ట్రంప్ అసమర్థత, పుతిన్ మొండితనం ప్రపంచానికి శాపంగా మారిందా?

పూటకో మాట మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు

Update: 2025-09-27 10:29 GMT
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడి మాటలు, నాటో దేశాల చేష్టలను బట్టి చూస్తే ఈ యుద్ధం ఇంకా విస్తరించే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఈ వారం ప్రారంభంలో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ట్రంప్.. ఉక్రెయిన్ ఈ యుద్ధంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రష్యా ఆక్రమించిన మొత్తం భూభాగాలను కీవ్ స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు.
నాటో నే కారణం..
ఉక్రెయిన్ లో శాంతి పరిరక్షక దళాల పేరుతో అమెరికా నేతృత్వంలోని నాటో సేనలు ఉన్నాయని అంగీకరించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్... నాటో తన దేశ సరిహద్దుకు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో తూర్పు ఐరోపాలోకి విస్తరించడమే యుద్ధానికి కారణమని గుర్తు చేశారు.
ఐరాసలో ప్రసంగించడానికి ఒక రోజు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ గగనతల రక్షణ కోసం పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు యూరప్ లోని మిత్రదేశాలు నిధులు సమకూరుస్తాయని ప్రకటించారు. ట్రంప్ పక్కా ఆయుధ వ్యాపారిలా వ్యవహరిస్తున్నాడు.
‘‘బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు వ్యవస్థలను అమెరికా తయారు చేస్తుందని, నాటో మిత్రదేశాలు దీనికి డబ్బు చెల్లిస్తాయి’’ అన్నారు. తన యూరోపియన్ మిత్రదేశాలను అసహ్యంగా చూడటం, రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న దేశాలకు ఎక్కువ రాయితీ ఇవ్వకపోవడం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది.
‘‘ఒకే రోజు లో యుద్ధాన్ని ముగించేస్తా’’ అని చెప్పిన ట్రంప్, ఉక్రెయిన్ తో ఒక ఒప్పందానికి పుతిన్ ను ఒప్పించలేకపోవడం పట్ల తన నిరాశను వ్యక్తం చేయలేదు.
ప్రారంభ స్నేహపూర్వక వాతావరణం, అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ ను ప్రశంసించిన తరువాత ట్రంప్ మానసిక పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.
ఫిబ్రవరిలో వైట్ హౌజ్ లో జెలెన్ స్కీతో జరిగిన సమావేశంలో ట్రంప్, వాన్స్ ఆయనను మీడియా సమావేశంలో బహిరంగంగా ఆయనను మందలించారు. ఇప్పుడు మాత్రం జెలెన్ స్కీ ధైర్యాన్ని ప్రశంసించాడు. యూరప్ కూడా ధైర్యంగా ఈ యుద్ధాన్ని ఎదుర్కొంటుందని అన్నారు.
ట్రంప్ ఆగ్రహం.. భారత్, చైనా బలి..
ఉక్రెయిన్ యుద్ధం నివారించడానికి రష్యా పై అమెరికా అనేక ఆంక్షలు విధించింది. అయినా దాని ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడం లేదు. దానితో ట్రంప్ అసహానికి గురై భారత్, చైనా ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇతర కారణాలతో పాటు భారత్, చైనాలు రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూ దాని ఆర్థిక వ్యవస్థను నిలకడగా ఉంచుతున్నారని ఆరోపించారు.
భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని చెబుతున్నప్పటికీ, ట్రంప్ ఢిల్లీని కూడా విడిచిపెట్టలేదు. పరస్పర సుంకాలకు తోడు, పెనాల్టీ సుంకాలు విధించారు. భారత్, చైనా దిగుమతులపై వందశాతం పెనాల్టీ సుంకాలు విధించాలని యూరప్ భాగస్వామి దేశాలపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు.
ట్రంప్ అనూహ్యతకు మారుపేరు. అమెరికా అధ్యక్షుడు ఏదైనా చేస్తారని ఆశించవచ్చు. యుద్ధంలో అమెరికా, నాటో దేశాలు ప్రత్యక్ష పాత్రను పోషించడం వరకూ ఏదైనా జరగవచ్చు. ఇదే జరిగితే యుద్ధం యూరప్ లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు.
ఇప్పటికే డెన్మార్క్, పోలాండ్, ఎస్టోనియా లు రష్యా యుద్ధ విమానాల చొరబాటుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్ 10 న, రష్యన్ సైనిక డ్రోన్ ల సమూహం పోలాండ్ మీదుగా గగన విహారం చేశాయి. వీటిలో కొన్నింటిని కూల్చివేసినట్లు తెలిసింది.
యూరప్ కు విస్తరించవచ్చా?
డెన్మార్క్ కూడా ఇవే ఫిర్యాదు చేసింది. రష్యా తన సైనిక విమానాలను తన గగనతలంపైకి పంపిందని ఎస్టోనియా ఆరోపించింది. రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. కానీ కొంతమంది సైనిక విశ్లేషకుల ప్రకారం.. నాటో ఈ చొరబాట్లను ఎలా చూస్తుందో చూడటానికి మాస్కో చేసిన టెస్ట్ అని చెబుతున్నారు.
యుద్ధం యూరప్ కు విస్తరిస్తే మాకు వ్యతిరేకంగా అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పటికే యుద్ధం రేఖలో తాను ఏ వైపు ఉంటుందో త్వరగా ప్రకటిస్తుందని భావిస్తున్నారు.
ఆదర్శవంతంగా న్యూఢిల్లీ ఎక్కువగా తటస్థతను అనుసరిస్తుంది. కానీ ఇప్పటి వరకూ అలా చేస్తున్న భారత్, ప్రస్తుత భౌగోళిక రాజకీయ సమతుల్యత పరిస్థితుల దృష్ట్యా మోదీ ప్రభుత్వం ఒక క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది.
రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు యుద్ధ చర్యగా భావిస్తున్నాయి. భారత్ ముడి చమురును కొనుగోలు ఆపివేస్తే రష్యా దానిని శత్రుచర్యగా, దీర్ఘకాల స్నేహానికి ద్రోహంగా భావిస్తుంది. ఇది మోదీ ప్రభుత్వానికి ముందు నెయ్యి- వెనక గొయ్యి లాంటి పరిస్థితి.
ఉక్రెయిన్ లో నాటో ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే.. చైనా కూడా బరిలోకి దిగవచ్చు. ఇప్పటి వరకూ బీజింగ్ రష్యాకు లాజిస్టిక్ మద్దతును అందిస్తోంది. అమెరికా సైనికులు కీవ్ లో అడుగుపెడితే చైనా చేస్తున్న సాయం మరింత ముందుకు సాగుతుంది.
యుద్ధం విస్తరిస్తే.. చైనా కూడా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. రష్యాకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం వల్ల 21 శతాబ్ధంలో మొట్టమొదటిసారిగా భయంకరమైన పరిణామాలతో కూడిన పెద్ద ప్రపంచ యుద్ధం జరుగుతుంది.
ఇది మొదటి, రెండో ప్రపంచ యుద్ధం కంటే.. నేటీ యుద్ధం భయంకరంగా జరుగుతుంది. కారణం.. ఇక్కడ సాంకేతిక పరిజ్ఙానాలు ఉపయోగించడమే. ప్రపంచం ఇప్పుడు దీర్ఘ శ్రేణి ఖండాతర క్షిపణులు, శక్తివంతమైన డ్రోన్లు, సైబర్ వార్ ఫేర్ లను శక్తివంతంగా ఉపయోగించుకుంటున్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని అయినా ఎటువంటి పరిణామాలు లేకుండా తమ ఇష్టానుసారం దాడి చేయగలవని చూపించాయి. తాజా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్, లెబనాన్, యెమెన్, ఖతార్ పై దాడి చేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాక్ పై దాడి చేసింది. ఏదైనా లక్ష్యం పై దృష్టి సారించి దాడి చేయగలవని నిరూపించుకున్నాయి. దీని అర్థం ఏంటంటే పౌరులు సహ ఎవరూ సురక్షితంగా లేరు.
సాధారణంగా పోరాట యుద్ధభూమికి దూరంగా ఉండే ఏ దేశంలోనైనా అంతర్గత ప్రాంతాలు ఇతర ప్రాంతాల మాదిరిగానే దుర్భలంగా ఉంటాయి. క్షిపణులు, డ్రోన్లకు వ్యతిరేకంగా రక్షణ ఉన్నప్పటికీ ఇటీవల అనుభవాలు వాటి సామర్థ్యం పరిమితం అని చూపించాయి. కొన్ని క్షిపణులు, డ్రోన్లు వాటి లక్ష్యాలను అవే నిర్ధేశించుకున్నాయి.
జూన్ 1న ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పెడర్స్ వెబ్’’ అని కోడ్ నేమ్ తో డ్రోన్ దాడిని రష్యాపై విజయవంతంగా చేయగలిగింది. ఇందులో కనీసం 41 ఫ్రంట్ లైన్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ లు( 12 వ్యూహాత్మక బాంబర్లు) దెబ్బతిన్నాయి. వాటిలో కొన్ని ఉక్రెయిన్ నుంచి 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాలోని రహస్య సైనిక స్థావరంలో ఉన్నాయి.
చర్చలలో ఏమి లేదు..
ఉక్రెయిన్- రష్యా యుద్ధం విస్తరిస్తున్న పరిణామాలు ప్రపంచం లేకుండా చేయగల ప్రమాదం ఉంది. కానీ గత 42 నెలలుగా జరిగిన యుద్ధం క్షేత్రం పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. యుద్ధం ప్రారంభంలో ఉన్న స్థితి తనకు కావాలని జెలెన్ స్కీ కోరుకుంటున్నారు.
అయితే భవిష్యత్ లో నాటో ముప్పు లేకుండా ఉండాలంటే.. డోనెట్స్క్, లూహాన్స్క్, ఖేర్సన్, జాపోరిజియా ప్రాంతాలు రష్యాకు బఫర్ జోన్ లుగా ఉండాలని పుతిన్ చెబుతున్నారు. ఇవి ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతానికి సమానం.
ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వబోమని ట్రంప్ ఇప్పటికే రష్యాకు హమీ ఇచ్చారు. ఇది పుతిన్ కీలక డిమాండ్. వాస్తవానికి ఇదే యుద్ధానికి కారణం. కానీ ఇది పోరాటాన్ని ఆపలేకపోయింది.
చర్చలకు జెలెన్స్ స్కీ, పుతిన్ ఇద్దరు తమ సంసిద్దతను వ్యక్తం చేశారు. కానీ చర్చలలో ఎటువంటి పురోగతి లేదు. జెలెన్ స్కీ, పుతిన్, ట్రంప్ మధ్య శిఖరాగ్ర సమావేశం ఇప్పటి వరకూ జరగలేదు.
ప్రపంచానికి రష్యా- ఉక్రెయిన్ చల్లగా చెమటలు పట్టిస్తున్నారు. ప్రధాన పాత్రదారులు మాటలతో కాలక్షేపం చేస్తూ నిందలు వేసుకుంటున్నారు. వారి సైనిక ఎత్తుగడలను కొనసాగిస్తున్నారు. పోటీ పక్షాలతో ఒకరు కూడా తప్పు చర్య తీసుకుంటే..ఇది ప్రపంచాన్ని మొత్తం కాల్చివేయచ్చు.



Tags:    

Similar News