గాజా పై, ఇజ్రాయెల్ విధ్వంసానికి కారణం ఏకధ్రువ ప్రపంచమేనా?

ఆధునిక ప్రపంచం వీటి నుంచి ఏం గ్రహించింది

Update: 2025-10-08 12:21 GMT
గాజా

ఆధునిక ప్రపంచం మునపటి కంటే భిన్నంగా లేదని గాజాపై ఇజ్రాయెల్ రెండేళ్లుగా చేస్తున్న దాడులను చూస్తే తెలుస్తోంది. అంతర్జాతీయ క్రమం అనేది క్రమబద్దంగా లేక ప్రపంచం ఇంకా మధ్యయుగాల నాటిలానే మసులుకుంటోంది.

1994 లో రువాండాలో 100 రోజుల పాటు మారణహోమం కొనసాగింది. పాలక హుటు సమాజం తమను వ్యతిరేకిస్తున్న 8 లక్షల మంది టుట్సీలు, మితవాద హుటులను హతం చేసింది.
కానీ అప్పట్లో సమాచార విప్లవం అంతగా అభివృద్ది చెందకపోవడంతో అంతర్యుద్ధం గురించి తమకు తెలియకుండా పోయిందని యూఎన్ లోని ప్రపంచశక్తులు అప్పట్లో ప్రకటించాయి.
లేకుంటే దానిని ఆపేవాళ్లని కూడా చెప్పాయి. అప్పట్లో సాంప్రదాయ మార్గాల ద్వారానే కమ్యూనికేషన్ సాగేది. కానీ యూన్ లోని శక్తులు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తప్పించుకున్నాయి.
ఐదు దేశాల మాఫియా..
రువాండా సంఘటన తరువాత 21వ శతాబ్దంలో గాజాపై దాడిని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. దీనికి ఎటువంటి కారణం లేదు. భద్రతా మండలిలోని ఐదు దేశాల మాఫియా ఐరాసని బంధించింది.
ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడులను ఆపాలని అన్ని దేశాలు తీర్మానం చేసిన అవి అమలు కాలేదు. జనరల్ అసెంబ్లీలోని మిగిలిన 188 దేశాలు చేసిన తీర్మానాలు కూడా చిత్తు కాగితాల్ల మారాయి.
అమెరికా చెందిన రెండు మిత్రదేశాలు, భద్రతా మండలిలో శాశ్వత దేశాలు కూడా. యూకే, ఫ్రాన్స్ అంతా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తూనే ఉన్నాయి. చివరగా తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వారు పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించినట్లు ప్రకటించాయి.
వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్ తో నిర్మోహామాటంగా భాగస్వామిగా ఉంది. రెండేళ్ల కిత్రం గాజాపై దాడి చేసినప్పటి నుంచి అమెరికా ఇజ్రాయెల్ కు 21.7 బిలియన్లను అందించిందని అమెరికా బ్రౌన్ యూనివర్శిటీ కాస్ట్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది. చక్కెర పూత అనే భావన నుంచి వాస్తవం బయటపడింది. ఇక్కడ శక్తివంతులు బలహీనులకు సహాయం చేయాలని ఆశించబడుతోంది.
పాలస్తీనియన్లను, ముఖ్యంగా గాజాలో ఉన్న తమరిని ప్రపంచం మరిచిపోయిందని వారు ఏకధారగా ఏడుస్తున్నారు. ఇజ్రాయెల్ దాడిని ఆపడానికి ఎవరూ పెద్దగా చేయలేదు.
అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడి నిజంగా క్రూరమైనది. ఇజ్రాయెల్ సైనికులతో పాటు పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 1200 మంది మరణించారు. మరో 200 మందికి పైగా యూదులను బందీలుగా పట్టుకెళ్లింది.
ఇజ్రాయెల్ అసమాన ప్రతిస్పందన..
ఈ ఉగ్రవాద దాడిపై ఇజ్రాయెల్ దాడి నిజంగానే బలంగానే జరిగింది. కానీ నాగరిక, ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే దేశంగా దాడికి పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించడం వరకే ప్రతిచర్య ఉండాలి. దాడితో సంబంధం లేని మొత్తం జనాభాను సైనికంగా హింసించకూడదు.
ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడిలో 66 వేల మంది మరణించారు. లక్షలాది మంది గాయపడ్డారు. దాదాపు రెండు మిలియన్ల మంది గాజాలో తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అలాగే పాలస్తీనియన్లకు ఎలాంటి నీరు, ఆహరం అందకుండా దిగ్భంధనం చేసింది. ఇది సహజ మానవ కరువును రేకెత్తించింది.
ఇజ్రాయెల్- పాలస్తీనా సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉంది.బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం, అతని ప్రభుత్వంలోని సంప్రదాయ మితవాదులు ఈ హమాస్ దాడిని గాజాపై బాంబుల వర్షం కురిపించడానికి, 1948 లో సాయుధ యూదు సమూహాలు, కొత్తగా స్థాపించిన తమ రాజ్యం ద్వారా దాదాపు 75 వేల మంది పాలస్తీనియన్లు వారి ఇళ్ల నుంచి తరిమివేసిన నక్భాను(విపత్తు) తిరిగి తేవడానికి ఒక అవకాశంగా భావించారు.
అరబ్ దేశాల..
ఏడు దశాబ్దాల క్రితం.. పాలస్తీనాలోని తోటి అరబ్ దేశాలు అయిన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్ లాంటి దేశాలు యూదుల ఆక్రమణను తిప్పికొట్టడానికి ప్రయత్నించారు.
కానీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడు 2025 లో కనీసం అరబ్బులు ప్రయత్నం కూడా చేయలేదు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మాత్రం చేశారు. ఏ అరబ్ దేశం కూడా ఇజ్రాయెల్ దాడిని ఏదో ఒక విధంగా ఆపడానికి ఎటువంటి చొరవ చూపలేదు. కనీసం దౌత్యపరమైన ఒత్తిడి లేదా సైనిక వ్యూహం ద్వారా కూడా.
లెబనాన్ లోని హిజ్బుల్లా, ఇరాన్ మద్దతు గల హౌతీలు ఇజ్రాయెల్ పైకి క్షిపణలు ప్రయోగించారు. అంతర్జాతీయ జలాలలో ఆ దేశ సరుకు రవాణాను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.
ఇవన్నీ చాలావరకు ప్రతీకారపూరితమైనవే. కానీ ఇజ్రాయెల్ మాత్రం వీటిని తీవ్రాతీతీవ్రంగా దాడులు చేసి అణచివేసింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను దాదాపుగా నాశనం చేసిన టెల్ అవీవ్, హిజ్బుల్లాను సాంతం తుడిచిపెట్టెసింది.
ఐక్యత లేని అరబ్ దేశాలు..
ఇజ్రాయెల్ సొంత దేశంగా ప్రకటించుకుని ఏడు దశాబ్ధాలు గడిచినా, అనేక మంది దీనిని జాతి విధ్వంసంగా అభివర్ణించారు. ఈ దాడి అరబ్బులో ఐక్యత లోపాన్ని బహిర్గతం చేసింది.
అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ముందు, అమెరికా ఒత్తిడి కారణంగా సౌదీ అరేబియా వంటి సున్నీ దేశం కూడా ఇజ్రాయెల్ తో అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. అబ్రహమిక్ ఒప్పందాల ప్రకారం తెర వెనక ప్రయత్నాలు జరిగాయి. సౌదీలు ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ను ఎక్కువ ముప్పుగా చూశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) బహ్రెయిన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ తో అధికారిక సంబంధాలపై సంతకం చేశాయి. దాదాపు మూడు దశాబ్ధాల క్రితం ఇజ్రాయెల్ తో అనధికారిక సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాలలో ఖతార్ ఒకటి. ఇటీవల దోహాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడితో అవమానానికి గురైంది.
వలస రాజ్యాల కాలంలో బ్రిటిష్ వారు యుదులకు స్వతంత్య దేశం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఇది 1940 కాలంలో చెప్పిన మాట. ఆ ప్రాంత అరబ్ నాయకత్వం పాలస్తీనియన్లకు అండగా నిలుస్తామని వారి మాతృభూమిని పునరుద్దరిస్తామని హమీ ఇచ్చింది.
వివిధ దేశాలలోని ప్రముఖ నాయకులు అబ్దుల్ నాసర్, ముయమ్మర్ గడాఫీ, హఫీజ్ అల్ అసద్, అబ్దుల్లా, సద్దాం హుస్సేన్ వంటి వారు పాలస్తీనా నిర్ణయం తీసుకోవడంలో చురుకుగా జోక్యం చేసుకున్నారు. కానీ వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా వారు సమర్థవంతంగా సంఘర్షణను క్లిష్టతరం చేశారు. ఇది ఇజ్రాయెల్ కు వరంలా మారింది.
పాలస్తీనా గురించి ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత నేడు అవే అరబ్ దేశాలు అమెరికాకు సన్నిహిత మిత్రులుగా లేదా ఇజ్రాయెల్ తో సంబంధం నెరిపాయి. పాలస్తీనియన్లను తమను తాము రక్షించుకునే మార్గం మాత్రమే వదిలివేశాయి.
ఏక ధ్రువ, అస్థిర ప్రపంచం..
ఇజ్రాయెల్ బలం 1990ల తరువాత బాగా పెరిగింది. అప్పుడే సోవియట్ యూనియన్- అమెరికా మధ్య కోల్డ్ వార్ ముగిసింది. అప్పుడు అమెరికా కేంద్రంగా ఏకధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది.
అమెరికా శక్తిని ఎవరూ ఆపలేకపోయారు. సోవియట్ యూనియన్ అంతం తరువాత ప్రపంచం చాలా ప్రమాదకరమైన, అస్థిర ప్రదేశంగా మారిందనే అభిప్రాయానికి బలం చేకూర్చుతూ వాషింగ్టన్ జారీ చేసిన రాజకీయ బ్లాంక్ చెక్కును నగదుగా మార్చుకోవడం ద్వారా నెతన్యాహూ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని పట్టించుకోవడం లేదు.
నకిలీ కారణాలతో సద్దాం పాలిస్తున్న ఇరాక్ పై దండెత్తడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మకంగా మారడం, రాజకీయాలు ఎలా నడుస్తాయో నిర్దేశించడం, రెచ్చగొట్టే మాటలతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా అమెరికా ఇప్పుడు దాన్ని ఆపలేకపోతోంది.
సోవియట్ యూనియన్ ఉండి ఉంటే ఇవి సాధ్యమయ్యేవి కాదా అని ఎవరైన ఊహించవచ్చు. కానీ అమెరికా తన ప్రయోజనాలు నిర్ధేశించిన విధంగా చేయడానికి సవాల్ చేస్తే ఊరుకునే విధం కాదు.
1995-1990 వరకు నాలుగు దశాబ్ధాలను పరిశీలిస్తే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో సంఘర్షణలు, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నంత తీవ్రతకు ఏదీ సరిపోలలేదని తెలుస్తుంది.
ఇది బహుశా కోరికే కావచ్చు. కానీ కచ్చితంగా ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదు. (ఉక్రెయిన్ యూఎస్ఎస్ఆర్ లో ఒక భాగం) అమెరికా ఇజ్రాయెల్ గాజాను నాశనం చేయకుండా నిరోధించే అధికారం మాస్కోకి ఉండేది. ఇప్పుడు రష్యా తన స్వంత భద్రత, సార్వభౌమత్వాన్ని పోరాడుతోంది.


Tags:    

Similar News