ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను జస్టిస్ బేలా ఎందుకు వ్యతిరేకించారు?
షెడ్యూల్ కులాల జాబితాలో సంస్కరణల పేరిట రిజర్వేషన్ల మౌళిక సిద్ధాంతాన్ని కదిలించడం మంచిది కాదు
ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో మొన్న ఎస్ సి రిజర్వేషన్ల సబ్ క్యాటగరైజేషన్ అంటే వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. నిజానికి ధర్మాసనంమీదున్న ఏడుగురు న్యాయమూర్తులలో ఆరుగురు ఈ రిజర్వేషన్లను లబ్ది పొందలేని వెనకబడిన వారికి అనుకూలంగా వర్గీకరించవచ్చని చెప్పారు. ఏడవ న్యాయమూర్తి జస్టిస్ ఎం బేలా త్రివేది మాత్రం వర్గీకరణను వ్యతిరేకించారు. దీనిని డిస్సెంట్ తీర్పు అంటారు. అంటే ఒక వర్గం ప్రజలకు (హోమోజీనస్ క్లాస్) రిజర్వేషన్లు కల్పించినపుడు మళ్లీ ఆ వర్గాన్ని సబ్ క్యాటగరైజ్ చేయడం సమంజసం కాదంటూ ఆమె సొంతంగా మరొక తీర్పు నిచ్చారు. ఆమె ఇచ్చిన డిస్సెంట్ తీర్పును హైదరాబాద్ నల్సార్ (NALSAR University of Law) మాజీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యలు విశ్లేషిస్తున్నారు.
జస్టిస్ బేలా ఎందుకు వ్యతిరేకించారు?
ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలోని ఆరుగురి తీర్పే నిలబడుతుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి బేలా గారు ఎస్సీ కులాల వారి వర్గీకరణను ఎందుకు వ్యతిరేకించారు అంటే కొంచెం చర్చ చేయవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఏడుగురిని సమర్థులైన న్యా యమూర్తులను ఎంపిక చేయడం వెనుక కారణం ఏమంటే ఒక్కో అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కనుక బాగు అన్నవారూ, వ్యతిరేకించినవారూ ఉంటారు. అందువల్ల మెజారిటీ సభ్యుల తీర్పును వ్యతిరేకిస్తూ సొంత తీర్పును వెలువరించినందున జస్టిస్ బేలా గారు ఏ తప్పూ చేయలేదు. ఇది రాజ్యాంగం ఆర్టికిల్ 14 ప్రకారమే జరిగింది. అంతేకాదు దీనికి మద్దతుగా ఆర్టికిల్ 15 చాలా వివరంగా ఉదాహరణలు కూడా అందిస్తుంది. ప్రతి తీర్పులో న్యాయమూర్తి రాజ్యాంగపరమైన సూక్ష్మంగా చర్చించిన అంశాలే ఉంటాయి. అందులో ఒక అంశంపైన ఈ ఆరుగురూ న్యాయమూర్తులు ఒప్పుకున్నారు.
ఎస్సీలంతా ఒకటే ఐనపుడు మరొక వర్గం వెనకబడిందంటూ ఎందుకు నిర్ణయించారు?
రాజకీయాలకు అతీతంగా, విభేదాలకు అతీతంగా ఉండడం కోసమే ఆర్టికిల్ 341 కింద అత్యున్నతమైన అధికారం రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చింది. అయినా ఈ అధికారం ఉపయోగించాలంటే రాష్ట్రపతి ఒక నిర్ణయానికి రావాలి. హైకోర్టులో వాదోపవాదాలు ఆ తరువాత సుప్రీంకోర్టులో అటూ ఇటూ వాదాలు చర్చించిన తరువాత, ఆరుగురు న్యాయమూర్తులు ఎస్సీ కులాల వర్గీకరణం సబబని సబబని అభిప్రాయపడ్డారు.ఈ తీర్పు ఆధారంగా వర్గీ కరణ చేసే అధికారాన్ని రాష్ట్రపతి, కేంద్ర పార్లమెంట్, రాష్ట్రాలలో శాసనసభలు వాడుకునే అవకాశం ఉంది. కేసు వ్యవహారానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాన్నాళ్ల కిందట ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ చేసింది. ఇపుడు సుప్రీంకోర్టు ఇలాంటి వర్గీకరణ చెల్లుతుందని చెప్పింది. అంటే రాష్ట్రపతి, చర్చించి, లోకసభ, వారితోపాటు ఆయా శాసనసభలు ఎస్సీ వారిని వర్గీకరించాలని వివరంగా చట్టాలు చేయాలి.
వెనుకబడిన వారైన ఎస్సీ కులాలన్నీ ‘ఒక వర్గం’ అన్నవిషయం తేల్చిన తరువాత, అందులో మరో ఎక్కువ లబ్ది పొందని వర్గం లేదా రిజర్వేషన్ ఫలాలు దక్కని మరొక వర్గం ఎందుకనేదే ఈ తగాదా? ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఎం బేలా త్రివేది వర్గీకరణను వ్యతిరేకిస్తూ కారణాలు వివరించారు. షెడ్యూల్ కులాల జాబితాలో సంస్కరణలు అంటూ రిజర్వేషన్ల మౌలిక సిద్ధాంతాన్ని దెబ్బతీయడం మంచిది కాదని ఆమె చెప్పారు. షెడ్యూల్ కులాను ఒక వర్గం చూసి రిజర్వేషన్లు ప్రకటించినపుడు మళ్లీ ప్రత్యేకంగా వెనకబడిన గ్రూపులు అనే వాదం తీసుకురావడం సరైన విధానం కాదని ఆమె అన్నారు. అసలు రిజర్వేషన్లు కల్పించిందే వెనుకబడిన ఎస్సీ వర్గానికి చేయూత ఇచ్చేందుకైనప్పుడు మళ్లీ వర్గీకరణ అవసరం ఏముందని జస్టిస్ బేలా అన్నారు.
ఇది ఆర్టికిల్ 341 ఈవర్గీకరణ వ్యతిరేకమా?
అసలు ‘‘షెడ్యూల్డ్’’ అనే మాట పేర్కొన్న అనే పేరు నుంచి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికిల్ 341 రాష్ట్రపతికే ఎస్సీకులాల అంతర్గత వర్గీకరణ పూర్తి అధికారం ఇచ్చింది. ఈ అధికారం ప్రధానమంత్రికి గానీ, వారి క్యాబినెట్ కు కూడా లేదు. అది రాజ్యాంగం కింద చేర్చిన ఎస్షీ కులాల ఎస్టీ తెగల ను నిర్ణయించే అధికారం కమిషన్ కు ఇచ్చారు. ఆ షెడ్యూల్ ను ఆ కమిషన్ వారే నిర్ణయిస్తారు. కమిషన్ తయారుచేసిన ఎసి కులాలజాబితాను ఆ తరువాత కేంద్రంలో లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి సిఫార్సు చేసిన తరువాత షెడ్యూల్ ను రాష్ట్రపతి ఆర్డర్ ఆమోదిస్తారు. కనుకనే అది హోమోజీనస్ సమూహం అని తేల్చారు. కనుక ఆ హోమోజీనస్ సమూహానికి ‘తూట్లు’ చేయరాదు. ఆ అధికారం రాజ్యాంగంలో లేదనీ, ఆ షెడ్యూల్డ్ లో ఒక్క సమూహంగా ఉన్న వారిని రెండు లేదా అంతకు మించిన వర్గాలు (సబ్ క్యాటగరైజేషన్) చేయడం, లేదా ఒక రకం లేదా రకరకాల కులాలుగా విభజించడం, ఉపవర్గంగా, లేదా సబ్ క్లాసిఫైయింగ్ లేదా మరికొన్ని రకాలుతా కులాలు, తెగలు, వంశాలు అని షెడ్యూల్డ్ ను పంచిపెట్టడం సరికాదు అని బేలా గారు అన్నారు. అంటే ఆ సమూహాన్ని విభజించడం తగదని అది న్యాయం కాదని ఆమె అన్నారు. అంతేకాదు, అది ఏకపక్ష నిర్ణయం కాకూడదు, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని వర్గీకరించడం చెల్లుబాటు కాదని ఆమె అన్నారు.
అయితే ఎస్సీ కులాలలో ఒక వర్గాన్ని బాగా వెనుకబడినదని గుర్తించగలగడం ఇపుడుముఖ్యం. నిజంగా ఒకే వర్గంగా వెనుకబడిన ప్రజా సమూహానికని రిజర్వేషన్ ప్రకటించినపుడు ఈ రిజర్వేషన్ ఫలాలు కొందరికే అందుతూ ఉంటే మిగిలిన వారు ఊరికే కూర్చోవడం కరెక్టా? అందుకో పోరాటం. అందుకు అందులోరాజకీయాలు చేరతాయి. కాదంటాయి, అవునంటాయి. గత ఇరవై ఏళ్ల చరిత్ర అంతా ఇదే. ఎక్కడా ఏకాభిప్రాయం రాలేదు.
ఇరవై ఏళ్ల తరువాత ఒక అంగీకారానికి సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చారు. అంతకుముందు హైకోర్టులు రకరకాలుగా వర్గీకరణను వ్యతిరేకించడం జరిగింది.
జస్టిస్ బేలా గారివలెనే అంతకుముందు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకమన్నాయి. ఈ సెక్షన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో రాజకీయ ప్రమేయాన్ని నిషేధిస్తుందని చెప్పారు. అయితే ఇది అవగాహనాన్ని బట్టింది ఉంటుంది.
ధర్మాసనంలో ఏడుగురు న్యాయమూర్తులు కలిసి ఓ చోట కూచుని చర్చించే అవకాశం ఉండదు. ఎవరికి వారు విడిగా తీర్పు ఇచ్చే స్వేచ్ఛ ఉంది. కనుక కొందరు వ్యతిరేకించవచ్చు. ఒక్కోసారి తీర్పు ప్రతి కూడా ముందే ఇవ్వకపోవచ్చు. అది స్వేచ్ఛకు, స్వతంత్య్రా నికి సంబంధించిన అంశం. ఇది ఆర్టికిల్ 19(ఏ) లోని స్వేచ్ఛకు సంబంధించిన అంశం కూడా. అదే విధంగా 19(ఏ) కింద జస్టిస్ బేలా ఆలోచన సరికాదనే స్వేచ్చ కూడా ఈ రచయితకు ఉంది. కనుక ఈ అవగాహన ఆమె ఒప్పుకోలేదు. ఎందుకో తెలియదు. అందుకుకారణాలు కూడా చెప్పవలసిన అవసరం లేదు.
షెడ్యూల్ కులాలకు ప్రత్యేక హోదా కల్పించేందుకు రిజర్వేషన్ వ్యవస్థ ఉందని, ఇందులో ఏ విధంగా మార్పులు చేయాలన్నా రాష్ట్రపతి ద్వారానే జరగాలన్నారు. అక్కడ ఆరుగురే కాదు, అందరూ ఆ అంశాన్ని ఒప్పుకుంటున్నారు. రాజకీయ కారణాల్ని దృష్టిలో ఉంచుకుని ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించలేదని చెప్పారు.
ఒకే గాటిన కట్టకూడదు
కాని ఒక కులంలో కొందరు మంది ఎక్కువ విద్యా ఉద్యోగావకాశాలను సాధంచగలిగే శక్తి ఉన్నవారు కొందరు తక్కువగా ఉన్నవారననే నిజాన్ని కాదనలేం? ఈ విషయంలో ఆరుగురు సభ్యులు ఒక అభిప్రాయానికి, మరొకరు భిన్నాభిప్రాయానికి రావడంతో 6-1 మెజారిటీతో వర్గీకరణకు అంగీకరించి సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు ఇచ్చింది. ఈ కారణంలో ఒక ప్రధానమైన అంశం లేదా కీలకమైన సూత్రం ఈ మాట. 'హోమోజీనస్ క్లాస్' దాన్ని ఒకే గాటి కి కట్టకూడదు.
న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్ తీర్పు
కులం, సామాజిక స్థితిగతులు, ఆర్ధిక పరిస్థితుల ఆధారంగా అందరికీ రిజర్వేషన్లు కల్పించడం కంటే ఒక కుటుంబంలో ఒక తరానికే పరిమితం చేస్తే మంచిదని మరో న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్ తెలిపారు.
జస్టిస్ చంద్ర శర్మ
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండటం సరైందేనన్న మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని మరో సభ్యుడు జస్టిస్ చంద్ర శర్మ తెలిపారు.
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఉప కులాలను 'హోమోజీనస్ క్లాస్' (ఒకే సమూహంగా భావించలేమని) కాదని, వారి జనాభా గణాంకాలు, సామాజిక ఆర్థిక పరిస్థితుల వంటి డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించవచ్చని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు.
మెజార్టీ తీర్పు
రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం ఎస్సీలు సజాతీయులు కాబట్టి వర్గీకరణ చేయడానికి వీలు లేదంటూ ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం’ కేసులో 2004లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ ఏడుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో నేటి అసమ్మతి జడ్జి (జస్టిస్ బేల) ఆలోచన కూడా అదే నాటి జస్టిస్ చిన్నయ్య తీర్పు లాంటిదే.