భాగవత్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మోదీని ఉద్దేశించినవేనా?

ఈ ఏడాది సెప్టెంబర్ 17 తో మోదీకి 75 ఏళ్లు, బీజేపీ నిబంధనలు చెబుతున్న స్వయం సేవక్ సంఘ్;

Update: 2025-07-12 07:40 GMT
ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్- ప్రధాని నరేంద్ర మోదీ

మోదీకి భారత ప్రజలపై ఆధిపత్యం ఉంది, అయితే ఆయన పదవిలో ఉండటంపై ఆర్ఎస్ఎస్ కు అసౌకర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది సెప్టెంబర్ 17 తో మోదీకి 75 సంవత్సరాలు నిండుతాయి. కానీ మోదీ.. పీఎంఓ, బీజేపీ రెండింటికి క్రియాత్మక స్వయం ప్రతిపత్తి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఈ మధ్య నాగ్ పూర్ లో మాట్లాడుతూ.. ‘‘మీకు 75 ఏళ్లు నిండినప్పుడూ మీరు ఆగి ఇతరులకు మార్గం చూపాలి’’ అన్నారు. ఇది మోరోపంత్ పింగళే అనే సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చేసిన వ్యాఖ్య.
ఇప్పుడు ఈ వ్యాఖ్య తనను మాత్రమే కాకుండా ఐదు శతాబ్దాలుగా తన సైద్దాంతిక సహ ప్రయాణికుడు అయిన ప్రధానిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసింది.
ఆ వ్యాఖ్య వెనకాల ఏముంది..
ఒకప్పటి సీనియర్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ లో సంఘ్ చాలక్ స్థాయికి ఎదగాల్సిన ఉన్న నాయకుడు అయిన మోరోపంత్ పింగళే పై విడుదల చేసిన ఓ పుస్తకం కార్యక్రమంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కావని ఆయన గట్టిగానే చెప్పారు. కానీ దీని వెనక నిగూఢ అర్థాలు ఉన్నాయి. అందువల్ల భగవత్ చెప్పిన ఉద్దేశం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ‘‘75 ఏళ్లు నిండిన తరువాత మీకు శాలువాతో సత్కరిస్తే, మీరు ఇప్పుడే ఆపాలి. మీరు వృద్ధులు, పక్కకు తప్పుకోండి, ఇతరుకు అవకాశం ఇవ్వండి’’ .
సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్లు నిండిన సందర్భంలో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు పింగళే చెప్పిన సందేశాన్ని అందించడానికి శాలువాలతో మోదీ ముందు వరుసలో ఉంటారా? ఇదే ఇప్పుడు చర్చనీయాశంమైన ప్రశ్న.
ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలలో, బీజేపీలో ఎక్కడా 75 ఏళ్లు నిండిన వ్యక్తి సంస్థాగత, ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయాలని రాతపూర్వకంగా వ్రాసుకోలేదు. భాగవత్ 2009 లో ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, 2014 లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన వ్యతిరేకులందరిని పక్కన పెట్టడానికి, తన విధేయులకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ నిబంధనే ఉపయోగించారు.
2014 లో అద్వానీ, జోషీ..
2014 లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బీజేపీని నిలబెట్టిన ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకోలేదు. దీనికి కారణం వీరికి అప్పటికే 75 ఏళ్లు నిండాయనే.
కానీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ 2016 ఆగష్టులో తనకు 75 ఏళ్లు నిండటానికి మూడు నెలల ముందు పత్రాలు సమర్పించగా, ఆమెను వెంటనే యూపీ గవర్నర్ గా నియమించారు. ఎందుకంటే ఈమో మోదీకి విశ్వసపాత్రురాలు కావడమే గమనార్హం.
కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ రూల్ ను చాలాసార్లు విస్మరించినట్లు మనకు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. 2019 లో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప 78 ఏళ్ల వయస్సు వరకు పదవిలో ఉన్నారు.
ప్రస్తుతం ఈ అలిఖిత నియమం మోదీ రద్దు చేసి కనీసం 2029 వరకూ లేదా వయస్సు ఎంతవరకూ సహకరిస్తే అంతసేపు ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉంది.
బీజేపీలోనే కాదు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మోదీ అని వాదనలు, ప్రచారం ఉంది. ఆయన సంఘ్ పరివార్ సైద్దాంతికక దృక్ఫథం, హిందూత్వ లక్ష్యాలను అనుసరించడం, నేరవేర్చడంలో చాలా విజయవంతం అయ్యారు.
భాగవత్ దిగిపోతారా?
భాగవత్ చేసిన ప్రకటన మోదీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2026 లో దసరా రోజున జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల ముగింపులో అయినా ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి నుంచి భాగవత్ దిగిపోతే ఇది రేస్ అవుతుంది.
ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్ల నిండటానికి కేవలం ఆరు రోజుల ముందు భాగవత్ తన వారసుడిని ప్రకటించి కొత్త బాధ్యతలు స్వీకరించి ఉంటే బాగుండేది. కానీ ఆర్ఎస్ఎస్ పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సంవత్సరం దసరా తరువాత జరుపుకునే అక్టోబర్ 2న ఇది ప్రారంభం కానుంది.
మోదీకి అత్యంత ప్రజాదరణ, ప్రజలపై ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ మోదీపై ఎందుకు కినుక వహించిందో చెప్పడం చాలా సులభం. ఆయన తన కార్యాలయానికి మాత్రమే కాకుండా బీజేపీకి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి క్రియాత్మక స్వయం ప్రతిపత్తి కోసం పట్టుబడుతున్నారు.
2024 లో లోక్ సభ ప్రచారంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ అంశంపై వివాదాస్పద ప్రకటనలు చేశారు. వాటిలో అందరి దృష్టిని ఆకర్షించిన మాట ఏంటంటే ఇక ముందు ‘‘బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదు’’.
అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మోదీ చేస్తున్న పనికి విరుద్దంగా ఏదైనా మాట్లాడానికి ధైర్యం చేసే గొప్ప నాయకుడు జేపీ నడ్డా కాదు. ఈ వాదన మోదీ చేసిన సూచన మేరకే జరిగిందని చెప్పవచ్చు.
2001 అక్టోబర్ లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ మోదీ వ్యక్తిగతీకరించిన, కేంద్రీకృత శైలి పనితీరుపై ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతున్న అభ్యంతరాలను నడ్డా ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.
2014లో మోదీకి ఆర్ఎస్ఎస్ మద్దతు..
అప్పటి నుంచి అనేక సందర్భాలలో మోదీ ఎన్నికల విజయాలు తమ విధానాల వలనే అని ఆర్ఎస్ఎస్ అనేక ప్రయత్నాలు చేసింది కానీ అవి ఫలించలేదు. అభ్యంతరాలు ఉన్నప్పటికీ 2014లో ఇంటా బయట మోదీకి అండగా నిలిచింది ఆర్ఎస్ఎస్ మాత్రమే.
మోదీ మాటలు ఆర్ఎస్ఎస్ ను బాధించినప్పటికీ, అప్పటికే దశాబ్ధంకి పైగా అధికారంలో కోల్పోవడంతో మోదీని భరించడానికి సిద్దమైంది. తరువాత ప్రభుత్వాన్ని నియంత్రించుకోవడానికి భావించింది.
క్లిష్టమైన వ్యాఖ్యలు..
సంఘ్ పరివార్ సైద్దాంతిక లక్ష్యాలను నెరవేర్చడానికి మాత్రమే కాకుండా ఊహించదగిన ప్రతి రంగంలో అధికారిక సంస్థలకు వివిధ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు చెందిన లెక్కలేనన్నీ కార్యకర్తలను నియమించడానికి కూడా తనకు సంఖ్యాబలం ఉందని మోదీ ముందుగానే తెలుసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో పాటు భారత్ హిందూ దేశంగా మెజారిటీ లక్షణాన్ని నిస్సంకోచంగా ప్రదర్శించడానికి ఇది అదనపు కారణం.
మోదీ కూడా చాకచక్యంగా సంస్థ దాని నాయకులపై అనేక సౌకర్యాలను అందేలా ఏర్పాటు చేశారు. పూర్వపు మధ్యతరగతి సంస్థ నుంచి దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఢిల్లీలో నిర్మించిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం దీనికి ప్రత్యేక ఉదాహారణ.
2014 నుంచి పరిణామాలు మారడంతో ఆర్ఎస్ఎస్ సవరించిన బీజేపీకి చోటు కల్పిచిందని రాజకీయ పరిశీలకులలో ఏకాభిప్రాయం ఉంది. చివరకు 2024 లో లోక్ సభ ప్రచారం కోసం బీజేపీ వ్యక్తి కేంద్రీకృత నినాదాల తరువాత ఆర్ఎస్ఎస్ ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉండాలని ఎంచుకుంది.
బీజేపీని మూడోసారి సంపూర్ణ మెజారిటీ సాధించడంలో మోదీ విఫలమవడానికి ప్రధాన కారణం ఈ కారణంగానే తరువాత భగవత్ అనేక పరోక్ష విమర్శలు చేశారు. నెలల తరబడి విడిపోయిన తరువాత 2024 చివరి త్రైమాసికం నుంచి ఒక రకమైన ప్యాచ్ అప్ ఏర్పాట్లు జరిగింది.
దీని తరువాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలలో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ తన గత ఉత్సాహంతో ప్రచారంలో చేరింది. ఇక్కడ కనపడిన ఫలితం మనకు తెలిసిందే.
మోదీ నాగ్ పూర్ ను సందర్శించి, దాని వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్మారక చిహ్నాం ఉన్న ఆర్ఎస్ఎస్ భవనానికి వెళ్లి భగవత్ తో ముఖాముఖి సమావేశం అయ్యారు. తరువాత జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించి కాషాయా సంస్థలు ఒక్కటయ్యాయని స్పష్టమైంది.
బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక..
అయితే ఇప్పటికీ రెండు సంస్థ మార్గాలపై విభేదాలు ఉన్నాయి. తదుపరి బీజేపీ అధ్యక్షుడి విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి నడ్డా వారసుడిని ఎప్పుడూ ప్రకటిస్తుందో ఎవరైనా ఊహించవచ్చు.
మోదీ, ఆర్ఎస్ఎస్ ఇద్దరు ఈ ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చి ఎంపిక చేస్తారా? లేక 2014 లేదా 2019 లో లాగా మోదీ తన ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకుంటారా? తెలియాల్సి ఉంటుంది.
75 ఏళ్ల వయస్సు వచ్చిన వారు పదవులను విడిచిపెట్టి ఉండాలనే భగవత్ చేసిన వ్యాఖ్యలు తదుపరి బీజేపీ చీఫ్ ఎంపికపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం తిరుగులేని అధికారం మోదీ చెలాయిస్తున్నారు. ఇదే జరిగితే 2026 దసరా నాటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాత్రమే పదవీ విరమణ చేసే అవకాశం ఉంది.
రోలర్ కోస్టర్ రైడ్..
దాదాపు 15 నెలలుగా సంఘ్ పరివార్ లో జరుగుతున్న పరిణామాలను ట్రాక్ చేయడం ఒక రోలర్ కోస్టర్ రైడ్ ను అనుసరించడం లాంటిది. రెండు శిబిరాల మధ్య హెచ్చు తగ్గులు నిరంతరం మారుతూ ఉంటాయి. భగవత్ ప్రకటన నుంచి ఊహించే ఏకైక నిశ్చయత ఏమిటో ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు తన పదవిని వదలిపెట్టడం వలన, తరువాత మోదీని అనుసరించమని ఇది ఒత్తిడి చేస్తుంది. కానీ రాజకీయాలు అన్ని అంతా ఊహించని వాటి గురించే.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలకు ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)


Tags:    

Similar News