున్న దేశాల మద్దతు భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల మధ్య ప్రపంచ దక్షిణాదిలో బీజింగ్ ప్రభావం పెరుగుతున్నట్లు సూచించింది.
చైనీస్ మార్గం..
దేశాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి చర్చలు, ఏకాభిప్రాయ సాధన ద్వారా విబేధాలను పరిష్కరించడానికి చైనీస్ విజ్ఞానం, జ్ఞానం ఉపయోగిస్తామని వాంగ్ ప్రకటన చేశారు. ఇది రష్యా- ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను చాలా చిన్నవిగా చూపే ప్రయత్నం చైనా చేస్తోంది.
ఇటీవల భారత్- పాకిస్తాన్ మధ్య సైనిక ప్రతిష్టంభన జరిగిన సమయంలో చైనా ద్వైపాక్షిక వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.
అయితే ట్రంప్ మాదిరిగా కాకుండా అది స్పష్టంగా మధ్యవర్తిత్వం వహించలేదు. పాకిస్తాన్ పేరు చెప్పకుండా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండించింది. కానీ భారత సైనిక చర్యకు మాత్రం విచారం వ్యక్తం చేసింది.
చైనా ఇంకా చాలా దూరం ముందుకు సాగాల్సి ఉందని హాంకాంగ్ సమావేశం స్పష్టం చేసింది. అయితే బీజింగ్ తన లక్ష్యాలను సాధించడంలో ఎంత దృఢ నిశ్చయంతో పట్టుదలతో ఉంటుందో ఇది కచ్చితంగా సూచిస్తుంది.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను ప్రచురించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి ఫెడరల్ అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతిబింబిచవు)